Janaki Kalaganaledu September 16th: జెస్సికి మరోసారి అండగా జానకి.. అఖిల్ చేతిలో విషం
జానకి కలగనలేదు ఆసక్తికరమైన ఎమోషన్స్ తో ట్విస్ట్ లతో మంచి ఆదరణను పెంచుకుంటోంది. ఇక రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకున్న జానకికి అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. జానకి మరిది అఖిల్ మరో అమ్మాయిని ప్రేమించి గర్భం వచ్చేలా చేస్తాడు. ఇక ఆ అమ్మాయికి న్యాయం చేయాలని జానకి ప్రయత్నం చేస్తోంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 390 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

అఖిల్ అబద్ధాలు
రామచంద్ర తమ్ముడు జెస్సి అనే అమ్మాయిని ప్రేమించి ఆమెకు గర్భం వచ్చేలా చేస్తాడు. దీంతో రామచంద్ర భార్య జానకి ఎలాగైనా జెస్సి కి న్యాయం చేయాలి అని అనుకుంటుంది. అయితే అఖిల్ మాత్రం తన తల్లి జ్ఞానాంబకు భయపడి తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి వెనుకడుగు వేస్తాడు. అంతేకాకుండా జెస్సీకి తనకు ఎలాంటి సంబంధం లేదు అని ఆమెకు కడుపు రావడానికి కూడా కారణం నేను కాదు అని.. ఎవరో మోసం చేస్తే నన్ను టార్గెట్ చేసింది అని అబద్ధం చెబుతాడు. దీంతో జానకి ఈ విషయంపై మరింత సీరియస్ గా ఆలోచిస్తుంది. మరోవైపు జెస్సీ తల్లిదండ్రులు కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతూ ఉంటారు. ఇక జానకీ కుటుంబ పరువు కోసం వారిని శాంతింపజేసి కొన్ని రోజులు సమయం ఇవ్వండి అంటూ తప్పకుండా అఖిల్ తో పెళ్లి జరిగేలా చేస్తామో అని అంటుంది.

మన పెళ్లి ఈ జన్మలో జరగదు
ఇక జానకి, అఖిల్ ను ఒప్పించేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేసినప్పటికీ అతను తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. అంతేకాకుండా రామచంద్ర కూడా అదే తరహాలో ప్రయత్నం చేస్తూ ఉండడంతో అఖిల్ సహనం కోల్పోతాడు. ఎలాగైనా వీళ్ళని ఆపాలి అనే లేకపోతే పరిస్థితి మరింత సీరియస్ గా మారుతుంది అని అనుకుంటాడు. వెంటనే జెస్సి కి ఫోన్ చేసి నేను కావాలని అనుకుంటే.. అబార్షన్ చేయించుకోవాలి అని లేకపోతే మన పెళ్లి ఈ జన్మలో జరగదు అని అఖిల్ తేల్చి చెప్పడంతో జెస్సి షాక్ అవుతుంది. ఇక ఎంతో ధైర్యం చెప్పాల్సిన అఖిల్ అలా అనడంతో ఎవరికీ ఏ బాధ లేకుండా చేయాలి అని జెస్సీ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. ఇక జెస్సీ తల్లిదండ్రులు వెంటనే ఆ విషయాన్ని జానకికి చెప్పడంతో అప్పుడే పరీక్షలు రాయడానికి వెళ్లిన జానకి పరుగు పరుగున జెస్సి ఇంటికి వస్తుంది.

జెస్సి దగ్గరే జానకి
ఇక జానకి , జెస్సి ఇంటికి రాగానే పరిస్థితి గురించి తెలుసుకుంటుంది. ఎందుకు ఇలాంటి తప్పు చేసావు అని అడుగుతుంది. అయితే ఈ కఠిన సమయంలో ఎంతో ధైర్యం చెప్పాల్సిన అఖిల్ అబార్షన్ చేసుకొమ్మని ఆ విధంగా మాట్లాడడంతో ఏం చేయాలో అర్థం కాలేదు అని అందుకే ఎవరికీ ఏ బాధ లేకుండా చేయాలి అని చనిపోవాలని అనుకున్నట్లు జెస్సి చెబుతుంది. అయితే ఆత్మహత్య చేసుకోవడం తప్పు అని నువ్వు చనిపోతే నీ తల్లిదండ్రులు ఏమైపోవాలి ఇప్పటికే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు అని జానకి అర్థమయ్యేలా చెబుతోంది. ఇక తర్వాత జానకి మళ్ళీ కాలేజీకి వెళ్లకుండా అక్కడే జెస్సీ దగ్గరే ఉంటుంది. తనకు భయంగా ఉంటుంది అని జెస్సి చెప్పడంతో జానకి కాలేజీకి వెళ్లలేక పోతుంది. అయితే జానకి కాలేజీకి వెళ్లి పరీక్షలు రాయలేదు అనే విషయం జ్ఞానాంబకు తెలుస్తుంది.

ఇదొక పెద్ద నాటకం
ఇక జానకి ఇంటికి రాగానే జ్ఞానాంబ ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. ఇక జానకి జరిగిన విషయం గురించి చెబుతుంది. జెస్సి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది అని తనకు ఏదైనా జరిగితే ఆ తర్వాత మనం జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది అని అందుకే ధైర్యం చెప్పడానికి వెళ్లాను అని జానకి చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అయితే మల్లిక మాత్రం ఇదొక పెద్ద నాటకం అంటూ.. జానకి ఇంట్లో విషయాలు పట్టించుకోకుండా బయట విషయాలు అనవసరంగా నెత్తిన పెట్టుకుంటుంది అని అత్తగారి మాటకు కూడా విలువ ఇవ్వడం లేదు అని అంటుంది.

అఖిల్ షాకింగ్ నిర్ణయం
ఇక మల్లిక మాటలకు జానకి మరింత అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక జ్ఞానాంబ మాత్రం మల్లికా మాటలో ఎలాంటి తప్పులేదు అంటూ జానకి పై సీరియస్ అవుతుంది. నువ్వు నీ చదువుని అలాగే ఇంటి బాధ్యతలను వదిలిపెట్టకుండా నిజం నిరూపించాలి.. అంతేకానీ అనవసరంగా పరీక్షలను వదిలేసి వేరోకరి కోసం ఆలోచించకూడదు అని అంటుంది. మరోసారి పొరపాటు జరిగితే క్షమించను అని చెప్పడంతో జానకి ఏమే మాట్లాడలేకపోతుంది. ఇక మరోవైపు రామచంద్ర అఖిల్ ను గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తాడు కానీ అతను అదే పనిగా అబద్దం చెబుతూ ఉంటాడు నీకు అఖిల్ ఈ విషయం సీరియస్ గా అవడంతో కాస్త భయపడతాడు దింతో అతను కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు మరి


Click it and Unblock the Notifications











