Janaki Kalaganaledu September 16th Episode: జానకి ఐపీఎస్ రహస్యం.. టైమ్ చూసి ఆడుకుంటున్న వైజయంతి

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు సరికొత్తగా ఆకట్టుకుంటోంది. ఎలాగైనా ఐపీఎస్ కావాలని జ్ఞానాంబ పెద్ద కోడలు జానకి ఎవరికీ తెలియకుండా చదువుకుంటూ ఉండడం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఇక జానకి భర్త కూడా ఎవరికి తెలియకుండా మద్దతుగా ప్రతి విషయంలో తోడుగా నిలుస్తాడు. అయితే చదువుకున్న కోడలు ఇంట్లో ఉంటే కాపురం సరిగ్గా ఉండదు అనే అనుమానం వల్ల జ్ఞానాంబ కూడా చదువుకోలేని కోడలిని ఇంటికి తెచ్చుకోవాలని అనుకుంది.

అయితే కేవలం 5వ తరగతి మాత్రమే చదువుకున్నట్లు అబద్ధం చెప్పి ఇంట్లో అడుగుపెట్టిన జానకి తన ఐపీఎస్ కలను ఎలా సాధిస్తుంది అనేది అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. మరోవైపు చిన్న కోడలు మల్లిక కూడా జానకిపై పగబడుతుంది. జానకి ఆమె వల్ల ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉంటుంది. మరోవైపు ఇంట్లో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా జానకి బాధ్యతగా తీసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తోంది. ఇక మల్లిక అసలు నిజాన్ని అత్త ముందు ఉంచడానికి చాలా ఆతృతగా ఎదురుచూసింది. కానీ ఆమె అనుకున్నవన్ని కూడా రివర్స్ అయ్యాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 126వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

వైజయంతి ఇంట్లో జానకి ఫొటోలు

వైజయంతి ఇంట్లో జానకి ఫొటోలు

వినాయక చవితి సందర్భంగా పూజ కోసం వైజయంతిని కూడా పిలుచుకొని రావాలి అని జ్ఞానాంబ చెప్పడంతో జానకి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే వాళ్ల ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ జానకి గ్రాడ్యుయేషన్ డే కు సంబంధించిన ఫోటోలు కనిపిస్తాయి. ఆ విషయం వైజయంతికి తెలిసిందా అని కంగారు పడుతున్న సమయంలో నిజంగానే ఆమెకు ఆ విషయం తెలుస్తుంది.

నిజం తెలుసుకున్న వైజయంతి

నిజం తెలుసుకున్న వైజయంతి

వైజయంతి గ్రాడ్యుయేషన్ ఫోటోలు చూసిన తర్వాత జానకి పడుతున్న టెన్షన్ ని కూడా వైజయంతి పసిగడుతుంది. గతంలో ఉన్న పగను కూడా ఆమె గుర్తు చేసుకుంటుంది. ఇక జ్ఞానాంబ ఇంటికి వచ్చిన తరువాత ఆమె అదే పనిగా జానకి రామచంద్రలను లో చూస్తూ ఉంటుంది. ఇక జానకి ముందుగానే ఆ విషయాన్ని తన భర్తకు చెబుతుంది. అయితే ఎలాంటి టెన్షన్ పడకుండా ఉండాలని మరోసారి రామచంద్రయ్య ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు అంతేకాకుండా జానకి పుస్తకాలను కూడా పూజ దగ్గర ఉంచాలని అనుకుంటాడు.

పూజలో జానకి పుస్తకాలు

పూజలో జానకి పుస్తకాలు

ఇక పూజ మొదలైన తర్వాత జ్ఞానాంబ తన అఖిల్, వెన్నెల పుస్తకాలను పూజలో ఉంచాలని చెబుతుంది. ఇక అదే సమయంలో రామచంద్ర కలుగజేసుకుని వారిద్దరి పుస్తకాలకు ఓం నేను రాస్తానని అంటాడు. పూజలో నిమగ్నమై ఉండగా మెల్లగా రామచంద్ర జానకి పుస్తకాన్ని కూడా తీసుకొని వాటిపై కూడా పసుపు తో ఓం అని రాస్తాడు. ఆ తర్వాత జానకి ఎంతగానో భావోద్వేగానికి గురై రామచంద్ర కాళ్ళు పట్టుకుంటుంది. రామచంద్ర కూడా ఎమోషనల్ అవుతాడు.

పూజలో జానకి పుస్తకాలు

పూజలో జానకి పుస్తకాలు

అయితే ఆ విషయాన్ని పసిగట్టిన మల్లిక ఏదో జరుగుతోందని తన భర్త విష్ణుకి చెబుతుంది. వెళ్లి మా అమ్మకు చెప్పుకొమ్మని అనడంతో మళ్ళీ తేడా కొడితే నా పని అవుతుంది అని మల్లికా భయపడుతుంది. కానీ వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని ముందుగానే మల్లిక ఆలోచిస్తూ ఉంటుంది. మరో వైపు వైజయంతి కూడా జానకి వైపు అదేపనిగా చూస్తుంది. ఈ క్రమంలో రామచంద్ర జానకి పుస్తకాలను కూడా పూజలో ఉంచుతాడు.

వైజయంతి ఆశీర్వాదం

వైజయంతి ఆశీర్వాదం

ఇక వాటిని జ్ఞానాంబ కూడా తీసుకుని కూడా గణేశుని పూజ ముందు ఉంచుతుంది. అది చూసి జానకి ఎంతగానో సంతోషిస్తుంది. అత్త కూడా చదువుకు మద్దతు ఇస్తే చాలా బాగుంటుంది అని ఆలోచిస్తుంది. ఇక ఆ తర్వాత వైజయంతి కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పడంతో జానకి, మల్లిక వైజయంతి కాళ్లకు నమస్కారం చేస్తారు. అనంతరం జ్ఞానాంబ వైజయంతిని భోజనం చేసి వెళ్లాలని ఆదేశిస్తుంది. కానీ మొదట వైజయంతి అందుకు ఒప్పుకోదు. పర్వాలేదు అని అనడంతో గోవిందరాజులు ఆమెను ఒప్పిస్తాడు.

టెన్షన్ పెట్టిన వైజయంతి

టెన్షన్ పెట్టిన వైజయంతి

ఈ క్రమంలో అందరూ భోజనాలు ఏర్పాట్లు చేస్తుండగా వైజయంతి జానకితో మాట్లాడుతుంది. నువ్వు చదువుకున్న విషయాన్ని మీ అత్తయ్య కి ఎందుకు చెప్పలేదో తెలుసా?. ఈ సంతోషకరమైన పూజ సమయంలో ఆమెను ఇబ్బంది పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఈ విషయాన్ని బయట పెట్టకుండా ఉంటాను అని మాత్రం అనుకోకు అంటూ హెచ్చరిక చేస్తోంది. అంతేకాకుండా జ్ఞానాంబతో మీ కోడలు చాలా బాగా చదువుకుంది అని కాస్త కంగారు పెట్టిన వైజయంతి మళ్ళి సంస్కారం గౌరవం అనే విషయాలను అని అంటుంది.

Recommended Video

Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
వైజయంతి ఇంటికి జానకి..

వైజయంతి ఇంటికి జానకి..

ఇక ఆ తర్వాత వైజయంతి జానకికి మరొక విషయాన్ని చెబుతుంది. మా ఇంటికి వచ్చి ఒకసారి నాతో మాట్లాడు అప్పుడు ఒక విషయాన్ని చెబుతాను అని అంటుంది. వైజయంతి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో జానకి మదనపడుతూ ఉంటుంది. అదే విషయాన్ని భర్తకు చెబుతుంది. అయితే నేను ఇంటికి వెళ్లి మాట్లాడి వస్తాను అని రామచంద్ర చెప్పినప్పటికీ జానకి అందుకు ఏమాత్రం ఒప్పుకోను. నా చదువు విషయం కాబట్టి నేను ఆమె ఇంటికి వెళ్లి ఏదో ఒక విధంగ బ్రతిమాలుకుంటాను అని జానకి చెబుతుంది. ఇక జానకి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X