For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu September 22nd: జెస్సి పెళ్లితో అసలు కథ మొదలయ్యింది.. జ్ఞానాంబకు షాక్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన కథాంశంతో మరో మలుపు తిరిగింది. రామచంద్ర సహకారంతోనే అతని భార్య జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకున్న జానకికి అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. జానకి మరిది అఖిల్ మరో అమ్మాయిని ప్రేమించి గర్భం వచ్చేలా చేస్తాడు. ఇక ఆ అమ్మాయికి న్యాయం చేయాలని జానకి ప్రయత్నం చేస్తోంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 394 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

   ఎంత చెప్పినా..

  ఎంత చెప్పినా..

  రామచంద్ర తమ్ముడు అఖిల్ జెస్సి అనే అమ్మాయిని ప్రేమించి ఆమెకు గర్భం వచ్చేలా చేస్తాడు. ఇక తర్వాత తన తల్లికి భయపడే ఆ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా ఉంటాడు. కానీ జానకి ఎలాగైనా జెస్సీకి న్యాయం చేయాలి అని అఖిల్ చేత పెళ్లి చేయించాలి అని కూడా అనుకుంటుంది. కానీ అఖిల్ మాత్రం తన తల్లికి భయపడి ఆ తప్పు నేను చేయలేదు అని, జెస్సిని ఎవరో మోసం చేస్తే నన్ను చీట్ చేయాలి అని అనుకుంటుంది అని అబద్ధం చెపుతాడు. ఆఖరికి తల్లి జ్ఞానాంబ మీద కూడా ఒట్టు వేస్తాడు ఇక అఖిల్ ను నమ్మిన జ్ఞానాంబ, జానకిరామచంద్ర ఎంత చెప్పినా కూడా ఆ పెళ్లి చేయడానికి మొదట ఒప్పుకోదు. అయితే చివరికి జానకీ అఖిల్ తో మరోసారి వివరంగా మాట్లాడాలని అనుకుంటుంది.

  మరోసారి అడిగిన జానకి

  మరోసారి అడిగిన జానకి


  నువ్వు ఈరోజు తప్పును దాచి పెట్టవచ్చు కానీ అదే ఎప్పటికైనా కూడా బయటపడుతుంది. ఆరోజు నిన్ను మీ అమ్మ ఎంత మాత్రం క్షమించరు. అంతేకాకుండా నీ మీద పెట్టుకున్న నమ్మకం అబద్ధమని తెలిసిన తర్వాత వాళ్లు ఒక్కసారిగా కుంగిపోతారు. మనం అంతేకాకుండా ఒక ఆడపిల్లకు అన్యాయం చేయడం మన కుటుంబానికి కూడా మంచిది కాదు. జెస్సి గురించి మరోసారి ఆలోచించు అని జానకి చాలా చెబుతుంది. అయితే అఖిల్ మాత్రం అందుకు ఎంత మాత్రం ఒప్పుకోడు ఆరోజు అమ్మ తన మీద ఒట్టు వేయమని చెప్పగానే నాకు ఎంతగానో భయం వేసింది. అందుకే ఒట్టు వేసి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాను. అయినా జెస్సి అబార్షన్ చేయించుకోమని ఎంత చెప్పినా కూడా వినడం లేదు. నువ్వైనా చెప్పు వదినా అంటూ అఖిల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు.

  అఖిల్ ను కొట్టిన రామ

  అఖిల్ ను కొట్టిన రామ


  ఇక అఖిల్ ను మరోసారి బ్రతిమాలెందుకు జానకి ప్రయత్నిస్తూ ఉండగా అతను లాభం లేదు అనుకొని అక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటాడు. ఇక అప్పుడే రామచంద్ర అఖిల్ మాట్లాడిన మాటలు వింటాడు. ఇన్ని రోజులు నువ్వు నాకు సంబంధం లేదు అని ఎన్నో అబద్ధాలు చెప్పావు ఇప్పుడు అర్థమయింది అంటూ ఒక్కసారిగా సీరియస్ అయిపోతాడు. నీ కోసం నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నాను నేను చదువుకోలేదు అలాగే నీ చిన్నన్నయ్య కూడా చదువుకోలేదు కనీసం నువ్వైనా చదువుకొని మా ఆశలు నెరవేరుస్తావు అని అనుకున్నాను. అలాంటిది ఒక ఆడపిల్లకు అన్యాయం చేసి మళ్లీ తప్పించుకోవాలని చూస్తున్నావ్ అంటూ రామచంద్ర కోపంతో చేయి చేసుకుంటాడు.

   నిజం తెలుసుకున్న జ్ఞానాంబ

  నిజం తెలుసుకున్న జ్ఞానాంబ


  అయితే ఆఖరిసారిగా అడుగుతున్నాను జెస్సిని పెళ్లి చేసుకుంటావా లేదా అనే రామచంద్ర మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయితే తల్లిని గుర్తు చేసుకున్న అఖిల్ నేను అంత ధైర్యం చేయలేను అని అక్కడినుంచి ఇంట్లోకి పారిపోవాలని అనుకుంటాడు. ఇక జానకి రామచంద్ర మరోసారి ఆలోచనలో పడతారు. అయితే రామచంద్ర అఖిల్ జానకి మాట్లాడుకుంటున్న మాటలను ముందుగానే జ్ఞానాంబ కూడా కిటికీలో నుంచి చూస్తుంది. అఖిల్ చేసిన తప్పుల గురించి తెలుసుకొని జ్ఞానాంబ ఇంకొకసారిగా కూలబడిపోతుంది. ఇక ఆ విషయంలో రామచంద్ర జానకి నిర్ణయం తీసుకోవాలని కూడా ఆమె చెబుతుంది. ఇక అందుకు తగ్గట్టుగానే జానకి ఉదయమే జెస్సి అఖిల్ ఇద్దరికీ పెళ్లి చేసి ఇంటికి తీసుకువస్తుంది.

  ఎంత మాత్రం క్షమించను

  ఎంత మాత్రం క్షమించను

  అయితే ఇంటికి వచ్చిన తర్వాత జ్ఞానాంబ అఖిల్ మీద మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతే కాకుండా అతని చెంపపై కొడుతుంది. నీ కారణంగా నేను ఇంట్లో వాళ్లను కూడా బాధపెట్టాను. నా కొడుకు తప్పు చేయడు అని నా పెంపకంపై ఎంతో నమ్మకం ఉంచాను. కానీ నువ్వు చదువుకునే వయసులో ఇలాంటి తప్పు చేశావు నిన్ను ఎంత మాత్రం క్షమించను అంటూ నువ్వు ఈరోజు నుంచి నాతో మాట్లాడడానికి వీలు లేదు అలాగే నీ భార్య కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది నీకు శిక్ష అంటూ.. జ్ఞానాంబ సీరియస్ అవుతుంది.

  జెస్సి సీరియస్

  జెస్సి సీరియస్


  ఇక మరోవైపు జెస్సి జెస్సి కూడా బాధపడుతుంది రామచంద్ర జానకి ఇద్దరు కూడా జెస్సికే ధైర్యం చెబుతారు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని అంటారు. అయితే జెస్సి అఖిల్ మీద కూడా చాలా కోపంగా ఉంటుంది. నేను చాలా బాధలో ఉన్న సమయంలో అబార్షన్ చేయించుకోమని చెప్పావు. నేను ఇక్కడికి వచ్చింది మళ్ళీ నీ ప్రేమను పొందడానికి. కాదు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఇక్కడికి వచ్చాను. అలాగే మా కుటుంబ గౌరవం కోసం కూడా ఆలోచించాను. ఇక నువ్వు కూడా నాతో మాట్లాడడానికి వీలులేదు.. అని జెస్సి సీరియస్ అవుతుంది. అయితే మరోవైపు జెస్సి తన ఇంట్లో ఉన్నట్లుగానే ప్యాంటు టీ షర్టు వేసుకొని అక్కడ ఉండడంతో జ్ఞానాంబ సీరియస్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఆచారాలు పద్ధతిలో ఉంటాయని వాటిని పాటించాలి అని జానకితో చెప్పించాలని జ్ఞానాంబ అంటుంది. మరి కొత్త కోడలు జ్ఞానాంబ ఎలాంటి షాక్ లు ఇస్తుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial September 22nd Episode 394
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X