For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu September 27th Episode: శోభనం రోజు జానకి కోరికను తీర్చలేకపోయిన రామ.. మల్లిక మరో ప్లాన్

  |

  స్టార్ మా లో ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మొత్తానికి ఒక ట్రాక్ లోకి వచ్చింది. జానకి ఐపీఎస్ చదువుకోవలనే కలను మొత్తానికి ఆచరణలో పెడుతోంది. నేటితరం యువతకు కూడా ఇందులో ఉండే క్యూట్ లవ్ స్టొరీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. జానకి - రామచంద్ర ఇద్దరు కూడా భావోద్వేగమైన సీన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఐపీఎస్ అవ్వాలని అనుకున్న భార్య కల కోసం, భర్త రామ ఎంతగానో సహాయం చేస్తుంటాడు. ఇక మరోవైపు జానకి అత్త జ్ఞానాంబకు తెలియకుండా అబద్దాలు చెప్పి చదువును కొనసాగిస్తూ ఉంటుంది. అబద్ధం చెప్పి ఇంకా ఎన్నాళ్ళు తన చదువును కొనసాగిస్తోంది అనే పాయింట్ తో ఈ సీరియల్ లో మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇక ఫైనల్ గా జానకి అబద్ధాలు చెప్పి కోచింగ్ సెంటర్ కు వెళ్లాలని అనుకుంటుంది. భర్త రామచంద్ర కూడా జానకికి ఎంతగానో సహాయ పడుతూ ఉంటాడు. అయితే మల్లిక నుంచి మాత్రం మరొక ఆటంకం ఏర్పడింది. చదువు విషయంలో మల్లికకు ఒక నిజం తెలిసిపోతుంది. ఆ విషయాన్ని జ్ఞానాంబకు చెప్పాలని అనుకుంటుంది. కానీ ఆమె ప్లాన్స్ ప్రతిసారి డిజాస్టర్ అవుతుంటాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 135వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   జానకి కోసం చింత కాయలు

  జానకి కోసం చింత కాయలు

  జానకి చదువు కోసం లక్ష రూపాయల వరకు అవసరం కావడంతో రామచంద్ర తన తల్లి ఎంతో ప్రేమగా ఇచ్చిన గొలుసును కూడా తాకట్టు పెడతాడు. ఇక ఆ తర్వాత కోచింగ్ సెంటర్ కు వెళ్లి ఫీజు కట్టే సమయంలో అప్పటికే అక్కడికి చిన్నబాబు వస్తాడు. ఇక్కడ రామచంద్రకు పని ఏమిటి అని ఆరా తీసే ప్రయత్నం చేస్తాడు కానీ అతనికి అసలు నిజం తెలియకూడదు అని రామచంద్రం మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఇక తర్వాత జానకి ఒక ప్రత్యేకమైన చోటు తీసుకెళ్లి ఆమెకు కావలసిన చింతకాయలను కూడా కోసి ఇస్తాడు.

   ఏదైనా విశేషమా..?

  ఏదైనా విశేషమా..?

  ఇక మరోవైపు జ్ఞానాంబ తన పక్కింటి చిన్న పిల్లాడితో ఆడుకుంటూ ఉంటుంది. మనకు కూడా ఒక మనవడు మనవరాలు ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుందని తన భర్త గోవిందరాజుల తో చెప్పుకుంటూ బాధపడుతుంది. ఇక అప్పుడే ఆ పక్కింటి అమ్మాయి తన కొడుకుని తీసుకువెళ్లడానికి వస్తుంది. ఇక అదే సమయంలో జానకి కూడా ఇంట్లోకి వస్తుంది. అయితే చేతిలో చింతకాయ కనిపించడంతో ఆ అమ్మాయి ఏదైనా విశేషం ఉందా అని ఎంతో ఆశగా అడుగుతుంది. ఇక జానకి మాత్రం అలాంటిదేమీ లేదని జ్ఞానాంబను ఒక్కసారిగా నిరాశపరుస్తుంది.

  వారసుడి కోసం శోభనం

  వారసుడి కోసం శోభనం

  మంచి పూజలు వ్రతాలు చేస్తే కూడా పిల్లలు కలిగే అవకాశం ఉందని గోవిందరాజులు చెప్పినప్పటికీ జ్ఞానాంబ ఒప్పుకోదు. అయినా పిల్లలు కలగాలని వాళ్ళ లో ఉండాలి కానీ మనం ఎన్ని పూజలు చేయించినా కూడా ఏమి లాభం ఉండదని అంటుంది. ఇక ఆ తర్వాత అత్తను చూసి జానకి బాధపడుతుంది. ఇక ఇంటికి వారసుడిని అందించాలని నిర్ణయం తీసుకుంటుంది. అందుకోసం శోభనం కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతోంది. శోభనం కోసం అందంగా ముస్తాబైన జానకి రామచంద్రను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక రామచంద్ర జానకి కాటుకను తీసి చెంప పై దిష్టి చుక్క పెడతాడు.

  చదువు పూర్తయిన తరువాతే..

  చదువు పూర్తయిన తరువాతే..

  అత్తగారి బాధ నేను చూడలేకపోతున్నాను ఎలాగైనా ఇంటికి మంచి వారసుడు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ భర్త రామచంద్రకు చెబుతుంది. అయితే అందుకు రామచంద్ర ఏ మాత్రం ఒప్పుకోడు. మీరు ఇప్పుడు పిల్లలు కనడానికి సిద్ధం అయితే మళ్లీ మీ చదువుకు ఆటంకం కలుగుతుంది. మరో రెండేళ్లు కళ్ళు మూసుకుని కష్టపడితే తప్పకుండా మీరు అనుకున్న కలలు నిజం చేసుకోవచ్చని ఆ తర్వాత అమ్మ కోరిక కూడా నెరవేర్చాలని సలహా ఇస్తాడు.

   రామచంద్ర రివర్స్..

  రామచంద్ర రివర్స్..

  రామచంద్ర చెప్పిన మాటలను మొదట్లో దానికి ఏమాత్రం పట్టించుకోదు. అత్తగారు నిద్ర పోకుండా కూడా బాధపడుతున్నారు ఆమె మనసులో ఎంతగానో బాధ ఉంది. ఆమెను ఎంతగానో మోసం చేస్తున్నాను అనిపిస్తుంది. అందుకే ఈ విషయంలో నేను బలమైన నిర్ణయం తీసుకున్నాను అని జానకి మరోసారి భర్తకు చెబుతోంది. కానీ రామచంద్ర మాత్రం ఎంత చెప్పినా కూడా వెనక్కి తగ్గడు. పిల్లలను మరో రెండేళ్ల తర్వాత కూడా కనవచ్చు. ఇప్పుడు ఈ అవకాశాన్ని వదులు కుంటే మళ్ళీ మీరు అనుకున్న ఐపిఎస్ చదువును పూర్తి చేయలేరు. ఇప్పటికే ఇంట్లో వాళ్ళు చేసిన ఇష్టం లేని పెళ్లి కారణంగా మీరు మీ కలను దూరం పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ నా కారణంగా మీరు మీ డ్రీమ్ ను వదులుకోవద్దు. ఆ అవకాశం అయితే నేను ఇవ్వను అని రామచంద్ర ధైర్యం చెబుతాడు.

  Bengaluru లో Pranitha Subhash Nitin Raju Marriage | గొప్ప మనసున్న నటి || Filmibeat Telugu
  కారు డిక్కీలో మల్లిక

  కారు డిక్కీలో మల్లిక

  ఇక మరోవైపు మల్లిక, జానకి కోచింగ్ సెంటర్ కు వెళ్లకుండా రామచంద్ర బైక్ తలలను దాచేస్తుంది. ఇక ఆ సమయంలో గోవిందరాజులు వచ్చి తన కారు తీసుకు వెళ్ళండి అని చెబుతాడు. ఇక మల్లిక మరో ప్లాన్ వేస్తుంది. వీరు ఎక్కడికి వెళుతున్నారు అనే విషయం తెలుసుకోవాలని కారు డిక్కీలో దాక్కొని ఉంటుంది. మరి ఆమెకు అసలు నిజం తెలుస్తుందో లేదో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 136:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X