Janaki Kalaganaledu September 28th Episode: బెడిసికొట్టిన్న మల్లిక కుట్ర.. పిల్లలు పుట్టకుండా న్యూ ట్విస్ట్!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఎలాగైనా ఐపీఎస్ చదువుకోవలనే కలలు కనే జానకి మొత్తానికి మొదటి అడుగు వేసింది. భర్త సహాయంతో కోచింగ్ తీసుకుంటూ చదువును పూర్తి చేసేందుకు సిద్దమైంది. నేటితరం యువతకు కూడా ఇందులో క్యూట్ లవ్ స్టొరీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. భావోద్వేగమైన సీన్స్ తో జానకి రామచంద్ర ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఐపీఎస్ అవ్వాలని అనుకున్న భార్య కోసం భర్త రామ ఆమెకు తోడుగా నిలుస్తారు. జ్ఞానాంబకు తెలియకుండా మోసం చేస్తున్నప్పటికీ జానకి చదువును కొనసాగిస్తూ ఉంటుంది. ఫైనల్ గా జానకి కేకులు నేర్చుకుంటాను అనే వంకతో అబద్ధాలు చెప్పి కోచింగ్ సెంటర్ కు వెళ్లాలని అనుకుంటుంది. భర్త రామచంద్ర కూడా జానకికి ఎంతగానో సహాయ పడుతూ ఉంటాడు. అయితే మల్లిక నుంచి మాత్రం మరొక ఆటంకం ఏర్పడింది. చదువు విషయంలో మల్లికకు అనుమానాలు వస్తాయి. ఆ విషయాన్ని జ్ఞానాంబకు చెప్పాలని అనుకుంటుంది. కానీ ఆమె ప్లాన్స్ డిజాస్టర్ అవుతుంటాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 136వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం
Photo Courtesy: Star మా and Disney+Hotstar

వారసుడి కోసం జ్ఞానాంబ ఆరాటం
జానకి తనకు ఎంతో ఇష్టమైన చింతకాయలను భర్తతో కలిసి ఒక చెట్టు దగ్గర నుంచి తెచ్చుకుంటుంది. ఇక అమ్మకు కూడా చింతకాయలు అంటే చాలా ఇష్టమని రామచంద్ర చెప్పడంతో జానకి కొన్నిటిని ఇంటికి కూడా తీసుకు వస్తుంది. అయితే ఆ విషయాన్ని గమనించిన లీలావతి శుభవార్త చెబుతుందో ఏమో అని అడుగుతుంది. అత్తా నీ కోడలు వారసుడిని సిద్ధంగా ఉందని అనడం తో జ్ఞానాంబ ఒక్కసారిగా సంతోషపడుతుంది. అయితే అలాంటిదేమీ లేదని మళ్ళీ వెంటనే జానకి చెప్పడంతో అసంతృప్తికి లోనవుతుంది.

అందంతో భర్తను ఆకర్షించిన జానకి
అయితే పూజలు చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని లీలావతి చెప్పడంతో గోవింద రాజులు కూడా అందుకు ఒప్పుకుంటాడు. జ్ఞానాంబకు చెప్పినప్పటికీ ఆమె అందుకు ఏ మాత్రం ఒప్పుకోదు. పిల్లలు కావాలని ఆలోచన వారిలో ఉంటేనే బాగుంటుందని ఎన్ని పూజలు చేసినా ఏమీ లాభం ఉండదని కూడా అంటుంది. ఇక జానకి కొత్త పడుతున్న మనోవేదన గురించి తెలుసుకొని ఎలాగైనా వారసుడిని ఇవ్వాలని అనుకుంటుంది. అందుకోసం రామచంద్రను కూడా తన అందంతో ఎంతగానో ఆకర్షిస్తుంది.

జానకి కోరికను కాదన్న రామచంద్ర
అయితే జానకి చదువును దృష్టిలో ఉంచుకొని రామచంద్ర అందుకు ఏ మాత్రం ఒప్పుకోడు. మరొక రెండేళ్లు మీరు కష్టపడితే అనుకున్న ఐపీఎస్ కోర్సును పూర్తి చేయవచ్చని ఆ తర్వాత అమ్మ కోరికను కూడా నెరవేర్చని సలహా ఇస్తాడు. మొదట అందుకు జానకి ఒప్పుకోకపోయినప్పటికే ఆ తర్వాత భర్త మాటకు విలువ ఇచ్చి కాదనలేక పోతుంది.

మల్లిక మరొక కుట్ర
ఇక ఉదయాన్నే లేచి మొదటిరోజు కోచింగ్ సెంటర్ కు వెళ్లాలని సిద్ధమైన జానకికి ఊహించని విధంగా చేదు అనుభవం ఎదురవుతుంది. అసలు జానకి రామచంద్ర కేకులు నేర్చుకోవడానికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పినప్పటికీ ఎక్కడికో వెళ్తున్నారనే అనుమానం వ్యక్తం చేసిన మల్లిక మరొకసారి తన ఆలోచనతో బైకు తాళం కనిపించకుండా చేస్తుంది. బైక్ తాళం కనిపించకపోవడంతో రామచంద్ర అసంతృప్తితో ఉంటాడు. ఎంత వెతికినా దొరకదు. ఇక అక్కడికి వచ్చిన తండ్రి గోవిందరాజులు ఈరోజు తన కారును తీసుకెళ్లండి అని చెబుతాడు.

మరోసారి మల్లిక ప్లాన్ రివర్స్
ఇక మల్లిక ప్లాన్ ఫ్లాప్ కావడంతో మరోసారి ఆలోచించి ఎలాగైనా వీరు రహస్యం తెలుసుకోవాలని కారు డిక్కీలో దాక్కొని ఉంటుంది. ఇక ఇద్దరూ ప్రయాణిస్తుండగా అనుకోకుండా దారి మధ్యలో విష్ణు కూడా కనిపిస్తాడు. షాప్ కు బట్టలు తీసుకు వెళ్లాలని విష్ణు సంచులతో బైక్ పై ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక ఆ విషయాన్ని చూసిన జానకి విష్ణుకి కారు ఇచ్చేసి మనం బైక్ పై వెళదామని సలహా ఇస్తుంది. అందుకు రామచంద్ర కూడా ఓకే చెప్పడంతో తమ్ముడికి కారు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇక అది తెలియని మల్లిక ఒక్కసారిగా కారు దిగి జానకి రామచంద్ర గారు ఎక్కడ ఉన్నారు అని వెతుకుతుంది. పక్కనే ఉన్న భర్తను కూడా చూస్తుంది. జరిగిన విషయాన్ని చెప్పడంతో మల్లిక భర్త పై ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

పిల్లలు పుట్టకుండా టాబ్లెట్
ఇక మరోవైపు జ్ఞానాంబ ఇంటికి వారసుడు లేదని బాధతో ఉంటుంది. అయితే లీలావతి చెప్పినట్లు పూజలు చేయిస్తే తప్పకుండా పిల్లలు కలుగుతారని గోవిందరాజు అంటాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తానని చెబుతాడు. ఇక ఇంటికి వచ్చిన మల్లిక అనుకోకుండా చేతిలో ఉన్న ఒక టాబ్లెట్ ప్యాకెట్ను పడేస్తుంది. పిల్లలు పుట్టకుండా ఇంట్లో ఎవరో టాబ్లెట్ వేసుకుంటున్నారని పసిగట్టిన గోవిందరాజులు ఆరా తీసే ప్రయత్నం చేస్తాడు. ఇక ఇంట్లో నేను ఒక్కదాన్నే మాత్రమే లేను అంటూ మరొక కోడలు కూడా ఉందనే విషయాన్ని గమనించాలి అని మల్లిక దొంగ లాగా ఏడుస్తుంది. మరి ఈ విషయంపై జ్ఞానాంబ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Recommended Video

టాప్ రేటింగ్‌తో జానకి కలగనలేదు సీరియల్
జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన కంటెంట్, నటీనటులు ఫెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఈ సీరియల్‌లో ప్రతీ వారానికి రేటింగ్‌ను మెరుగు పరుచుకొంటూ ముందుకెళ్తున్నది. ఈ సీరియల్ 37వ వారంలో రూరల్ ప్రాంతంలో 8.50 రేటింగ్, అర్బన్ ప్రాంతంలో 7.82 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇక 36వ వారంలో ఈ సిరియల్.. రూరల్ ప్రాంతంలో 8.89 రేటింగ్, అర్బన్‌లో 8.24 రేటింగ్‌ను సాధించింది.


Click it and Unblock the Notifications











