Janaki Kalaganaledu September 12th: జెస్సి ప్రేమ విషయంలో మాట మార్చిన అఖిల్.. జానకి మైండ్ బ్లాక్!

జానకి కలగనలేదు సీరియల్ ఇటీవల జనాల్లో మంచి ఆదరణను పెంచుకుంటోంది. ఇక భర్త రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఫైనల్ గా జానకి చదువుకోవడానికి అత్త జ్ఞానాంబ ఓకే అంటుంది. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 386 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

అఖిల్ ప్రేమ వివాదం

అఖిల్ ప్రేమ వివాదం

జానకి మరిది అఖిల్ కారణంగా జెస్సి అనే అమ్మాయి గర్భవతి అవుతుంది. జెస్సి చదువుతున్న కాలేజీ లోనే జానకి కూడా ఐపీఎస్ కు సంబంధించిన కోచింగ్ తీసుకుంటూ ఉండడంతో అక్కడ ఆమెకు పరిచయం ఏర్పడుతుంది. అఖిల్ ఆమె మరిది అని తెలుసుకుని జెస్సీ తనపై ప్రేమ గురించి ఇంట్లో మాట్లాడమని జానకికి చెబుతుంది.

అయితే ఆ తర్వాత ఆమె గర్భవతి అయిన విషయాన్ని కూడా చెబుతుంది. అయితే జెస్సికి న్యాయం చేయాలని జానకి ఎంతగానో ఆలోచిస్తుంది. కానీ అఖిల్ తల్లి జ్ఞానాంబ మాత్రం ఇప్పుడే అఖిల్ కు వివాహం చేయకూడదు అనుకుంటుంది. అతను ఇంకా పెద్ద చదువులు చదవాలి అని అప్పటి వరకూ కూడా పెళ్లి ప్రస్తావన తీసుకు రాకూడదు అని కూడా అనుకుంటుంది. ఈ తరుణంలో జానకికి తన అత్తగారికి అఖిల్ జెస్సి విషయం గురించి ఎలా చెప్పాలో అర్థం కాదు.

మీ పరువు కూడా పోతుంది

మీ పరువు కూడా పోతుంది

అయితే మరోవైపు జెస్సి తల్లిదండ్రులు జానకి పై తీవ్రంగా ఒత్తిడి పెడుతుంటారు. అసలైతే వాళ్లు మొదట పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అని అనుకుంటారు. అంతకు ముందు ఒకసారి జానకి వారితో మాట్లాడుతుంది. పోలీస్ స్టేషన్ వరకు వెళితే మీ పరువు కూడా పోతుంది అని అందుకే నాకు కొంత సమయం ఇస్తే మా ఇంట్లో మాట్లాడి చెపుతాను అని తప్పకుండా జెస్సి అఖిల్ పెళ్లి జరిగేలా చూస్తానని జానకి మాట ఇస్తుంది.

అయితే వాళ్ళు జెస్సిని మీ ఇంటికి తీసుకు వెళ్లి పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలి అని చెబుతారు. అందుకు జానకి కూడా ఒప్పుకుంటుంది. అయితే జానకిని జెస్సి తనతో పాటు అత్తగారి దగ్గరకు తీసుకు వెళుతుంది.

మల్లిక మరో ప్లాన్

మల్లిక మరో ప్లాన్

అయితే అంతకు ముందే జానకిని వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలు దగ్గరుండి చూసుకోవాలని జ్ఞానాంబ చెబుతుంది. కానీ జెస్సి అఖిల్ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఉండాలి అని జానకి వెళుతుంది. ఆ విషయం జానకి తన అత్త గారి తో మాట్లాడాలి అని అనుకుంటుంది. ఆ విషయం ఏమిటో చెప్పాలి అని అక్కడ అడిగినప్పటికీ అది నాలుగు గోడల మధ్య లో మాట్లాడిన విషయం అని అంటుంది.

ఇక జ్ఞానాంబ పూజ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంది. ఇక పూజ అయిపోయిన తర్వాత జానకి అఖిల్ ప్రేమ గురించి మాట్లాడుతుంది. మరోవైపు మల్లిక అసలు వీరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఆ కారణం తెలుసుకున్న తర్వాత అందుకు తగ్గట్టుగా పుల్లలు కూడా పెట్టాలి అని అనుకుంటుంది.

జ్ఞానాంబ ముందు నిజం చెప్పిన జానకి

జ్ఞానాంబ ముందు నిజం చెప్పిన జానకి

మొత్తానికి అఖిల్ జెస్సీ ప్రేమించుకున్నట్లు జానకి వారి అత్త జ్ఞానాంబకు చెబుతుంది. అసలే జెస్సి ప్రవర్తనకు శత్రువైన జ్ఞానాంబ ఇప్పుడు అఖిల్ తనను లవ్ చేసినట్లు జానకి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అఖిల్ ను తల్లి జ్ఞానాంబ అడగడం అందులో నిజం లేదమ్మా అని మళ్ళీ ఒక్కసారిగా మాట మారుస్తాడు. అనంతరం జానకి ఆమె గర్భవతి కూడా అయ్యిందని చెప్పగానే మరింతగా షాక్ అవుతారు. ఇక జానకి వదిన అబద్ధం చెబుతోంది అని జెస్సి కావాలని మోసం చేయడానికి ప్రవర్తిస్తుంది అని కూడా అఖిల్ అబద్ధం చెబుతాడు.

 మాట మార్చిన అఖిల్

మాట మార్చిన అఖిల్

అలాగే జెస్సి మరొకరిని ప్రేమించిందని అతను వెళ్లిపోయాక తనను మోసం చేయాలని అనుకుంటున్నట్లు లేనిపోని అబద్ధాలు చెబుతాడు. ఆ మాటలకు జానకి కూడా షాక్ అవుతుంది. అయితే ఈ విషయంలో జ్ఞానాంబ అఖిల్ ను మరోసారి అడుగుతుంది. అంతే కాకుండా తన మీద ఒట్టు వేసి చెప్పాలని అంటుంది. అయినప్పటికీ అఖిల్ జెస్సితో తనకు సంబంధం లేదని అంటాడు.

ఇక జానకి అఖిల్ మాటలకు ఆశ్చర్యపోయి వీరు ప్రేమించుకున్నప్పుడు దిగిన ఫొటోలు ఉన్నాయి అని అన్నప్పుడు మళ్ళీ అఖిల్ ఆమె వేరే వ్యక్తి తో ఉన్న ఫొటోలను తల్లికి చూపిస్తాడు. ఆ ఫొటోలు మార్ఫింగ్ చేసి తనను మోసం చేయాలనీ అనుకుంటుంది అని తను చెప్పిన మాటలు జానకి వదిన కూడా నమ్ముతుంది అని అంటాడు. దీంతో జ్ఞానాంబ కొడుకు మాటలు నమ్మి జానకి ని హెచ్చరిస్తోంది. మరి ఫైనల్ గా జానకి జెస్సి అఖిల్ ప్రేమ విషయాన్ని అత్తగారి ముందు ఎలా బయటపెడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X