Janaki Kalaganaledu September 22nd Episode: జానకి చదువు కోసం తల్లి ప్రేమను తాకట్టు పెట్టిన రామచంద్ర!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. ఐపీఎస్ చదువుకోవాలని అనుకున్న జానకి అత్తగారింట్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక అబద్ధంతో ఎన్నాళ్ళు తన చదువును కొనసాగిస్తోంది అనే అంశాలతో ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరాంగా కొనసాగుతోంది. జానకి అబద్ధాలు చెప్పి కోచింగ్ సెంటర్ కు వెళ్లాలని అనుకుంటుంది. భర్త రామచంద్ర కూడా జానకికి ఎంతగానో సహాయ పడుతూ ఉంటాడు. జానకి ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో ఆమెకు అత్త జ్ఞానాంబ నుంచి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి.

జానకి కేవలం ఐదవ తరగతి మాత్రమే చదువుకున్నను అని చెప్పి అత్తకి తెలియకుండా తన ఐపీఎస్ చదువులలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక మధ్యలో ఆమెకు మల్లిక నుంచి కూడా మరొక ఆటంకం ఏర్పడింది. జానకి తన చదువు విషయంలో నిజం తెలిసిపోతుంది అని అనుకున్న సమయంలో ఆమెకు అనుకోకుండా ఒక మంచి పరిణామం ఏర్పడింది. ఆమె చేసిన ఒక మంచి పని తిరిగి మళ్ళీ ఆమెకు ఎంతగానో ఉపయోగపడింది. ఇక నేడు ప్రసారం కాబోయే 133వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

కోచింగ్ సెంటర్ కు జానకి

కోచింగ్ సెంటర్ కు జానకి

ఐపిఎస్ చదువు పూర్తి చేయడం కోసం జానకి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవడానికి సిద్ధమవుతుంది. స్వీట్ షాప్ లో కేకులు కూడా తయారు చేస్తే బాగుంటుంది అని గతంలో జ్ఞానాంబకు అబద్దం చెప్పిన విషయం తెలిసిందే. ఆ వంకతో కోచింగ్ సెంటర్ కు వెళ్లి ఐపీఎస్ పరీక్షలకోసం సిద్ధమవ్వాలి అనుకుంటుంది. ఇక ఆమెకు భర్త రామచంద్ర కూడా ఎంతగానో సహాయ పడుతూ ఉంటాడు. పుస్తకాలను తేవడమే కాకుండా కోచింగ్ సెంటర్ ఫీజులు కూడా కట్టాలి అని అనుకుంటాడు.

వైజయంతి నుంచి తప్పించుకున్న జానకి

వైజయంతి నుంచి తప్పించుకున్న జానకి

అయితే అనుకోకుండా జానకి చదువు విషయం వైజయంతి తెలియడంతో జ్ఞానాంబకు చెప్పాలని అనుకుంటుంది. కానీ అదే సమయంలో జానకి తన ప్రాణాలకు తెగించి వైజయంతి కూతురిని కాపాడడంతో ఆమె ఆ విషయాన్ని అంతటితో వదిలేసింది. నీ కాపురం చల్లగా ఉంటుంది అని కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఎలాంటి సహాయం కావాలన్నా కూడా తన నుంచి మద్దతు లభిస్తోందని వైజయంతి భరోసా ఇస్తుంది. అందుకు ఎంతగానో సంతోషించిన జానకి పెద్ద గండం నుంచి బయట పడినట్లు ఊపిరి పీల్చు కుంటుంది.

పిల్లలు పుట్టకుండా..

పిల్లలు పుట్టకుండా..

ఇక ఇంట్లో మనవళ్ళు మనవరాళ్ళు కావాలని అనుకుంటున్న జ్ఞానాంబకు మల్లిక మరో షాక్ ఇస్తుంది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా పిల్లలు పుట్టకుండా మందులు వేసుకుంటూ ఉంటుంది. ఇక మందులు ఎందుకు వేసుకుంటున్నావు అని భర్త అడిగినప్పుడు అతన్ని కాస్త కన్ఫ్యూజన్ లో పడేస్తుంది. నాకు క్యాన్సర్ ఉందని కాసేపు సరదాగా ఏడిపిస్తుంది. అనంతరం అసలు నిజాలు చెప్పి విష్ణుకి మరో షాక్ ఇస్తుంది. ఇబ్బందులు లేకుండా సంతోషంగా పిల్లలను కని అమ్మను సంతోష పెడితే అయిపోతుంది కదా అని ఎంత చెప్పినా కూడా మల్లిక ఏ మాత్రం అతని మాటలు పట్టించుకోదు.

 లక్ష రూపాయలు అంటూ షాక్ ఇచ్చిన జానకి

లక్ష రూపాయలు అంటూ షాక్ ఇచ్చిన జానకి

ఇక ఐపీఎస్ చదవాలి అంటే తప్పకుండా పరీక్షలకోసం కోచింగ్ కి వెళ్లాలని జానకి నిర్ణయం తీసుకుంటుంది ఇక ముందుగానే క్కొచింగ్ కు సంబంధించిన ఫీజు విషయంలో కూడా రామచంద్ర ఆమెకు భరోసా ఇస్తాడు. అయితే ఆ ఫీజు వేలల్లో ఉంటుందని అనుకుంటున్న రామచంద్రకు జానకి ఒక్కసారిగా షాక్ ఇస్తుంది. లక్షరూపాయలు వరకు అవసరం అవుతుందని చెప్పడంతో రామచంద్ర ఆలోచనలో పడతాడు. అయినప్పటికీ ఆ భయాన్ని తనలోనే దాచుకుని తప్పకుండా జానకి చదువు విషయంలో సహాయం చేయాలని ఆ ఫీజు నేను కడతాను అని మరోసారి భరోసా ఇస్తాడు.

తల్లిని మోసం చేయకుండా....

తల్లిని మోసం చేయకుండా....

వెయ్యి రూపాయలు కావాలన్నా కూడా తల్లి దగ్గర అడిగి తీసుకునే రామచంద్ర ఇప్పుడు లక్ష రూపాయలు ఎలా తీసుకోవాలి అని ఆలోచనలో పడతాడు. ఏదైనా అబద్ధం చెప్పి తీసుకుంటే మళ్లీ మోసం చేసినట్లు అవుతుందని బాధపడతాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పకూడదు అని అనుకుంటాడు. ఇప్పటికే తల్లి తో జానకి చదువు విషయంలో ఎన్నో అబద్ధాలు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ రామచంద్రం మనోవేదనకు గురవుతాడు. మరొకసారి అమ్మకు అబద్ధం చెప్పి మోసం చేయలేదు అని అనుకుంటాడు.

Recommended Video

IPC Section Bharya Bandhu Team Spoke To Media
మరో షాక్ ఇచ్చిన మల్లిక

మరో షాక్ ఇచ్చిన మల్లిక

ఇక ఎలాగైనా జానకి చదువు కోసం కోచింగ్ సెంటర్ ఫీజు కట్టాలి అని బలంగా నిర్ణయించుకున్న రామచంద్ర ఒక కఠినమైమ నిర్ణయం తీసుకుంటాడు. గతంలో జ్ఞానాంబ ఇచ్చిన ప్రేమతో ఒక బంగారం కానుకను రామచంద్ర తాకట్టు పెట్టాలని అనుకుంటాడు. అదే సరైన నిర్ణయమని అనుకున్న రామచంద్ర ఉదయాన్నే జానకిని కోచింగ్ సెంటర్ దగ్గర వదిలిపెట్టాలని అనుకుంటాడు.

అయితే అంతకు ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పగా మల్లిక నుంచి మరొక ఆశ్చర్యకరమైన డైలాగ్ వునిపిస్తుంది. ఏదైనా ఐపీఎస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కి వెళ్తున్నావా? ఆశీర్వాదం తీసుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తుంది. దీంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి మల్లిక మాటలకు జ్ఞానాంబ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X