Janaki Kalaganaledu September 14th Episode: రెండు గాజులు అమ్ముకున్న జానకి.. అతని కోసం తప్పలేదు!

జానకి కలగనలేదు సీరియల్ కలర్ఫుల్ ఎమోషన్స్ తో రోజురోజుకు సరికొత్తగా ఆకట్టుకుంటోంది. ఎలాగైనా ఐపీఎస్ కావాలని జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా చదువుకుంటూ ఉండడం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఆమెకు భర్త రామచంద్ర కూడా మద్దతుగా ప్రతి విషయంలో తోడుగా నిలుస్తాడు. అయితే చదువుకున్న కోడలు ఇంట్లో ఉంటే కాపురం సాఫీగా సాగదు అనే అనుమానం వల్ల జ్ఞానాంబ చదువుకోవలేని కోడలిని ఇంటికి తెచ్చుకోవాలని అనుకుంది. ఇక చదువుకోలేదు అని చెప్పి అబద్ధం చెప్పి ఇంట్లో అడుగుపెట్టిన జానకి తన ఐపీఎస్ కలను ఇలా సాధిస్తుంది అనేది అందరిలో ఆసక్తి కలిగిస్తోంది.

మరోవైపు చిన్న కోడలు మల్లిక వలన జానకి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉంటుంది. మరోవైపు ఇంట్లో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా జానకి బాధ్యతగా తీసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తోంది. ఇక మల్లిక అసలు నిజాన్ని అత్త ముందు ఉంచడానికి చాలా ఆతృతగా ఎదురుచూసింది. కానీ ఆమె అనుకున్నవన్ని కూడా రివర్స్ అయ్యాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 124వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

చిన్న కొడుకు ఇంటికి రాకపోవడంతో..

చిన్న కొడుకు ఇంటికి రాకపోవడంతో..

ఇంట్లో వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా పూజ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. రామచంద్ర తో పాటు జానకి గోవిందరాజులు కూడా ఇంటిని ప్రత్యేకంగా మామిడి ఆకులతో తోరణాలతో అలంకరిస్తూ ఉంటారు. అయితే పూజ సామాను తీసుకురావాలని జ్ఞానాంబ తన చిన్న కొడుకు అఖిల్ ను బయటకు పంపిస్తుంది.

అయితే ఎంత సేపు అయినా కూడా అఖిల్ ఇంటికి రాకపోవడంతో అందరినీ అడుగుతుంది. ఇంకా రాలేదు అని సమాధానం రావడంతో కాస్త కంగారు పడుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన జానకి నేను వెళ్ళి తీసుకు వస్తాను అని చెబుతుంది. వద్దని జ్ఞానంతో చెప్పినప్పటికీ అందరూ పనిలో బిజీగా ఉన్నారు కాబట్టి నేను వెళ్తాను అని అంటుంది.

అఖిల్ అప్పు గొడవ..

అఖిల్ అప్పు గొడవ..

ఇక మరిధిని వెతికేందుకు బయటకు వచ్చినా జానకి రోడ్డు పక్కన ఎవరితోనో అతను గోడవపడుతున్న సీన్ ను చూస్తుంది. వాళ్ళు చాలా కోపంగా అఖిల్ కొట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. దీంతో పరుగెత్తుకు వెళ్లిన జానకి ఎందుకు కొడుతున్నారు అంటూ అందరినీ ప్రశ్నిస్తుంది. ఇక వాళ్ళు అసలు నిజాన్ని బయట పెడతారు. చాలా రోజులుగా మా దగ్గర డబ్బు తీసుకొని తిరిగి కట్టడం లేదని, అందుకే వాళ్ల ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అయితే అఖిల్ మాత్రం వద్దు అంటున్నాడు కాబట్టి గొడవకు దిగుతున్నారని అన్నారు. ఆ విషయం తెలియగానే జానకి ఒక్క సారిగా షాక్ అవుతుంది.

అందుకే అప్పు చేశాను

అందుకే అప్పు చేశాను

అసలు ఏం జరిగిందని జానకి, అఖిల్ అని అడుగుతుంది. దీంతో అఖిల్ ఆలోచనలో పడతాడు. ఆన్లైన్ గేమ్ లో డబ్బులు పోగొట్టుకున్నాను అని చెబితే మళ్లీ వదిన కోప్పడుతుందని వేరే విషయాన్ని చెబుతాడు. నాకు గిటార్ అంటే ఇష్టం అందుకే దాన్ని కొనడానికి అప్పు చేశాను. ఇంట్లో అడిగితే ఇవ్వలేదు అందుకే వాళ్ల దగ్గర అప్పు చేశాను. అయితే ఈ విషయం అమ్మకు తెలిస్తే నేను ఇంట్లో ఉండలేను, అందుకే దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు జానకీతో చెబుతాడు. దీంతో మరోసారి ఆలోచనలో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే మళ్ళీ అందరూ బాధపడతారు అనుకుంటుంది. వెంటనే సహాయం చేయాలని అనుకుంటుంది.

రెండు గాజులు తాకట్టు..

రెండు గాజులు తాకట్టు..

ఇక వెంటనే వాళ్లకు డబ్బులు ఇస్తానని జానకి మరోసారి భరోసా ఇస్తుంది. గంటల్లో మీ డబ్బులు మీకు ఇస్తాను అప్పటివరకు కాసేపు ఆగండి అని జానకి ఇంటికి వెళుతుంది. ఇంటికి తిరిగి వచ్చిన జానకి అందరూ బిజీగా ఉండడం వలన ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. ఇంట్లోకి వెళ్లి తన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టాలని అనుకుంటుంది. పరీక్షలకు అవసరమయ్యే ట్రైనింగ్ పీజు కోసం జానకి తన వద్ద ఉన్న రెండు గాజులను తాకట్టు పెట్టాలని అనుకుంటుంది. కానీ మరిది కోసం వాటిని అమ్మేయాలని నిర్ణయం తీసుకుంటుంది.

మరో అబద్ధం..

మరో అబద్ధం..

అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుండగా అప్పుడే జ్ఞానాంబ జానకిని చూస్తుంది. ఎక్కడికి వెళుతున్నావు అఖిల్ ను పిలుచుకురమ్మని చెప్పాను కదా రాలేదా అని ప్రశ్నిస్తుంది. అయితే జానకి ఆలోచనలో పడి అబద్ధం చెబుతుంది. డబ్బులు పోగొట్టుకున్నాడు అందుకే తేలేకపోయాడు నేను డబ్బులు తీసుకొని వెళ్తున్నాను అదే చెబుతుంది. ఆ విషయాన్ని నమ్మిన జానకి సరే ఉంటా వెళ్ళమని చెబుతుంది. అఖిల్ కోసం గాజులు తాకట్టు పెట్టి 30 వేలు ఇచ్చిన జానకి వెంటనే వాళ్ల అప్పు తీర్చేయమని చెబుతుంది.

Recommended Video

Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
వైజయంతి ఇంట్లో జానకి..

వైజయంతి ఇంట్లో జానకి..

మళ్లీ ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దు అని మన ఇంటి గౌరవం పోతుందని కూడా వివరిస్తుంది. అందుకు అఖిల్ కూడా సరేనని ఒప్పుకుంటాడు. అయితే వినాయక చవితి సందర్భంగా వైజయంతిని కూడా పిలుచుకొని రావాలి అని జ్ఞానాంబ చెప్పడంతో జానకి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ల ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ జానకి గ్రాడ్యుయేషన్ డే కు సంబంధించిన ఫోటోలు కనిపిస్తాయి. ఆ విషయం వైజయంతికి తెలిసిందా అని కంగారు పడుతుంది. మరి వైజయంతికి అసలు నిజం తెలిసిందా లేదా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X