Janaki Kalaganaledu September 17th Episode: ఎంత చెప్పినా తగ్గని వైజయంతి.. చిక్కుల్లో జానకి కాపురం!

జానకి కలగనలేదు సీరియల్ అసలైన మలుపు తిరగబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం 5వ తరగతి మాత్రమే చదువుకొని వచ్చాను అని అబద్ధం చెప్పి.. అత్తకు నచ్చని డిగ్రీ పట్టాను కూడా అందుకున్న జానకి జీవితం మరో కీలక మలుపు తిరగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతిసారి కూడా జ్ఞానాంబ నుంచి ఆమె ఎదో ఒక విధంగా తప్పించుకుంటోంది. చదువు అంటేనే తెలియని కోడలిని తెచ్చుకోవాలని అనుకున్న జ్ఞానాంబను జానకి మోసం చేస్తోందని తెలుసుకున్న వైజయంతి కూడా ఈ కథను కీలక మలుపు తిప్పబోతోంది.

ఈ క్రమంలో ఎలాగైనా ఐపీఎస్ కావాలని జ్ఞానాంబ పెద్ద కోడలు జానకి ఎవరికీ తెలియకుండా చదువుకుంటూ ఉండడం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఇక జానకి భర్త కూడా ఎవరికి తెలియకుండా మద్దతుగా ప్రతి విషయంలో తోడుగా నిలుస్తాడు. మరోవైపు చిన్న కోడలు మల్లిక కూడా జానకిపై పగ పెంచుకుంటూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉంటుంది. మరోవైపు ఇంట్లో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా జానకి బాధ్యతగా తీసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తోంది. మల్లిక అనుకున్నవన్ని కూడా రివర్స్ అయ్యాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 127వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

జానకి జీవితం వైజయంతి చేతుల్లో..

జానకి జీవితం వైజయంతి చేతుల్లో..

జానకి చదువు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో ఆమెను బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. వైజయంతి కూతురు కూడా డిగ్రీ పట్టాను అందుకున్నప్పుడు ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలలో జానకి ఫోటో కూడా ఉండడంతో అసలు ట్విస్ట్ మొదలైంది. ఎలాగైనా ఐపీఎస్ అవ్వాలనే కలతో పరీక్షలకు సిద్ధమవ్వాలని అనుకున్న జానకికి మరొక ప్రమాదం ఎదురు కాబోతోంది. వైజయంతి నిజంగానే జానకి చదువుకున్న విషయాన్ని జ్ఞానాంబ ముందు ఉంచుతుంది లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు రామచంద్ర కూడా జానకి మద్దతు ఇస్తూ ఉంటాడు. ఆ విషయం కూడా తెలిస్తే పరిస్థితులు ఎలా మారిపోతాయో అని నిత్యం జానకి కంగారు పడుతూ ఉంటుంది.

మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది

మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది

ఇక వైజయంతి ఇంటికి రమ్మని పిలవడంతో అక్కడ ఏదో ఒకటి చెప్పి ఆమెను ఒప్పించాలని జానకి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. జ్ఞానాంబ స్నేహితురాలు అయినటువంటి వైజయంతి ఎన్నోసార్లు జ్ఞానాంబ తనకి సహాయం చేసింది అని జానకితో చెబుతుంది. జ్ఞానాంబ ఏ విషయాన్నైనా క్షమిస్తుంది కానీ మోసం అబద్ధాలు అనే వాటిని అస్సలు క్షమించదు అలాంటి మంచి వ్యక్తిని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని వైజయంతి జానకిని అడుగుతుంది.

 ఎలాగైనా ఈ నిజాన్ని బయటపెడతాను

ఎలాగైనా ఈ నిజాన్ని బయటపెడతాను

అయితే నేను చదువుకున్న విషయం మా అత్తయ్య గారికి చెప్పకుండానే మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారని ఆ విషయం తర్వాత చెబుతామని అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ నా కాపురం కూలిపోతుంది అనే భయంతో చెప్పలేదు అని జానకి అర్థమయ్యేలా చెబుతుంది. జానకి ఎంత ఏడుస్తూ చెప్పినా కూడా వైజయంతి ఎంత మాత్రం ఒప్పుకోదు. ఈ విషయం నాకు తెలిసి చెప్పకపోతే ఒక పెద్ద తప్పు అవుతుందని మాట్లాడిన వైజయంతి.. రేపు మళ్లీ నన్ను ఇదే విషయంపై జ్ఞానాంబ అడుగుతుంది అప్పుడు నేను ఎలాంటి సమాధానం చెప్పాలి అని జానకిని ప్రశ్నిస్తుంది. ఇందులో అసలు తగ్గేది లేదు అంటూ ఎలాగైనా తప్పకుండా నీ చదువు విషయాన్ని చెప్పి తీరుతాను అంటూ శపథం చేస్తుంది.

టెన్షన్ లో రామచంద్ర

టెన్షన్ లో రామచంద్ర

ఇక చేసేదేమీలేక జానకి నిస్సహాయతతో భర్త దగ్గరకు ప్రయాణం అవుతుంది. ఇక రామచంద్ర జానకి వైజయంతి ఇంటికి వెళ్లిన విషయంపై కంగారు పడుతూ ఉంటాడు. అసలు అక్కడ ఏం జరిగింది ఇంతవరకు ఎందుకు ఫోన్ చేయలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చివరికి ఓపిక పట్టలేక జానకి ఫోన్ కు కాల్ చేయడంతో ఆమె అసలు విషయాన్ని చెప్పగానే రామచంద్ర కూడా మొదట కంగారు పడతాడు. అంతే కాకుండా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. తెలిసిన తర్వాత ఏదైనా సరే ఇద్దరం ఎదుర్కొందాం అని ముందే చెప్పాను కదా అంటూ ముందు షాప్ దగ్గరకి రమ్మని అంటాడు.

ధైర్యం చెప్పినా తగ్గని భయం

ధైర్యం చెప్పినా తగ్గని భయం

భర్త ఎంత ధైర్యం చెప్పినా కూడా జానకి మనసు భయంతోనే ఉంటుంది. చిన్న అబద్ధం చెబితేనే తట్టుకోలేని అత్తయ్య ఇప్పుడు తన చదువు విషయంలో మోసం చేసినట్లు తెలిస్తే తప్పకుండా ఇంట్లో నుంచి బయటకు పంపివేస్తుందని అనుకుంటుంది. అంతేకాకుండా తన వల్ల భర్త కూడా బాధ పడతారని ఇంట్లో పరిస్థితులు ఒక్కసారిగా తన వల్లే మారిపోతాయని జానకి బాధపడుతుంది.

Recommended Video

Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
ఇబ్బందుల్లో వైజయంతి కూతురు

ఇబ్బందుల్లో వైజయంతి కూతురు

ఇక ఇంతలో మరోవైపు వైజయంతి కూతురు ఒక అబ్బాయి కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. పెన్ డ్రైవ్ లో వీడియోలు ఫోటోలు ఉన్నాయి అంటూ ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు నువ్వు నా రూమ్ కి వస్తే ఆ పెన్ డ్రైవ్ నీకు ఇస్తాను అని భయపడుతూ ఉండడంతో ఆ మాటలను పక్కనే ఉన్న జానకి వింటుంది. ఇక మరోవైపు జ్ఞానాంబకు అసలు నిజం చెప్పాలని వైజయంతి ఫోటోలను జ్ఞానాంబ చేతికి అందించాలని అనుకుంటుంది. ఈ క్రమంలో జానకి వైజయంతి కూతురికి సహాయం చేసి బహుశా వైజయంతి చేతి నుంచి తప్పించుకోవచ్చు అని అనిపిస్తుంది. మరి ఆ ఘటన జానకికి ఎంత వరకు హెల్ప్ అవుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X