For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu September 28th: మల్లిక ప్లాన్ తో పూజలో అపశకునం.. దొంగగా మారిన రామ!

    |

    జానకి కలగనలేదు మంచి కథాంశంతో మరో మలుపు తిరిగింది. రామచంద్ర సహకారంతోనే, భార్య జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. అందుకు ఆమె అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. జానకి మరిది అఖిల్ మరో అమ్మాయిని ప్రేమించి గర్భం వచ్చేలా చేస్తాడు. ఇక ఆ అమ్మాయికి న్యాయం చేయాలని జానకి ప్రయత్నం చేస్తోంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 398 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    కోపం పోయేలా..

    కోపం పోయేలా..

    జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ ప్రేమించి జెస్సి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మొదట అఖిల్ అబద్దాలు చెప్పి అమ్మాయిని మోసం చేయాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత జానకి అత్తగారికి నిజం చెప్పి పెళ్లికి ఒప్పిస్తుంది. అయితే జ్ఞానాంబ మాత్రం కొడుకు మీద చాలా కోపంగానే ఉంటుంది. అలాగే అతని భార్య జెస్సి తో కూడా మాట్లాడదు. ఇక జ్ఞానాంబ కోపం పోయేలా చేయాలని సంతోషంగా ఉండాలి అని కూడా ఇంట్లో అందరూ అనుకుంటారు. ఇక జానకి రామచంద్ర అట్లతద్ది పండగను ప్రత్యేకంగా పూజ కార్యక్రమాలతో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు.

    మల్లిక కన్నింగ్ ప్లాన్

    మల్లిక కన్నింగ్ ప్లాన్

    ఈ క్రమంలో నలుగురుని పిలిచి వ్రతం నిర్వహించి ముత్తైదువులకు వాయనం కూడా ఇవ్వాలని అనుకుంటారు. అందుకు తగ్గట్టుగా జానకి అని ఏర్పాట్లను సిద్ధం చేస్తుంది. అయితే మరోవైపు మల్లిక మాత్రం ఇంట్లో ఏదో ఒక గొడవ జరగాలని ప్లాన్ వేస్తుంది. ముందుగానే నీలావతికి చెప్పి పూజను ఏదో ఒక రకంగా చెడగొట్టాలని అనుకుంటుంది. అందుకోసం ప్రత్యేకంగా ఒక పౌడర్ కూడా తెప్పించి పూజ జరిగే కార్యక్రమంలో దాన్ని జాకెట్ ముక్కలకు రాస్తే హఠాత్తుగా హారతి దానికి అంటుకుంటుంది అని అప్పుడు పూజ మొత్తం కూడా అపశకునాలతోనే ముగుస్తుంది అని నీలావతి ప్లాన్ వేస్తుంది. అందుకు మల్లికా కూడా చాలా సంబరపడిపోతుంది.

     పూజలో జెస్సి పొరపాటు

    పూజలో జెస్సి పొరపాటు

    ఇక పూజ మొదలైన తర్వాత మొదట జానకిని ప్రత్యేకంగా పాట కూడా పడమంటారు. ఇక జానకి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతుంది. అయితే అదే క్రమంలో పక్కన ఉన్న మల్లిక కావాలని జెస్సిని కూడా పాడమని అంటుంది. ఇక జానకి పాడుతుంటే అనుసరించి పడాలి అనుకున్నది జెస్సి తప్పుగా పాడుతుంది. దీంతో ఆమెకు మన ఇంటి ఆచారాలు పద్ధతులు ఎలా తెలుస్తాయి అని ఇలాంటి అమ్మాయిని అసలు పూజలోకి రానివ్వకూడదు అంటారు. అంతేకాకుండా పూజకు ముందే సిద్ధం చేసి ఉంచాల్సింది అని కూడా అంటారు.

    పూజలో అపశకునం

    పూజలో అపశకునం


    ఇక జెస్సి చేసిన పొరపాట్ల కారణంగా జ్ఞానాంబకు మరింత కోపం వస్తుంది. పూజలో పద్ధతులు తెలియకుండా ఉంటే ఏమాత్రం మంచిది కాదు అని కూడా అంటారు. ఇక జానకి వెంటనే వారిని కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది. పూజ ముగిసే క్రమంలోనే అప్పుడే జాకెట్ ముక్కలకు హారతి తగిలిన మంటలు వస్తాయి. దీంతో వెంటనే జానకి వాటిని ఆర్పేస్తుంది. ఆ విధంగా మంటలు చెలరేగడంతో అమ్మవారికి ఆగ్రహం వచ్చింది అని నీలావతి మాట్లాడుతుంది. ఇక ఆ జాకెట్ ముక్కలను మనం తీసుకుంటే మన కుటుంబాలను కూడా కష్టాల్లో పడేసినట్లే అని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.

    జ్ఞానాంబ ఆవేదన

    జ్ఞానాంబ ఆవేదన

    అయితే పూజ ముగిసిన తర్వాత వాయనం తీసుకోకపోతే పూజ ఫలితం దక్కదు అని జానకి వాళ్ళందరినీ కూడా బ్రతిమాలుతుంది. అమ్మవారు ఒకరి కుటుంబానికి అలా నష్టం చేయాలని అనుకోరు కదా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తోటి మహిళలు ఒప్పుకోరు. తెలిసి తెలిసి మా కుటుంబాలను ఇబ్బందుల్లో పడేసుకోలేము అని మేము బయలుదేరుతాము అని వాయినం తీసుకోకుండానే వెళ్ళిపోతారు. ఇక విధంగా ఎవరు కూడా వాయనం తీసుకోకపోవడంతో జ్ఞానాంబ మరింత బాధపడుతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని వాయనం తీసుకోకుండా ముత్తైదువులు వెళ్ళిపోతే ఎంత అరిష్టం అని అనుకుంటూ ఉంటుంది.

     ధైర్యం చెప్పిన జానకి

    ధైర్యం చెప్పిన జానకి

    దీంతో జానకి మళ్ళీ అత్తగారికి ధైర్యం చెబుతుంది. అలాగే పంతులు గారు కూడా బాధపడవద్దు అని అంటాడు. ఇక జానకి ఇప్పుడు మీరే మాకు ప్రధాన ముత్తైదువు అంటూ మొదటి వయనాన్ని జానకి అత్తగారికి ఇస్తుంది. ఆ తర్వాత మల్లికకు కూడా ఇస్తుంది. ఇక జెస్సి కూడా మొదటిసారి అత్తగారి ఆశీస్సులు తీసుకుంటుంది. ఇక అంతా హ్యాపీగా సాగుతున్న సమయంలో రామచంద్ర తన షాప్ కు వెళుతూ ఉండగా మధ్యలో జానకి కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ కలుస్తారు.

    జానకి కోసం ప్లాన్

    జానకి కోసం ప్లాన్


    మీ జానకిని కలవడానికి వెళుతున్నాను అంటూ మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయేమో కానీ జానకి ఈ మధ్య పరీక్షలు రాయడం లేదు క్లాసులకు కూడా సరిగా రావడం లేదు ఇప్పుడు ఆమెకు చాలా ముఖ్యమైన సమయం అని ప్రిన్సిపల్ అంటారు. ఇక తప్పకుండా జానకి క్లాసులకు రావాలి అని అలాగే ఐపీఎస్ కావాలి అంటే తప్పనిసరిగా ఫిట్నెస్ విషయంలో కూడా శిక్షణ తీసుకోవాలని ప్రిన్సిపల్ చెప్తారు. దీంతో రామచంద్ర జానకి కోసం ప్రత్యేకంగా ఒక ప్లాన్ వేస్తాడు. బయట ఒక మొబైల్ ఫోన్ దొంగతనం చేస్తున్నట్లుగా రామచంద్ర ముసుగులో పరిగెడుతూ ఉంటాడు. ఇక అతన్ని పట్టుకోడానికి జానకి పరిగెడుతుంది. మరి తర్వాత జానకి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడలేదు.

    English summary
    Janaki Kalaganaledu Serial September 28th Episode 398
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X