For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu September 20th Episode: ప్రాణాలకు తెగించి వైజయంతి కూతురిని కాపాడిన జానకి.. ఆఖరికి దోషిగా..

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరొక కీలకమైన మలుపు తిరగబోతొంది. మొన్నటివరకు తృటిలో తప్పించుకున్న జానకి ఇప్పుడు అత్త ముందు ఒక పని వల్ల దోషిగా నిలబడే పరిస్థితి ఏర్పడింది. 5వ తరగతి చువుకున్నట్లు అబద్ధం చెప్పి జ్ఞానాంబ కోడలిగా కొనసాగుతున్న జానకి ఇంత కాలం భర్త సహకారంతో సైలెంట్ గా నిజాన్ని దాచి పెట్టింది. ఇక ఫైనల్ గా వైజయంతి కారణంగా డిగ్రీ పూర్తి చేసిన విషయం అత్త జ్ఞానాంబకు తెలియబోతోంది. ప్రతిసారి కూడా జ్ఞానాంబ నుంచి ఆమె ఎదో ఒక విధంగా తప్పించుకుంటోంది.

  చదువు అంటేనే తెలియని కోడలిని తెచ్చుకోవాలని అనుకున్న జ్ఞానాంబను జానకి మోసం చేస్తోందని తెలుసుకున్న వైజయంతి కూడా ఈ కథను కీలక మలుపు తిప్పబోతోంది. ఇక ఐపీఎస్ కావాలని జానకి కంటున్న కలలు చివరికి మాయం కావాల్సిందేనా అనే సందేహం ఏర్పడింది. మరోవైపు చిన్న కోడలు మల్లిక కూడా జానకిపై రోజురోజుకు తన రివెంజ్ ను పెంచుకుంటూ ఉంటుంది. కానీ మల్లిక ప్లాన్స్ కొంత రివర్స్ అయ్యాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 131వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  టెన్షన్ లో జానకి, రామచంద్ర

  టెన్షన్ లో జానకి, రామచంద్ర

  జానకి డిగ్రీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ను అందుకున్న ఫోటోలను వైజయంతి చూస్తుంది. తన కూతురు కూడా అదే కాలేజీ కావడంతో ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను అనుకోకుండా చూస్తుంది. ఇక ఆ విషయాన్ని ఎలాగైనా జానకి అత్త జ్ఞానంభకు చెప్పాలనుకుంటుంది. ముందుగానే వైజయంతి ఆవిషయాన్ని జానకికి చెబుతుంది. దీంతో జానకి తో పాటు ఆమె భర్త రామచంద్ర కూడా ఎంతగానో కంగారు పడుతూ ఉంటారు.

  ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన శ్రీముఖి: ఎద అందాలు కనిపించేంత ఘాటుగా.. ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

  జానకిపై వైజయంతి కోపం

  జానకిపై వైజయంతి కోపం

  ముందుగానే ఈ విషయంలో వైజయంతిని బ్రతిమాలి సహాయం తీసుకోవాలని అనుకుంటారు. రామచంద్ర ఆమెతో మాట్లాడటానికి సిద్ధంగా ఉండగా జానకి వద్దు అంటూ భర్తను ఆపేస్తుంది ఇది నా సమస్య కాబట్టి మీరు అనవసరంగా చిక్కుల్లో పడవద్దు. అందుకే నేను వెళ్లి ఆమెను బ్రతిమాలు కుంటాను అని అంటుంది. ఇక జానకి తను చదివిన విషయాన్ని అత్తకు తెలియవద్దు వైజయంతి ఇంటికి వెళ్తుంది. ఇక వైజయంతి మాత్రం ఆ విషయంలో చాలా కోపంగా ఉంటుంది.

  Bigg boss telugu 5:విశ్వ భార్య ఎంత అందంగా ఉందొ చూసారా?.. రేర్ ఫొటోస్

  ఆ విషయంలో తగ్గేది లేదని..

  ఆ విషయంలో తగ్గేది లేదని..

  తన స్నేహితురాలు అయినటువంటి జ్ఞానాంబను మోసం చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అందుకే ఈ విషయాన్ని ఎలాగైనా ఆమె ముందు ఉంచుతానని చెబుతుంది. అలా చేస్తే తన కాపురం కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎంతమాత్రం అత్తకు నిజం తెలియకూడదు అని జానకి బ్రతిమాలుతుంది. కానీ అందుకు వైజయంతి నిరాకరించడంతో చేసేది ఏమీ లేక జానకి భర్త షాపుకు బాధతో పయనమవుతుంది.

  Green India Challenge: నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటిన అమీర్ ఖాన్.. ఎవరి సాయం లేకుండా..

  వైజయంతి ఇంటికి జ్ఞానాంబ

  వైజయంతి ఇంటికి జ్ఞానాంబ

  ఇక జానకి, వైజయంతిని ఒప్పించి ఉందా లేదా అని టెన్షన్ లో రామచంద్ర షాప్ లోనే కంగారు పడుతూ ఉంటాడు. అంతలోనే జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. వైజయంతి ఎందుకో ఉన్నపలంగా ఒక విషయాన్ని చెప్పాలి అని ఇంటికి రమ్మని చెప్పిందని రామచంద్రకు చెబుతుంది. అంతే కాకుజదా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు కదా అంటూ షాపులో ఉన్న పూతరేకుల పార్సిల్ చేయమని చెబుతుంది. ఇక వైజయంతి నిజం చెప్పడానికే అమ్మను పిలిచిందని రామచంద్ర కంగారు పడుతూ ఉంటాడు.

  అమ్మాయి కోసం జానకి సాహసం

  అమ్మాయి కోసం జానకి సాహసం

  ఇక మరో వైపు జానకికి దారిమధ్యలో ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుంది. ఒక అబ్బాయి కారణంగా ఆమె సమస్యలో పడుతుంది. విషయం ఏమిటని ఆరా తీయగా ఆ అబ్బాయి ఆమె ఫోటోలను ఉంచుకుని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కంటతడి పెట్టిన ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలని జానకి ధైర్యం చెబుతుంది.

  ఇక భర్త ఫోన్ చేయగానే నేను చెప్పిన అడ్రస్ కు రావాలని జానకి నిందితుడు ఉన్న ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన జానకి వెంటనే అతని కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టి గాజు గ్లాస్ తో గొంతుపై పొడిచేందుకు వెళుతుంది. కదిలితే చంపేస్తాను అంటూ అమ్మాయి ఫొటోలు ఉన్న పెన్ డ్రైవ్ తీసుకోమని చెబుతుంది. అలాగే హార్డ్ డిస్క్ ను కూడా తీసుకోవాలని చెబుతుంది.

  ఐపీఎస్ రేంజ్ లో జానకి ఫైట్

  ఐపీఎస్ రేంజ్ లో జానకి ఫైట్

  అనంతరం అతన్ని కిందపడేసి జానకి ఆ అమ్మాయిని తీసుకొని బయటకు వస్తుంది. ఇక అంతలోనే రామచంద్ర కూడా అక్కడికి వస్తాడు. ఇక వెనకాల నుంచి వచ్చిన నిందితుడు జానకిని అడ్డుకోవాలని చూడగా ఆమె అతను తెచ్చిన కర్ర తోనే చితకబాదింది. అది చూసిన రామచంద్ర ఒక్కసారిగా జానకిని ఐపీఎల్ తరహాలో ఊహించుకుంటాడు. జానకి ధైర్యాన్ని చూసి రామచంద్ర పొగడ్తలతో ముంచెత్తాడు.

  Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
  అత్త ముందు నిజం చెప్పాలని..

  అత్త ముందు నిజం చెప్పాలని..

  ఇక అదే సమయంలో జానకి కాపాడిన ఆ అమ్మాయి వైజయంతి కూతురు అని తెలుస్తుంది. ఇక మరోవైపు వైజయంతి జ్ఞానాంబను ఇంటికి పిలిచి అసలు నిజం చెప్పబోతున్నట్లు రామచంద్ర జానకి తో చెబుతాడు. జానకి చేసేదేమీలేక అత్తగారి ముందు దోషిగా నిలబడే సమయం వచ్చేసింది అని ఆమె నన్ను ప్రశ్నించకముందే వెళ్లి తప్పును ఒప్పుకుంటాను అని భర్తకు చెబుతుంది. జానకి రామచంద్ర షాప్ దగ్గర ఉండగా జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. ఒక నిజం చెప్పాలని జానకి తన జ్ఞానాంబతో మాట్లాడుతుంది. మరి జానకి తను చదువుకున్న విషయాన్ని బయట పెడుతున్న లేదా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 131
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X