Janaki Kalaganaledu September 24th Episode: వారసుడి కోసం జానకి గ్రీన్ సిగ్నల్.. శోభనం కోసం అందంగా ముస్తాబై..

జానకి కలగనలేదు సీరియల్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి మాత్రమే కాకుండా నేటితరం యువతకు కూడా ఇందులో ఉండే క్యూట్ లవ్ స్టొరీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. జానకి - రామచంద్ర ఇద్దరు కూడా భావోద్వేగమైన సీన్స్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఐపీఎస్ అవ్వాలని అనుకున్న భార్య కల కోసం, ఏమి చదువుకోలేని భర్త ఆమె కోసం ఎంతగానో కృషి చేస్తాడు. ఇక మరోవైపు జానకి అత్త జ్ఞానాంబకు తెలియకుండా అబద్దాలు చెప్పి చదువును కొనసాగిస్తూ ఉంటుంది. అబద్ధం చెప్పి ఇంకా ఎన్నాళ్ళు తన చదువును కొనసాగిస్తోంది అనే పాయింట్ తో ఈ సీరియల్ లో మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది.

ఇక ఫైనల్ గా జానకి అబద్ధాలు చెప్పి కోచింగ్ సెంటర్ కు వెళ్లాలని అనుకుంటుంది. భర్త రామచంద్ర కూడా జానకికి ఎంతగానో సహాయ పడుతూ ఉంటాడు. అయితే మల్లిక నుంచి మాత్రం మరొక ఆటంకం ఏర్పడింది. చదువు విషయంలో మల్లికకు ఒక నిజం తెలిసిపోతుంది. ఆ విషయాన్ని జ్ఞానాంబకు చెప్పాలని అనుకుంటుంది. కానీ ఆమె ప్లాన్స్ ప్రతిసారి డిజాస్టర్ అవుతుంటాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 135వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

 జానకి చదువు కోసం లక్ష రూపాయలు

జానకి చదువు కోసం లక్ష రూపాయలు

ఐపిఎస్ చదువు పూర్తి చేయడం కోసం జానకి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవాలని అనుకుంటుంది. అందు కోసం సివిల్స్ కోచింగ్ కు లక్ష ర్రూపాయల వరకు ఫీజ్ అవసరం అవుతుందని జానకి భర్త రామచంద్రకు చెబుతుంది. అయితే వంద రూపాయలు కావాలన్నా కూడా తల్లిని అడిగి తీసుకునే రామచంద్ర అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు. జానకి భయంతోనే అడిగినప్పటికీ కూడా రామచంద్ర ఎంతో ధైర్యంగా ఆ ఫీజు విషయం తాను చూసుకుంటాను అని భరోసా ఇస్తాడు.

రామచంద్రపై చిన్నబాబు ఫోకస్

రామచంద్రపై చిన్నబాబు ఫోకస్

ఇక రామచంద్ర చివరికి తల్లి పుట్టినరోజు కానుకను తాకట్టు పెట్టాలని అనుకుంటాడు. జ్ఞానాంబ ఎంతో ప్రేమగా ఇచ్చిన బంగారు గొలుసును తాకట్టు పెట్టే జానకి ఫీజు కోసం లక్ష రూపాయలు తీసుకువస్తాడు. తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకుంటే మీరు అనుకున్న పని తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పడంతో జానకి ఎంతో సంతోషంగా అత్త మామల బ్లెస్సింగ్స్ తీసుకొని కోచింగ్ సెంటర్ కి వెళుతుంది. ఇక కోచింగ్ సెంటర్ కి వెళ్ళగానే అక్కడ రామచంద్రకు అనుకోని విధంగా చిన్నబాబు ఎదురు అవుతాడు. ఇక్కడ రామచంద్రకు పని ఏమిటి అనే అతను ఆరా తీసే ప్రయత్నం చేస్తాడు.

ఎదో రహస్యం ఉందని అనుమానం

ఎదో రహస్యం ఉందని అనుమానం

చిన్న బాబు ఇక్కడ పనేంటి అని ఎంత అడిగినా కూడా రామచంద్ర ఏ మాత్రం నిజం చెప్పకుండా.. కంగారులో వెనక్కి అడుగులు వేస్తూ రామ కంగారు పడుతూ ఉంటాడు. అంతలోనే జానకి పరీక్ష ఫీజు కట్టి బయటకు వస్తుంది. ఈ క్రమంలో చిన్న బాబు జానకి ఎదురయ్యే వాతావరణం కనిపిస్తుంది. కానీ రామచంద్ర ఏం చేయాలో పాలుపోక ఇక్కడ తెలిసినవారికి స్వీట్స్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను అని చెబుతాడు. ఇక ఆ వెంటనే అక్కడి నుంచి బైక్ తీసుకొని వెళ్తాడు. ఇక ఆ తర్వాత చిన్న బాబు కూడా ఇందులో ఏదో పెద్ద రహస్యమే ఉందని అనుకుంటాడు. ఇక ఆ తర్వాత అతను కూడా అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

పక్కింటి పిల్లడితో జ్ఞానాంబ

పక్కింటి పిల్లడితో జ్ఞానాంబ

మరోవైపు జ్ఞానాంబ తన పక్కింటి పిల్లాడిని ఎత్తుకుని ఎంతో సరదాగా ఆడుకుంటూ ఉంటుంది. ఇంట్లో పక్కన అమ్మాయి సరుకుల కోసం ఇంటికి వచ్చిందని ఈ పిల్లాడికి తనకు ఇచ్చిందని తన భర్తతో కూడా ఎంతో సంతోషంగా చెబుతుంది. మనవడినీ దృష్టిలో ఉంచుకొని జ్ఞానాంబ ఎంతగానో ఆనందపడుతుంది. ఇలాంటి మనవడు మనకు కూడా ఉంటే ఎంతో సంతోషంగా ఉంటామని భర్తతో ఎమోషనల్ అవుతుంది.

అందుకు గోవింద రాజులు కూడా తప్పకుండా మన ఇంట్లో కూడా మనవడు మనవరాలు వస్తారని అంటాడు.

జ్ఞానాంబ ఎమోషనల్

జ్ఞానాంబ ఎమోషనల్

ఇక మరోవైపు సరుకుల కోసం వచ్చిన పక్కింటి అమ్మాయిని మల్లిక తన మాటలతో ఎత్తిపొడుస్తుంది. త్వరగా నీ కొడుకును ఇంట్లో నుంచి తీసుకు వెళ్ళిపోలేదంటే ఈ రోజే మా అత్తగారు నాతో పిల్లలను కనిపించేలా ఉందని ఉంటుంది. ఇక ఆ పక్కింటి అమ్మాయి కూడా తన బాబుని తీసుకొని వెళ్లిపోతుంది. అప్పుడు కూడా జ్ఞానాంబ ఎమోషనల్ అవుతుంది. అంతే కాకుండా ఆ అమ్మాయిని విలైనప్పుడల్లా తన ఇంటికి తీసుకు రావాలని వాడితో సంతోషంగా ఆడుకోవాలని ఉందని అంటుంది.

వారసుడి కోసం సిద్దమైన జానకి

వారసుడి కోసం సిద్దమైన జానకి

ఇక జానకి ని కోచింగ్ సెంటర్ నుంచి తీసుకురావాలని అనుకున్న రామచంద్ర ఆ తరువాత భార్యను ఒక చింత చెట్టు దగ్గరకు తీసుకెళ్తాడు. అక్కడ చింతకాయలు తినిపించి సరదాగా ఆమెతో గడుపుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత జ్ఞానాంబ మనవడి కోసం కలలు కంటూ ఉంటుంది. ఇక ఇదే సమయంలో జానకి కూడా అత్త గారికి వారసుడిని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటుంది ఇక శోభనం కోసం అందంగా ముస్తాబైన జానకి రామచంద్రను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక రామచంద్ర జానకి కాటుకను తీసి చెంప పై దిష్టి చుక్క పెడతాడు. మరి జానకి తీసుకున్న నిర్ణయం ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం కలిగిస్తున్న చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X