For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu September 13th Episode: భర్తకు దగ్గరైన జానకి.. అఖిల్ గొడవతో న్యూ ట్విస్ట్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారుతోంది. ఐపీఎస్ కావాలన్న కోరికతో అత్తగారింట్లో అడుగుపెట్టిన జానకి ఊహించని అనుభవాలను ఎదుర్కొంటోంది. అయితే కోడలు చదివితే కాపురం సరిగ్గా కొనసాగదు అనే ఆలోచనతో ఉండే అత్తగారికి తెలియకుండా జానకి తన చదువును ఎలా పూర్తి చేస్తుంది అనే పాయింట్ హైలెట్ గా నిలుస్తోంది. ఇక జానకి కోరికను తన భర్త ద్వారా నెరవేర్చుకునేందుకు అడుగులు వేస్తుంది. జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా మరొక పరీక్ష కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

  ఇక ఇదే సమయంలో మల్లిక వేసే ప్లాన్స్ కూడా జానకి భయపడతాయి. రామచంద్ర కూడా జానకి కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటాడు. మల్లిక అసలు నిజాన్ని అత్త ముందు ఉంచడానికి చాలా ఆతృతగా ఎదురుచూసింది. కానీ ఆమె అనుకున్నవన్ని కూడా రివర్స్ అయ్యాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 124వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)

  మల్లిక తొందరపాటు

  మల్లిక తొందరపాటు

  గతంలో జానకి పరీక్షల్లో పాస్ అయినప్పుడు ఫోటో ఒక పేపర్ లో రావడంతో ఆ పేపరు అత్త జ్ఞానాంబ ముందు ఉంచాలని మల్లికా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. మొత్తానికి ఆ పేపర్ ను ఇంటికి తెచ్చి జ్ఞానాంబకు చూపించాలని అనుకుంటున్న సమయంలో ఊహించని చేదు అనుభవం ఏర్పడుతుంది.

  అదే సమయంలో జ్ఞానాంబ ఇంట్లో అందరికీ హారతులు ఇస్తుండటంతో మల్లిక హడావిడిగా ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇక ఆ తొందరపాటులో తన చేతిలో ఉన్న పేపర్ కింద పడిపోతుంది. ఆ తర్వాత మళ్ళి చేయి తగిలి అత్త చేతిలో ఉన్న హారతి పళ్ళెం కూడా కింద పడిపోతుంది. ఆ తర్వాత హారతి పేపర్ పై పడే మొత్తం కాలిపోతుంది.

  ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర హీరో గోపిచంద్ సందడి.. సీటీమార్ అంటూ..

  తృటిలో తప్పించుకున్న జానకి

  తృటిలో తప్పించుకున్న జానకి

  ఆ పేపర్ ను అత్తకు చూపించి ఎలాగైనా జానకి ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలని మల్లిక వేసిన ప్లాన్ ఒక్కసారిగా రివర్స్ అవుతుంది. కళ్లముందే సాక్ష్యం కాలిపోతుంటే ఏమి చేయలేక మల్లికా దీనంగా నిలబడుతుంది. మళ్ళీ సాక్ష్యం లేకుండా నిజం చెప్పినా కూడా తన అనవసరంగా మళ్ళి తనను తిడుతుందని అని భయపడి మల్లిక సైలెంట్ అయిపోతుంది.

  ఇంకా ఆ తర్వాత ఏమి చేయ లేక ఏడుస్తూ కూర్చుంటుంది. ఇక మల్లిక గండం నుంచి తప్పించుకున్నాను అని జానకి కూడా సంతోషంగా చదువుకుంటూ ఉంటుంది. మొన్నటి వరకు కాస్త దూరంగా ఉన్న భర్త కూడా మళ్ళీ జానకికి దగ్గరవుతాడు.

  చిరంజీవి ఇంట్లో యంగ్ హీరో సందడి: మెగాస్టార్ బొమ్మ ఉన్న షర్ట్ వేసుకుని మరీ రచ్చ చేసేశాడుగా!

  భర్త కష్టపడకూడదని..

  భర్త కష్టపడకూడదని..

  అయితే అదే సమయంలో జానకి భర్త తో తన కోచింగ్ కోసం కావాల్సిన డబ్బు గురించి మాట్లాడుతుంది. కానీ ఆ డబ్బు చాలా ఎక్కువ అవుతుందని కూడా చెబుతుంది. రామచంద్ర కొంత ఆలోచనలో పడతాడు. 100 రూపాయలు కావాలన్నా కూడా అమ్మ దగ్గరికి వచ్చి తీసుకుంటాను. ఇక వేళల్లో ఉంటుంది అంటే కాస్త ఆలోచించాలి. కానీ ఎలాగైనా సరే నేను చూసుకుంటాను అని మరోసారి భార్యకు భరోసా ఇస్తాడు. ఇక మరో సారి భర్త కష్ట పడకూడదని జానకి తన తల్లిదండ్రులు ఇచ్చిన బంగారాన్ని తాకట్టు పెట్టాలని అనుకుంటుంది. ఎలాగైనా దాన్ని అమ్మేసి ఆ డబ్బుతో కోచింగ్ కోసం ఫీజు కట్టాలి అని అనుకుంటుంది

  వైజయంతికి ఐదు లక్షల సహాయం

  వైజయంతికి ఐదు లక్షల సహాయం

  ఇక మరోవైపు జ్ఞానాంబ స్నేహితురాలు అయినటువంటి వైజయంతి అప్పుడే ఫోన్ చేస్తుంది. హఠాత్తుగా ఒక ముఖ్యమైన పని పడింది అని అందుకోసం ఐదు లక్షలు కావాలని తప్పకుండా ఒక వారంలో తిరిగి ఇచ్చేస్తానని వైజయంతి సహాయం అదిగుతుంది. ఇక మొదట ఆలోచించినప్పటికీ.. జ్ఞానాంబ అందుకు ఒప్పుకుంటుంది.

  గోవిందరాజులు కాస్త ఆలోచించమని చెప్పినప్పటికీ కూడా జ్ఞానాంబ ఏమి కాదులేండి అంటూ వైజయంతి పై నమ్మకం గా మాట్లాడుతుంది. తర్వాత ఇంటికి వెళ్లి వైజయంతీకి 5 లక్షల రూపాయలను చేతిలో పెడతారు. అయితే అప్పుడే టేబుల్ పైన వైజయంతి కూతురు గ్రాడ్యుయేషన్ డే కు సంబంధించిన ఫోటోలను కూడా పెడుతుంది. అయితే ఆ ఫోటోలను ఒక దగ్గర జానకి ఫోటో కూడా ఉంటుంది

  Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
  అఖిల్ గొడవలో జానకి..

  అఖిల్ గొడవలో జానకి..

  జ్ఞానాంబ భర్త గోవిందరాజులు ఆ ఫోటోలు చూస్తూ ఉంటాడు. కానీ పక్కనే ఉన్న జానకి ఫోటోలు మాత్రం పెద్ద గమనించడు. ఇక ఆలస్యం అవుతుందని జ్ఞానాంబ అప్పుడే భర్తను తీసుకొని బయటకు వెళుతుంది. ఆ తర్వాత వినాయక చవితి సందర్భంగా ఇంట్లో అందరూ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో మల్లిక గడపకు పసుపు రాస్తూనే తిట్టుకుంటూ.. అత్తపై పగ తీర్చుకోవాలని అనుకుంటుంది.

  అదే సమయంలో అక్కడికి వచ్చిన జ్ఞానాంబ త్వరగా పనులు చేయాలని మరోసారి కసురుకుంటుంది. ఆ తర్వాత చిన్న కొడుకు అఖిల్ ఎక్కడ అంటూ అని అడుగుతుంది. అయితే అఖిల్ మాత్రం రోడ్డు మీద ఎవరితో గొడవ పడుతూ ఉంటాడు. అది చూసిన జానకి వెంటనే వారికి అడ్డుపడి అఖిల్ ను వెనక్కి లాగుతుంది.

  ఏం జరిగిందని అడిగితే అప్పుగా డబ్బులు తీసుకొని చాలా రోజులు అయింది.. అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడు అని చెబుతారు. ఇక వారి మాటలకు ఒక్కసారిగా షాక్ అయినా జానకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 126
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X