For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu September 14th: అఖిల్ పై రామచంద్ర సీరియస్.. మరో చిచ్చు పెడుతున్న మల్లిక!

  |

  జానకి కలగనలేదు ఊహించని కథాంశంతో ప్రేక్షకులలో మంచి ఆదరణను పెంచుకుంటోంది. భర్త రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఫైనల్ గా జానకి చదువుకోవడానికి అత్త జ్ఞానాంబ ఓకే అంటుంది. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 388 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  అఖిల్ తో పెళ్లి

  అఖిల్ తో పెళ్లి

  జానకి మరిది అఖిల్ జెస్సి అనే అమ్మాయితో ప్రేమలో పడి ఆమెకి గర్భం వచ్చేలా చేస్తాడు. ఇక జెస్సి తల్లిదండ్రులు జ్ఞానాంబతో గొడవపడి అయినా సరే అఖిల్ తో పెళ్లి చేయాలని అనుకుంటారు. అయితే గొడవలు జరగకుండా చూసుకోవాలి అని జానకి ఎంతగానో ప్రయత్నాలు చేస్తోంది. జెస్సి తల్లిదండ్రులను ఒప్పించి వారిని కూల్ చేసిన జానకి జ్ఞానాంబను ఒప్పిస్తానని అంటుంది. ఇక జెస్సి తల్లిదండ్రులు జానకికి మొదటి అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె ఒప్పించలేకపోతుంది. జ్ఞానాంబ జానకి మాటలు నమ్మదు. అనవసరంగా అఖిల్ పై నిందలు వేయాలనుకోవడం కరెక్ట్ కాదు అని అంటుంది.

  రామచంద్ర నమ్మకం

  రామచంద్ర నమ్మకం

  ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ విషయంలో ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే జానకి భర్త రామచంద్ర మాత్రం జానకికి ఆ విషయంలో మద్దతుగా నిలుస్తాడు. మీరు ఇంత గట్టిగా చెబుతున్నారు అంటే ఏదో ఉంటే ఉంటుంది అని ఈ విషయంలో నేను మీకు సపోర్ట్ చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత జెస్సి దగ్గరకు వెళ్లి మీ తల్లిదండ్రులతో మరోసారి మాట్లాడుతామని కొంత సమయం కావాలి అని అంటారు. అందుకు జెస్సి పేరెంట్స్ కూడా మరో అవకాశం ఇస్తారు. ఈసారి కుదరకపోతే పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేయాల్సి ఉంటుందని అంటారు.

  టెన్షన్ లేకుండా మల్లిక భోజనాలు

  టెన్షన్ లేకుండా మల్లిక భోజనాలు

  ఇక ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా కూడా అవేమి పట్టనట్లు మల్లిక ప్రసాదాలు అరగిస్తూ ఉంటుంది. కడుపుతో ఉన్నట్లు నాటకం ఆడుతున్న మల్లిక ఏ పని చేయకుండా హ్యాపీగా తింటూ కూర్చుంటుంది. ఇక ఆ విషయంలో ఆమె భర్త విష్ణు మాత్రం అసహనంతో ఉంటాడు. ఇంట్లో ఎన్ని జరుగుతున్నా కూడా నీకు పట్టనట్టే ఉంటుందా ఇంత సంతోషంగా ఎలా కూర్చుని తింటున్నావు అని అడుగుతాడు అందుకు మల్లిక నేను నా కోసం తినడం లేదు అని కడుపులో ఉన్న బిడ్డ కోసం తింటున్నాను అని చెబుతుంది. దీంతో విష్ణు కాస్త ఎమోషనల్ అవుతాడు. అంతేకాకుండా అతని చేతితో తన భార్యకు తినిపిస్తూ ఉంటాడు.

   అఖిల్ తో మాట్లాడాలని

  అఖిల్ తో మాట్లాడాలని

  ఇక మరోవైపు రామచంద్ర అఖిల్ చేత ఎలాగైనా నిజం ఒప్పించాలి అని ఒక ఆడపిల్లకు అన్యాయం జరగకూడదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అందుకోసం ఎవరికి తెలియకుండా అఖిల్ తో మాట్లాడాలని అనుకుంటాడు. కానీ అఖిల్ మాత్రం అన్నయ్య చేతికి కనిపించకుండా ఉండాలని జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇక చివరికి అఖిల్ ను పట్టుకున్న రామచంద్ర ఇంటి వెనకాల పెరట్లోకి తీసుకువెళ్లి మెల్లగా అడిగే ప్రయత్నం చేస్తాడు. దీంతో నేను ఎన్నిసార్లు చెప్పాలి అన్నయ్య ఆ అమ్మాయిని నేను ప్రేమించలేదు ఎవరితోనో కడుపు చేయించుకొని నా మీద నింద వేస్తోంది అని అబద్ధం చెబుతాడు.

  అఖిల్ పై రామ సీరియస్

  అఖిల్ పై రామ సీరియస్

  అయితే మెల్లగా మాట్లాడమని చెప్పినప్పటికీ కూడా అఖిల్ గట్టిగానే మాట్లాడుతుంటాడు. ఇక అప్పటికే రామచంద్రకు కోపం వచ్చి చేయి ఎత్తగానే అప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా బయటికి వస్తారు. జ్ఞానాంబ కూడా రామచంద్ర పై గట్టిగా అరుస్తుంది. జానకి తో పాటు నువ్వు కూడా అఖిల్ ను ఎందుకు అనుమానిస్తున్నావు అని అడుగుతుంది. ఇది ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించాల్సిన సమయం అంటూ రేపు ఏదైనా తప్పు జరిగితే అందరం బాధపడాల్సి వస్తుంది అని రామ అంటాడు. మరోవైపు గోవిందరాజులు కూడా ఒకసారి రామా జానకి వైపు నుంచి కూడా ఆలోచించాలి అని నువ్వు అఖిల్ ఒట్టు వేశాడు అని నమ్ముతున్నావు అని అనుమానం వ్యక్తం చేస్తాడు.

  గొడవలు పెట్టాలని మల్లిక ప్లాన్

  గొడవలు పెట్టాలని మల్లిక ప్లాన్

  ఇక ఆ విధానంలో మల్లిక కూడా మరింత చిచ్చు రాజేసే ప్రయత్నం చేస్తుంది. ఇది కావాలని జానకి వల్ల జరుగుతున్న గొడవలు అని అంటుంది. కానీ ఇక జ్ఞానాంబ మరో రెండు రోజుల సమయం ఇవ్వాలని అనుకుంటుంది. అప్పటివరకు ఈ విషయంలో నిజం తెల్చకపోతే అందరూ కూడా జెస్సి పేరుని మర్చిపోవాలి అని అంటుంది. మరోవైపు మల్లికా ఇంట్లో చిచ్చుపెట్టేందుకు లీలావతి పెద్దమ్మను లైన్లో పెడుతుంది.

  మా ఇంట్లో విషయాలు నీకు అనవసరం

  మా ఇంట్లో విషయాలు నీకు అనవసరం

  అప్పుడే వచ్చిన లీలావతి ఇంట్లో ఏదో జరుగుతోంది కదా అని అనుమానం వ్యక్తం చేస్తుంది. ఊర్లో అందరూ కూడా జెస్సి అనే అమ్మాయికి మీ వల్ల ఏదో జరిగింది అని అనుకుంటున్నారు అని అంటుంది. ఆ విషయంలో జ్ఞానాంబ మరోసారి కోప్పడుతుంది. మా ఇంట్లో విషయాలు నీకు అవసరం లేదు అని చెబుతుంది. ఇక ఆ తర్వాత మల్లిక మాట్లాడుతూ.. లీలావతిని నోరు మూయించినంత మాత్రాన ఊర్లో వాళ్ళ అందరి నోళ్ళు ముగించలేం కదా అని అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో మళ్ళీ జ్ఞానాంబ ఆలోచనలో పడుతుంది. మరి ఆమె ఆలోచన ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 388
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X