Janaki Kalaganaledu September 1st: జెస్సి ప్రెగ్నెన్సీ విషయం తెలుసుకున్న జానకి.. అఖిల్ నిర్వాకంతో షాక్!

జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. భర్త రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి చివరికి అత్తగారు కూడా ఒప్పుకుంటారు. అయినప్పటికీ జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 379 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

అఖిల్ పై ఆశలు

అఖిల్ పై ఆశలు

జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ ఎలాగైనా చదువుకొని మంచి స్థాయికి రావాలి అని ఇంట్లో వాళ్ళు అందరూ కూడా కోరుకుంటారు. ముఖ్యంగా రామచంద్ర కూడా తన ఆశలన్నీ కూడా తమ్ముడి పైన పెట్టుకుంటాడు. తాను చదువుకోలేదు అని.. కానీ తన తమ్ముడు గొప్పగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని అనుకుంటాడు. ఆ విషయాన్ని జానకితో కూడా చెబుతాడు. కానీ మరోవైపు అఖిల్ మాత్రం చదువులు వదిలేసే ప్రేమించిన అమ్మాయితో తిరుగుతూ ఉంటాడు. ఇక ఈ తరుణంలో ప్రేమించిన అమ్మాయి జెస్సికే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ విషయాన్ని అఖిల్ తో చెప్పగానే అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు.

పెళ్లి ఇప్పుడే వద్దు

పెళ్లి ఇప్పుడే వద్దు

జెస్సీ ప్రెగ్నెంట్ అయిన విషయం వారి ఇంట్లో కూడా తెలుస్తుంది. ఏమి చేయలేని పరిస్థితుల్లో జెస్సి అఖిల్ ను సహాయం అడుగుతుంది. ఎలాగైనా ఈ విషయంలో ఒక సమాధానం ఇవ్వాలి అని మన పెళ్లి జరిగిపోతే బాధ ఉండదు అని పదేపదే జెస్సి అఖిల్ కు ఫోన్ చేసి అడుగుతుంది. ఒకరోజు ఉదయాన్నే జెస్సిని కలుస్తాడు. ఇక అఖిల్ సమాధానం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జెస్సి కి మరో షాక్ ఎదురవుతుంది. తాను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను అని చదువు పూర్తి అయిన తర్వాతనే ఈ విషయం గురించి ఆలోచిద్దామని అఖిల్ అంటాడు. మరి నా ప్రెగ్నెన్సీ విషయాన్ని ఏం చేయమంటావు అని అడిగినప్పుడు అబార్షన్ చేసుకోమ్మని సలహా ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మన విషయం మా ఇంట్లో తెలిస్తే గొడవవుతుంది అని చదువు పూర్తి అయిన తర్వాత కూడా పెళ్లికి ఒప్పుకోదు అని అంటాడు.

నేను చచ్చిపోతాను...

నేను చచ్చిపోతాను...

ఇక జెస్సి నిలదీసి అడగడంతో ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేసినా కూడా నేను చచ్చిపోతాను. నాకు మరో దారి లేదు అని అఖిల్ అంటాడు. దీంతో జెస్సి కూడా ఏమీ అనలేక పోతుంది. ఆ తర్వాత అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పర ధ్యానంలో ఉన్న జెస్సి రోడ్డు మీద అలాగే నడుచుకుంటూ వెళుతుంది. ఇక అదే సమయంలో ఆ ప్రాంతంలో జానకి తన భర్తతో కలిసి షాపింగ్ చేస్తూ ఉంటుంది. ఇక జెస్సి అలా నడుచుకుంటూ వెళుతుంటే ఆమెకు ఎదురుగా ఒక వాహనం వస్తుంది. ఇక యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం నుంచి అప్పుడే జానకి ఆమెను కాపాడుతుంది.

 నిజం తెలుసుకున్న జానకి

నిజం తెలుసుకున్న జానకి


ఎందుకు ఇలా పరధ్యానం లో ఉన్నావు అని అడగడంతో జెస్సి అసలు విషయాన్నీ చెబుతుంది. తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని అఖిల్ పెళ్లి చేసుకోమని అంటే చచ్చిపోతాను అని అంటున్నాడు అని వాళ్ళ అమ్మ ఒప్పుకోదు అని అంటున్నాని చెబుతుంది. ఇక అఖిల్ చేసిన తప్పు గురించి తెలుసుకున్న జానకి మరోసారి షాక్ అవుతుంది. ఆ సమయంలో జెస్సికి ధైర్యం చెప్పు నువ్వు ఈ విషయంలో టెన్షన్ పడకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకు నేను ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తాను అని ధైర్యం చెబుతుంది. అంతే కాకుండా ఇంటికి ఆటోలో పంపిస్తుంది. ఇక తర్వాత రామచంద్ర మరో వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా ఈ సీన్ మొత్తం జరుగుతుంది.

అఖిల్ పై జానకి సీరియస్

అఖిల్ పై జానకి సీరియస్

ఇక అప్పుడు రామ నాకు అర్జెంట్ గా కొట్టు దగ్గర పని ఉంది అని మీరు ఇంటికి వెళ్ళండి అని ఉంటాడు. ఇక జానకి అఖిల్ విషయం గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళుతుంది. జానకి ఇంటికి వెళ్ళగానే అక్కడికి అఖిల్ మెల్లగా బైక్ పై వస్తూ ఉంటాడు. సీరియస్ గా చూసిన జానకి నీతో మాట్లాడాలి అని చెబుతుంది. ఇక ఉదయం నుంచి ఏమీ తినలేదు అని టిఫిన్ చేసాక వచ్చి మాట్లాడుతాను అని అంటాడు. నువ్వు వచ్చేవరకు ఇలాగే బయట ఉంటాని అని కూడా జానకి చెబుతుంది.

 కొట్టేంత కోపం

కొట్టేంత కోపం


ఇక తర్వాత అఖిల్ జానకి విషయాన్నీ పట్టించుకోకుండా ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి క్యారం బోర్డు ఆడుతూ ఉంటాడు. అప్పుడు జానకికి అఖిల్ పై కొట్టేంత కోపం కూడా వస్తుంది. ఇక అప్పుడే రామచంద్ర కూడా ఇంట్లోకి వస్తాడు. అందరూ కలిసి క్యారం బోర్డు ఆడుతూ ఉంటారు. ఇక చూపు తిప్పుకోకుండా జానకి అఖిల్ వైపే కోపంగా చూస్తూ ఉంటుంది. వారిని చిన్న కోడలు మల్లిక కూడా గమనిస్తూనే ఉంటుంది. మరి ఈ ఘట్టం జానకి ఆలోచనా విధానాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X