Janaki Kalaganaledu September 23rd Episode: జానకి తల్లి కాబోతోందా.. ఊహల్లో తెలిపోయిన జ్ఞానాంబ!

జానకి కలగనలేదు సీరియల్ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రమే కాకుండా నేటితరం యువతకు కూడా ఇందులో ఉండే క్యూట్ లవ్ స్టొరీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఐపీఎస్ చదువుకోవాలని అనుకున్న భార్య కోసం, ఏమి చదువుకోలేని భర్త ఆమె చదువు కోసం ఎంతగానో కృషి చేస్తాడు. ఇక మరోవైపు జానకి అత్తకు తెలియకుండా అబద్దాలు చెప్పి చదువును కొనసాగిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఐపీఎస్ కావాలని అనుకుంటుంది.

ఆమె అబద్ధం చెప్పి ఇంకా ఎన్నాళ్ళు తన చదువును కొనసాగిస్తోంది అనే పాయింట్ తో ఈ సీరియల్ లో ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇక ఫైనల్ గా జానకి అబద్ధాలు చెప్పి కోచింగ్ సెంటర్ కు వెళ్లాలని అనుకుంటుంది. భర్త రామచంద్ర కూడా జానకికి ఎంతగానో సహాయ పడుతూ ఉంటాడు. అయితే మల్లిక నుంచి మాత్రం జానకికి మరొక ఆటంకం ఏర్పడింది. చదువు విషయంలో మల్లికకు ఇప్పటికే ఒక నిజం తెలిసిపోతుంది. ఆ విషయాన్ని అత్త జ్ఞానాంబకు చెప్పాలని ఒక టార్గెట్ పెట్టుకుంటుంది. ఇక నేడు ప్రసారం కాబోయే 134వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

నేను చూసుకుంటాను అంటూ

నేను చూసుకుంటాను అంటూ

తన ఐపిఎస్ చదువు పూర్తి చేయడం కోసం జానకి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవడానికి సిద్ధమవుతుంది. అయితే అందుకు ఫీజ్ లక్ష ర్రూపాయల వరకు అవుతుందని జానకి భర్త రామచంద్ర తో చెబుతుంది. అయితే వంద రూపాయలు కావాలన్నా కూడా తల్లిని అడిగి తీసుకునే రామచంద్ర అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు. జానకి భయంతోనే అడిగినప్పటికీ కూడా రామచంద్ర ఎంతో ధైర్యంగా ఆ డబ్బుల విషయం నేను చూసుకుంటాను అని భరోసా ఇస్తాడు.

అమ్మ ఇచ్చిన గొలుసు

అమ్మ ఇచ్చిన గొలుసు

రామచంద్ర ఎంతో ఆలోచించి చివరికి తన తల్లి పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన ఒక బంగారు గొలుసును తాకట్టు పెట్టాలని అనుకుంటాడు. ఆ సందర్భంలో అమ్మ మాటను గుర్తు చేసుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కానుకను పోగొట్టుకోకూడదు అంటూ గతంలో తల్లి చెప్పిన మాట రామచంద్ర గుర్తుకువస్తుంది. అలాగే జాగ్రత్తగా ఉంటాను అని అది దూరమైతే నీ కంటే ఎక్కువ బాధ పడతారు అని కూడా గుర్తు చేసుకుంటాడు. జ్ఞానాంబ దగ్గరకి వెళ్లి ఎంత ఆలోచించినా రామచంద్ర తన భార్య చదువు కోసం ఈ పని చేయక తప్పడం లేదని బాధపడతాడు.

ఏదో పెద్ద రహస్యం ఉంది

ఏదో పెద్ద రహస్యం ఉంది

ఇక రామచంద్రరావు ఆ గదిలోకి ఎందుకు వెళ్ళాడు అర్థం కానీ మల్లిక వెంటనే తలుపులు తెరిచి చూస్తుంది. అక్కడ చేతిలో గొలుసు పట్టుకొని రామచంద్ర తనలో తాను మాట్లాడుకోవడాన్ని గమనిస్తుంది. దాని వెనుక ఏదో పెద్ద రహస్యం ఉంది అని ఆలోచించిన మల్లికా ఎలాగైనా నిజం తెలుసుకోవాలని ఆడుకుంటుంది. ఇక ఉదయాన్నే జానకిని రెడీ అవ్వాలని చెప్పి బయటకు వెళ్లిన రామచంద్ర కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తాడు. అతని కోసం ఎదురు చూసిన జానక్ ఇంట్లోకి రాగానే ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్నిస్తుంది. డబ్బు కోసమే బయటకు వెళ్ళాను అని రామచంద్ర సమాధానం ఇస్తాడు. ఇక ఈ డబ్బు ఎక్కడిది అని జానకి బాధతో అడుగుతుంది. డబ్బులు తయారు చేసి తీసుకు వచ్చే సరికి ఈ సమయం అయ్యింది అని సరదాగా సమాధానం ఇస్తాడు. కానీ జానకి నిజం చెప్పండి అంటూ మరోసారి అడుగుతుంది.

ఎవరికీ తలవంచలేదు..

ఎవరికీ తలవంచలేదు..

ఇక నేను ఎవరికీ తలవంచలేదు, ఎవరి దగ్గర అప్పు చేసి డబ్బులు తీసుకు రాలేదు. నా సొంతంగానే సంతోషంగా డబ్బు తీసుకు వచ్చాను అని, ఈ సంగతి మర్చిపోయి చదువుపై దృష్టి పెట్టండి అని మరోసారి రామచంద్ర సమాధానం ఇస్తాడు. ఇక ఆ తర్వాత అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకుంటే తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు అంటూ రామచంద్రం తన తల్లి జ్ఞానాంబ తండ్రి గోవిందరాజులను పిలుస్తాడు. ఇక వారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా అప్పుడే గమనించిన మల్లిక ఎవరూ ఊహించని విధంగా ప్రశ్నిస్తుంది. ఏదో ఐఏఎస్ ఐపీఎస్ సాధించడానికి వెళ్తున్నట్లు అత్తయ్య మామయ్య గారి ఆశీర్వాదం తీసుకుంటున్నావేంటి జానకి అని సందేహాన్ని కలుగజేస్తుంది.

జ్ఞానాంబ ఆశీర్వాదం తీసుకున్న జానకి

జ్ఞానాంబ ఆశీర్వాదం తీసుకున్న జానకి

అలాంటిదేమీ లేదు అని చెప్పిన జానకి నేను కేవలం కేకులు తయారు చేయడానికి వెళ్తున్నాను అని, ఏదైనా పని సక్సెస్ అవ్వాలి అంటే పెద్దల ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలని అందుకే అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకుంటున్నాను అని సమాధానం ఇస్తుంది. రామచంద్ర కూడా అదే తరహాలో చెబుతాడు. అయినప్పటికీ అల్లిక మరింత అనుమానం కలిగేలా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. ఇక ఆమెను గోవిందరాజులు, జ్ఞానాంబ ఇద్దరూ కూడా ఆపేసే ప్రయత్నం చేస్తారు.

జానకి తల్లి కాబోతోందా?

జానకి తల్లి కాబోతోందా?

ఇక తర్వాత జానకిని కోచింగ్ సెంటర్ కు తీసుకెళ్ళు రామచంద్ర ఫీజు కట్టాలి అని చెబుతాడు. అయితే మీరు కూడా లోపలికి రండి అంటూ జానకి చెప్పినప్పటికీ రామచంద్ర కొంత సిగ్గు పడతాడు. అక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి నేను రాలేను అని చెబుతాడు. అయినప్పటికీ జానకి భర్తను లోపలికి తీసుకువెళ్లాలని అనుకుంటుంది. ఇక మరోవైపు కథలో ఊహించని విధంగా జ్ఞానాంబ జానకి తల్లి అవుతుంది అనే ఆనందంలో ఉంటుంది. మానవడిని ఎత్తుకున్నట్లుగా ఊహల్లో తేలిపోతుంది. నాకు ఇంతవరకు ఈ సంతోషాన్ని ఎందుకు చెప్పలేదు అంటూ జానకిని అడుగుతుంది. మరి నిజంగానే జానకి తల్లి అయ్యిందా? అసలు జ్ఞానాంబకు ఆ విషయాన్ని ఎవరు చెప్పారు అనే విషయం తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X