Janaki Kalaganaledu September 13th: అత్తని నమ్మించలేకపోయిన జానకి.. మరోసారి రామ సపోర్ట్

జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరమైన కథాంశంతో జనాల్లో మంచి ఆదరణను పెంచుకుంటోంది. ఇక భర్త రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఫైనల్ గా జానకి చదువుకోవడానికి అత్త జ్ఞానాంబ ఓకే అంటుంది. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 387 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

తల్లి మీద ఒట్టు వేసిన అఖిల్

తల్లి మీద ఒట్టు వేసిన అఖిల్

జానకి చిన్న మరిది అఖిల్ జెస్సి అనే అమ్మాయిని ప్రేమించి ఆమెకి గర్భం వచ్చేలా చేస్తాడు. అయితే ఆ విషయం ఇంట్లో తెలుస్తుంది అని అతను ఊహించని విధంగా ప్లాన్ వేస్తాడు. కానీ మరోవైపు జానకి మాత్రం జెస్సికి ఎలాంటి అన్యాయం జరగకూడదు అని ఆలోచిస్తుంది. ఆ విషయాన్ని ఎలాగైనా ఇంట్లో అత్తగారికి చెప్పి జెస్సి అఖిల్ పెళ్లి చేయాలని కూడా అనుకుంటుంది. కానీ అఖిల్ మాత్రం తల్లికి భయపడి జెస్సి గర్భవతి అవ్వడానికి తనకు ఎలాంటి సంబంధం లేదు అని ఇంతకుముందే ఆమె మరొకరితో తిరిగింది అని అబద్ధం చెబుతాడు. అంతేకాకుండా తన తల్లి జ్ఞానాంబ మీద కూడా ఒట్టు వేస్తాడు. ఈ క్రమంలో జానకి ఎంత చెప్పినా కూడా జ్ఞానాంబ ఆ మాటలను నమ్మడానికి ఆసక్తి చూపించదు. అంతేకాకుండా నేను ఈ ఇంటి బాధ్యతలను పెద్ద కోడలిగా నీకు అప్పగిస్తున్నాను. కానీ నువ్వు నీ దృష్టిని ఎక్కడో పెడుతున్నావు. అనవసరంగా అఖిల్ పై నిందలు వేయాలనుకోవడం కరెక్ట్ కాదు అని అంటుంది.

జానకి నిజం చెప్పినా..

జానకి నిజం చెప్పినా..

అయితే జానకి మాత్రం ఈ తప్పు జరిగింది నిజమే అని అఖిల్ చేసిన తప్పుకు జెస్సి ఏదైనా చేసుకుంటే ఆ తర్వాత మనందరం బాధపడాల్సి వస్తుంది అని అంటుంది. అయితే ఆ అమ్మాయిని ఒక నాలుగు రోజులు ఇంట్లో ఉండనిద్దాము అని ఆ తర్వాత మీకు నచ్చకపోతే ఆ తర్వాత మీరు ఏం చెప్పినా మీ ఇష్టం అని ఈ ఒక్కసారి నా మాట నమ్మాలి అని జానకి రిక్వెస్ట్ చేస్తుంది. తప్పకుండా నిజాన్ని నిరూపిస్తానని కూడా అంటుంది. కానీ జ్ఞానాంబ మాత్రం అందుకు ఒప్పుకోదు. నీకు నాలుగు రోజుల సమయం ఇస్తున్నాను అప్పటిలోపు నిజాన్ని నిరూపించాలి. కానీ ఆ అమ్మాయిని మాత్రం ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అని జ్ఞానాంబ తెగేసి చెబుతుంది.

భార్యకు మద్దతుగా రామచంద్ర

భార్యకు మద్దతుగా రామచంద్ర


ఇక అఖిల్ కూడా జానకి అడుగుతున్న విధానానికి కొంత భయపడతాడు. ఆ తరువాత ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ విషయంలో ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ భర్త రామచంద్ర మాత్రం జానకికి ఆ విషయంలో మద్దతుగా నిలుస్తాడు. మీరు ఇంటి కోసం ఎంతగానో ఆలోచిస్తారు. అలాంటిది మీరు ఇంత గట్టిగా చెబుతున్నారు అంటే ఏదో ఉంటే ఉంటుంది అని ఈ విషయంలో నేను మీకు సపోర్ట్ చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత జెస్సి దగ్గరకు వెళ్లి మీ తల్లిదండ్రులతో మరోసారి మాట్లాడుతామని కొంత సమయం కావాలి అని అంటారు.

రామచంద్ర రిక్వెస్ట్

రామచంద్ర రిక్వెస్ట్


అయితే జెస్సీ తల్లిదండ్రులు జానకి రామచంద్ర ఎంత చెప్పినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గరు. మొదట మీరు మాట్లాడతారని ఒక అవకాశం ఇచ్చాము. కానీ ఒక ఆడపిల్ల జీవితం నలుగురిలో అల్లరి పాలు కాకముందే జ్ఞానాంబ గారితో నేను మాట్లాడతాను అంటూ జెస్సి ఫాదర్ అంటాడు. అయితే రామచంద్ర అతన్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది అంటే నేను ఎంత మాత్రం సహించను. ఎందుకంటే నాకు ఇంట్లో ఒక చెల్లెలు ఉంది. కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మా ఇంట్లో జానకి గారు అసలు విషయం చెప్పినప్పటికీ కూడా మా అమ్మగారు ఒప్పుకోలేదు. కాబట్టి మేము మాట్లాడడానికి మరొక నాలుగు రోజులు సమయం కావాలి అని అడుగుతాడు.

జెస్సి తండ్రి ఆఖరి అవకాశం

జెస్సి తండ్రి ఆఖరి అవకాశం

అందుకు జెస్సి తండ్రి కూడా ఒప్పుకుంటాడు. కానీ నాలుగు రోజుల తర్వాత పెళ్లి విషయం తేల్చుకోకపోతే పద్దతిగా జరగాల్సిన పెళ్లి పోలీస్ స్టేషన్లో జరిగుతుందని హెచ్చరిస్తాడు. ఇక తర్వాత జానకి భర్త చేస్తున్న సహాయానికి ఎంతగానో ఆనందపడుతుంది. అయితే ఈ విషయం నేను చూసుకుంటానని ముందు మీరు మీ చదువుపై దృష్టి పెట్టాలి అని జానకికి రామచంద్ర చెబుతాడు. కానీ జానకి మాత్రం అఖిల్ చేసిన తప్పు గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటుంది.

 తప్పించుకుంటున్న అఖిల్

తప్పించుకుంటున్న అఖిల్


ఇక అఖిలతో రామచంద్ర మాట్లాడాలని కూడా అనుకుంటాడు. కానీ అతను దొరక్కుండా తిరుగుతూ ఉంటాడు. చివరికి అఖిల్ తన తల్లి దగ్గరికి వెళ్లి ఒడిలో పడుకుంటాడు. ఈ సమయంలో అన్నయ్యకు ఒంటరిగా దొరికితే ఏదో ఒకటి అనుమానం వ్యక్తం చేసేలా మాట్లాడుతాడు అని అందుకే అమ్మ దగ్గరే ఉండాలి అని అనుకుంటాడు. మరి ఈ విషయంలో రామచంద్ర నిజాన్ని ఎలా ఒప్పిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X