Janaki Kalaganaledu September 21st Episode: జానకి కోసం సొంత ఇంట్లోనే దొంగలా మారిన రామచంద్ర!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు రేటింగ్స్ స్థాయిని అంతకంతకు పెంచుకుంటూనే ఉంది. ఐపీఎస్ చదువుకోవాలని జానకి అత్తగారింట్లో అబద్ధాలు చెప్పి కోచింగ్ సెంటర్ కు వెళుతూ ఉంటుంది. ఆమెకు భర్త రామచంద్ర కూడా ఎంతగానో సహాయ పడుతూ ఉంటాడు. జానకి ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో ఆమెకు అత్త జ్ఞానాంబ నుంచి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మరో వైపు కూడా జానకి ఆ ఎప్పటికప్పుడు అబద్ధాలు చెప్పేందుకు సిద్ధంగా ఉంటుంది. కేవలం ఐదవ తరగతి మాత్రమే చదువుకున్నను అని చెప్పిన జానకి ఇంట్లో తెలియకుండా తన ఐపీఎస్ చదువులలను పూర్తి చేయాలని అనుకుంటుంది.

ఆ పాయింట్ ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. ఇక మధ్యలో ఆమెకు మల్లిక నుంచి కూడా మరొక ఆటంకం ఏర్పడింది. జానకి తన చదువు విషయంలో తెలిసిపోతుంది అని అనుకున్న సమయంలో ఆమెకు అనుకోకుండా ఒక మంచి పరిణామం ఏర్పడింది. ఆమె చేసిన ఒక మంచి పని తిరిగి మళ్ళీ ఆమెకు ఎంతగానో ఉపయోగపడింది. ఇక నేడు ప్రసారం కాబోయే 132వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్ఞానాంబకు నిజం చెప్పాలి అని..

జ్ఞానాంబకు నిజం చెప్పాలి అని..

జానకి విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తున్న రామచంద్ర మరోసారి జానకి చదువు కోసం సహాయం చేయాలని అనుకుంటాడు. అయితే అతని ప్రణాళికలు రచిస్తున్న సమయంలోనే అనుకోకుండా వైజయంతి దృష్టిలో పడుతుంది. ఒక ఫోటో గురించి ఆమెకు తెలియడంతో ఎలాగైనా జానకి చదువుకున్న విషయాన్ని జ్ఞానాంబకు చెప్పాలి అని అనుకుంటుంది. ముందుగానే ఆ విషయాన్ని జానకితో చర్చించడంతో రామచంద్ర కూడా ఎంతగానో భయపడతాడు ఎలాగైనా ఆ విషయం తల్లికి తెలియకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్లాన్ వర్క్ అవుట్ అవ్వలేదు.

ట్విస్ట్ ఇచ్చిన వైజయంతి కూతురు

ట్విస్ట్ ఇచ్చిన వైజయంతి కూతురు

ఇక జానకి తనే స్వయంగా వైజయంతిని బ్రతిమాలి అత్తకు చదువు విషయం గురించి తెలియకుండా చూసుకోవాలని అనుకుంటుంది. అయినప్పటికీ వైజయంతి ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఇక ఫైనల్ గా వైజయంతి ఇంటికి రావడంతో ఫోటోలు చేతిలో పట్టుకొని రెడీగా ఉంటుంది. ఇక జానకి డిగ్రీ పట్టా అందుకున్న ఫోటో జ్ఞానాంబ చేతిలో పెడుతుండగా అప్పుడే వైజయంతి కూతురు అక్కడికి వస్తుంది. జానకి లేకపోతే నేను ఈరోజు బ్రతికే దాన్ని కాను అంటూ తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంది.

జానకి లేకపోతే బ్రతికేదాన్ని కాదు

జానకి లేకపోతే బ్రతికేదాన్ని కాదు

వైజయంతి ఇంటి నుంచి తిరిగి వచ్చిన తర్వాత జానకి అనుకోకుండా ఆమె కూతురు ని కాపాడిన విషయం తెలిసిందే. ఒక దుర్మార్గుడు తన మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడని అయితే అప్పుడే జానకి ప్రాణాలకు తెగించి అతనితో పోరాడి తనను కాపాడిందని వైజయంతి కూతురు చెబుతుంది. అప్పుడే పక్కనే ఉన్నాను జ్ఞానాంబ జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోతుంది. వైజయంతి కూతురిని ఓదార్చి సంతోషపడుతుంది.

జ్ఞానాంబ చేతిలో డబ్బు పెట్టిన వైజయంతి

జ్ఞానాంబ చేతిలో డబ్బు పెట్టిన వైజయంతి

అయితే జానకి చదువు గురించి నిజం చెప్పాలని అనుకున్నా వైజయంతి కూడా తన నిర్ణయాన్ని మార్చుకుంది ప్రాణాలను కాపాడన జానకిని నేను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆమె చదివిన విషయాన్ని జ్ఞానాంబతో చెప్పకూడదని అనుకుంటుంది. ఇక ఫోటోను వెంటనే ఇంట్లో కి తీసుకెళ్ళింది వైజయంతి చేతిలో డబ్బులు తీసుకు వస్తుంది. నువ్వు నాకు ఇచ్చిన ఐదు లక్షలలో ఇదిగో రెండు లక్షలు అంటూ చేతిలో పెడుతుంది. మిగతా డబ్బులు తప్పకుండా ఇస్తాను అందుకే నేను ఇక్కడికి రమ్మన్నాను అని వివరిస్తుంది.

కోడలు చేసిన పనికి జ్ఞానాంబ హ్యాపీ

కోడలు చేసిన పనికి జ్ఞానాంబ హ్యాపీ

అయితే ఆ మాటలను మాత్రం జ్ఞానాంబ అంత ఈజీగా నమ్మదు. ఏదో దాస్తున్నావు అంటూ వైజయంతిని పదే పదే అడుగుతుంది. అయినప్పటికీ జానకి జీవితాన్ని కాపాడాలని ఆలోచిస్తుంది. అందుకే నిజాన్ని బలంగా దాస్తుంది. ఇక జ్ఞానాంబ వైజయంతి ఇచ్చిన డబ్బును వెనక్కి ఇచ్చేసి అన్ని కుదిరిన తరువాతే ఒకేసారి ఇవ్వమని అంటుంది. అనంతరం కోడలు చేసిన మంచి పనికి ప్రశంసించాలని రామచంద్ర షాప్ కి వెళుతుంది. అక్కడే జానకి ఉండడంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది.

గర్వపడేలా చేశావు

గర్వపడేలా చేశావు

మొదట జానకి రామచంద్ర ఇద్దరు కూడా వైజయంతి ఉంటుందని అనుకుంటారు. ఇక జ్ఞానాంబ అడగక ముందే నిజం చెప్పాలని అనుకుంటుంది. ఆ విషయంలో రామచంద్ర కూడా జానకి మద్దతు ఇస్తాడు. ఏం జరిగినా సరే పర్వాలేదు అంటూ ఆమె నిర్ణయాన్ని ఒప్పుకుంటాడు. అయితే జ్ఞానాంబ మాత్రం జానకి చేసిన మంచి పని గురించి ప్రశంసలు కురిపిస్తుంది. ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడి గర్వపడేలా చేసేవని అనడంతో రామచంద్ర సంతోషిస్తారు. ఆ తర్వాత జ్ఞానాంబ వెళ్లిపోతుంది.

Recommended Video

Love Story Team Chit Chat With Suma | Naga Chaitanya | Sai Pallavi
సొంత ఇంట్లోనే దొంగలా..

సొంత ఇంట్లోనే దొంగలా..

ఇక జానకి చదువు విషయంలో మరో కీలకమైన ఘట్టం మొదలవబోతోంది. జానకి ఐపీఎస్ పరీక్షలకోసం శిక్షణ తీసుకుంటున్నందుకు అందుకు సంబంధించిన ఫీజులు అవసరం పడుతుంది. ఇక ఆ విషయాన్ని రామచంద్రకు కూడా చెబుతుంది. ఒకేసారి లక్ష రూపాయలు కట్టాలి అని చెప్పడంతో రామచంద్ర కూడా ఆలోచనలో పడతాడు. ఎవరికీ తెలియకుండా జ్ఞానాంబ గదిలో బంగారం తీసుకోవాలి అని అనుకుంటాడు. సొంత ఇంట్లోనే రామచంద్ర దొంగ గా మారడంతో ఆ విషయాన్ని మల్లిక పసిగడుతుంది. మరి ఆ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X