For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu September 10th Episode: మల్లిక గండం నుంచి తప్పించుకున్న జానకి.. జస్ట్ మిస్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతోంది కానీ అసలైన ట్విస్టును మాత్రం మరింత ఎక్కువగా సాగదీస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక ఆ సాగదీయడంలోనే మంచి సన్నివేశాలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఐపీఎస్ కావాలని అశయంతో అత్తగారికి తెలియకుండా బిజీగా చదువుతున్న జానకి గుట్టు అందరికి తెలిసిపోతుందని అనుకుంటున్న సమయంలో ఎదో ఒక ఘటనతో సేఫ్ జోన్ లోకో వచ్చేస్తోంది. భర్త రామచంద్ర జాగ్రత్తల వలన తృటిలో తప్పించుకున్న జానకి అత్త ముందు దోషిగా నిలబడే పరిస్థితి ఎదుర్కోబోతోందని అనుకున్న తరుణంలో మల్లిక ప్రణాళికలు ఒక్కసారిగా బెడిసికొట్టాయి. మల్లిక అసలు నిజాన్ని అత్త ముందు ఉంచడానికి చాలా ఆతృతగా ఎదురుచూసింది. కానీ ఆమె అనుకున్నవన్ని కూడా రివర్స్ అయ్యాయి. దీంతో సీరియల్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా జానకి అత్త మాటకు ఎదురు చెప్పడంతో ఒక్కసారిగా జ్ఞానాంబ ఇంట్లో వాతావరణం మారిపోయింది. ఇక నేడు ప్రసారం కాబోయే 124వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  జానకిని ఇంట్లో నుంచి పంపెయ్యాలని..

  జానకిని ఇంట్లో నుంచి పంపెయ్యాలని..

  జానకి ఐపీఎస్ చదువు కోసం ప్రిపేర్ అవుతుంది అని తెలుసుకున్న మల్లిక ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇదే విషయాన్ని ఎలాగైనా అత్త ముందు ఉంచి జానకిని ఇంటి నుంచి బయటకు వెళ్లేలా చేయాలని ప్లాన్ వేస్తుంది. అలా చేస్తే ఇంటి పెత్తనం మొత్తం తనకు ఇస్తారని ఆశ పడుతుంది. అలాగే జ్ఞానాంబ కూడా మల్లికకు సమాన న్యాయం చేయాలని ఇంటి పెత్తనం కూడా ఇవ్వాలని అనుకుంటుంది. అదే విషయాన్ని మల్లిక భర్త ఫోన్ చేసి చెబుతాడు.

  నడిరోడ్డుపై పగటి కలలు

  నడిరోడ్డుపై పగటి కలలు

  భర్త చెప్పిన గుడ్ న్యూస్ తో ఒక్కసారిగా సంబరపడిపోయిన మల్లిక నడి రోడ్డులోనే పగటి కలలు కంటూ సంబరపడిపోతుంది. జ్ఞానాంబను కూడా ఏమాత్రం లెక్కచేయకుండా మరిది చదువును కూడా అపెయ్యాలని అనుకుంటుంది. అలాగే రామచంద్ర షాప్ నుంచి రాగానే డబ్బులు కూడా తన చేతికి అందించేలా చేయాలని ఆలోచిస్తుంది. ఇంకా ఇంటి పెత్తనం తన చేతికి వచ్చినట్లే అని సంబర పడిపోయిన మల్లిక నడిరోడ్డు మీద కలలు కంటుంది. ఇక మల్లికను చూసిన జనాలు పగలబడి నవ్వుతారు. ఇక అవేమి పట్టించుకోకుండా మల్లిక ఎంతో ఎనర్జీతో ఇంటికి బయలు దేరుతుంది.

  జ్ఞానాంబ నిర్ణయం తప్పు

  జ్ఞానాంబ నిర్ణయం తప్పు

  కొడుకు కోసం చదువుకోలేని అమ్మాయిని కోడలిగా తేవాలని జ్ఞానాంబ జిల్లా మొత్తం తిరిగింది. ఇప్పుడు జానకి ఐపీఎస్ చదువుకున్నట్లు తెలిస్తే తప్పకుండా ప్రేమ తగ్గి ఆమెను ఇంటి నుంచి బయటకు నెట్టివేసి అవకాశం ఉంటుందని మల్లిక ఆలోచిస్తుంది. ఇక మరోవైపు జ్ఞానాంబ ఇంటి పెత్తనాన్ని మల్లిక చేతిలో పెట్టాలని ఇంట్లో పూజ కూడా చేస్తుంది. ఇక ఆ సమయంలో గోవిందరాజులు జ్ఞానాంబ నిర్ణయాన్ని తప్పు పడతాడు. అదే విషయాన్ని అందరికీ చెబుతాడు. వెంటనే ఇంటికి బాధ్యతలు జానకి తీసుకుంటే బాగుంటుంది అని చెబుతాడు.

  జనాకికి మద్దతుగా..

  జనాకికి మద్దతుగా..

  ఇక జానకికి బాధ్యతలు ఇవ్వాలని వెన్నెల, విష్ణు కూడా మద్దతు పలుకుతారు. మల్లిక చేతికి తాళాలు అప్పగిస్తే కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు అని, తప్పకుండా ఇంటిని రెండు ముక్కలు చేస్తోందని సలహా ఇస్తారు. జానకి బాధ్యతలు తీసుకుంటే అందరినీ సమానంగా చూస్తోందని గోవింద రాజు అర్థమయ్యేలా ఒప్పించాలని అనుకుంటాడు. కానీ జానకి మాత్రం అందుకు ఒప్పుకోకుండా.. ఇదివరకే ఇంటి బాధ్యత తీసుకోను అని చెప్పాను. మళ్లీ ఇప్పుడు ఆ విషయాన్ని నా ముందుకు తీసుకు రావద్దని అందరికీ సమాధానం ఇస్తుంది. అప్పుడే పూజ గదిలో నుంచి జ్ఞానాంబ బయటకు రావడంతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అవుతారు.

  మల్లికను సమానంగా చూడాలని

  మల్లికను సమానంగా చూడాలని

  జ్ఞానాంబ రాగానే గోవిందరాజులు మరోసారి ఆమె తీసుకున్న నిర్ణయంపై సరికాదని చెబుతాడు. అందుకు జ్ఞానాంబ నేను ఇదివరకు ఒకసారి సమాధానం ఇచ్చాను. మల్లికను కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత అందరికీ ఉందని లేకపోతే విభేదాలు తలెత్తి, నన్ను కూడా ఈ విషయంలో ప్రకటిస్తుందని జ్ఞానాంబ వివరణ ఇస్తుంది. ఇక అప్పుడే మల్లిక కూడా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. హడావిడిగా ఇంట్లోకి వచ్చిన మల్లిక ఒక భయంకరమైన నిజాలు చెప్పడానికి వచ్చాను అని అంటుంది. జానకిలో కూడా కొంత ఆందోళన కలుగుతుంది.

  మల్లిక తొందరపాటు

  మల్లిక తొందరపాటు

  జానకి పరీక్షల్లో పాసైన విషయం పేపర్లో ఉండడంతో దాన్ని అత్తకు చూపించాలని అనుకుంటుంది. అయితే అప్పుడే మల్లిక తొందరపాటు వలన చేతిలో ఉన్న హారతి పళ్లెం కింద పడుతుంది. అప్పుడే దాని కింద పేపర్ ఉండడంతో హారతి పడి అది కాలిపోతుంది. దీంతో సాక్ష్యం లేకుండా నిజం చెబితే కావాలని జానకిపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నానని జ్ఞానాంబ కొట్టే అవకాశం ఉందని మల్లిక అసలు విషయం దాస్తుంది. ఇక ఇంటి పెత్తనం కూడా ఇవ్వడం జరగదని జ్ఞానాంబ మరోసారి నిర్ణయాన్ని మార్చుకుంటుంది. అందుకు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో సంతోషిస్తారు.

  Daare Leda Team interview part 3. Real life doctor roopa Shares her life experiences In covid times
  వైజయంతి ఇంట్లో జానకి ఫోటో

  వైజయంతి ఇంట్లో జానకి ఫోటో

  ఇక ఆ తర్వాత వైజయంతి ఇంటికి వెళ్లిన జ్ఞానంభ అక్కడ ఆమె సహాయం. కొరడంతో ఐదు లక్షల రూపాయల సహాయాన్ని అందిస్తుంది. అయితే అక్కడ జానకి ఫోటోలు కనిపించడంతో గోవిందరాజులు షాక్ అవుతాడు. డిగ్రీ పట్టా అందుకున్న ఫొటో టేబుల్ మీద ఉండడంతో దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటనే వాళ్లు తెలుసుకోవాలని అనుకుంటారు. మరి జానకు చదువుకున్న విషయం వారికి తెలుస్తుందో లేదో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 125:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X