Janaki Kalaganaledu September 29th Episode: జానకిపై మరో నింద మోపిన మల్లిక.. తప్పించుకోవడం కష్టమే!

ఇటీవల కాలంలో మొదలైన కొన్ని డైలీ సీరియల్స్ లలో జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. మొదట ఈ సీరియల్ కొంత నీరసంగా మొదలైనట్లుగా కామెంట్స్ వచ్చినప్పటికి ఆ తరువాత అసలు కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల ఆదరణ కూడా పెరిగింది. ఎలాగైనా ఐపీఎస్ చదువుకోవలనే కలలు కనే జానకి మొత్తానికి మొదటి అడుగు వేసింది. భర్త సహాయంతో కోచింగ్ తీసుకుంటూ చదువును పూర్తి చేసేందుకు సిద్దమైంది. నేటితరం యువతకు కూడా ఇందులో జానకి, రామ లవ్ స్టొరీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది.

భావోద్వేగమైన సీన్స్ తో జానకి రామచంద్ర ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక జానకి చదువు విషయంలో మల్లికకు అనుమానాలు వస్తాయి. ఆ విషయాన్ని జ్ఞానాంబకు చెప్పాలని అనుకుంటుంది. కానీ ఆమె ప్లాన్స్ డిజాస్టర్ అవుతుంటాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 138వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్ఞానాంబ అనుమానం

జ్ఞానాంబ అనుమానం

ఒక వైపు జ్ఞానాంబ మనవాళ్ళ కోసం ఆరాటపడుతూ కోడళ్ళు వారసులను ఇస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. పక్కింటి చిన్నపిల్లలను కూడా ఇంటికి తెచ్చుకుని ప్రత్యేకంగా ఆడిస్తుంది. ఇప్పటికే జానకి మల్లికలతో కూడా జ్ఞానం హోమాలు వ్రతాలు పూజలు చేయిస్తుంది. జ్ఞానాంబ ఎంత కోరుకున్నా కూడా కోడలు పట్టించుకోవడం లేదని కాస్త అనుమానం వస్తుంది. ఇక ఆ సమయంలోనే మల్లిక ద్వారా ఆమెకు ఊహించని అనుభవం ఏర్పడుతుంది.

ఆ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు?

ఆ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు?

మల్లిక ఎవరికీ తెలియకుండా పిల్లలు పుట్టకుండా ఉండాలని టాబ్లెట్స్ వాడుతుంది. అయితే మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్ తెచ్చుకోవాలని అనుకున్న మల్లిక ఇంటికి రాగానే చేతిలో ఉన్న ఒక టాబ్లెట్ ను చూసుకోకుండా కింద పడేస్తుంది. ఇక ఆ టాబ్లెట్ ప్యాకెట్ ను గోవింద రాజులు చూసి ఎవరిది అని జ్ఞానాంబను అడిగే ప్రయత్నం చేస్తాడు. ఇక ట్యాబ్లెట్ ఎందుకు వాడుతున్నారు అని తెలుసుకోవాలని జ్ఞానాంబ తన చిన్న కొడుకుని పిలిచి అడుగుతుంది. ఈ టాబ్లెట్ ఎందుకు వాడుతారు తెలుసుకోవాలని మెడికల్ షాప్ కి వెళ్ళమని చెబుతుంది.

పిల్లలు పుట్టకుండా ముందులు..

పిల్లలు పుట్టకుండా ముందులు..

ఇక అందుకు సమాధానంగా కొడుకు మెడికల్ షాప్ వరకు ఎందుకు వెళ్ళడం అని మొబైల్ ఇంటర్ నెట్ లోనే సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది అని అంటాడు. ఇక చిన్న కొడుకు చెప్పిన అసలు విషయాన్ని తెలుసుకొని జ్ఞాన ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎవరో ఇంట్లో పిల్లలు పుట్టకుండా టాబ్లెట్స్ వేసుకుంటున్నాను అని అందుకు సంబంధించినవే ఈ టాబ్లెట్స్ అని చిన్న కొడుకు తెలియజేస్తాడు. ఆ విషయం వినగానే ఒక్కసారిగా షాక్ అయిన జ్ఞానాంబ.. కోడళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తోంది.

మరోసారి మల్లిక మాయమాటలు

మరోసారి మల్లిక మాయమాటలు

జ్ఞానాంబ మొదట మల్లిక పైనే అనుమానం వ్యక్తం చేస్తుంది. అయితే అప్పటికే టాబ్లెట్ వారి కంట పడింది అని తెలుసుకున్న మల్లిక ఎంతో ఆందోళనతో ఉంటుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మల్లికను రమ్మని పిలుస్తుంది. ఇక ఈ టాబ్లెట్స్ ఎవరవి అని అడగగానే మల్లిక దొంగ చూపులు చూస్తూ నాకు ఏమీ సంబంధం లేదని అంటుంది. నేను మీకు వారసుడిని ఎప్పుడు ఎప్పుడు ఇవ్వాలి అని ఎదురు చూస్తున్నాను అంటూ కానీ దురదృష్టవశాత్తూ ఆ అదృష్టం నాకు కలగడం లేదని మాయ మాటలు చెబుతుంది.

జానకి పెరిగిన అనుమానం

జానకి పెరిగిన అనుమానం

అయితే జ్ఞానాంబ గోవిందరాజులు ఇద్దరు కూడా ఒకేసారి మల్లికను అడగడంతో సీన్ మారిపోతుంది. అయితే ఇంట్లో నేను ఒక్క దాన్ని మాత్రమే లేను.మ్ పెద్ద కోడలు కూడా ఉందని అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆమె కూడా ఈ టాబ్లెట్స్ వాడే అవకాశం ఉంది కదా అని అనుమానం వ్యక్తం చేయడంతో జ్ఞానాంబ కూడా ఆలోచనలో పడుతుంది. వెంటనే రామచంద్రను అలాగే జానకిని ఇంటికి రమ్మని భర్తకు ఫోన్ చేయిస్తుంది. జ్ఞానాంబ ఫోన్ కాల్ కు రామచంద్ర కూడా కంగారు పడుతూ ఉంటాడు. అసలు ఇంత సడన్ గా ఎందుకు ఇంటికి రమ్మని పిలిచింది అని భార్యతో మాట్లాడుతూ ఉంటాడు.

Recommended Video

Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
మరోసారి జానకిని ఇరికించిన మల్లిక

మరోసారి జానకిని ఇరికించిన మల్లిక

ఇంటికి రాగానే జ్ఞానాంబ చాలా కోపంగా కనిపిస్తూ ఉంటుంది. బహుశా తన చదువు విషయం ఇంట్లో తెలిసిపోయిందేమో అని జానకి కూడా ఎంతో కంగారు పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు రామచంద్ర చినబాబు అసలు నిజాన్ని చెప్పేశాడు అని అనుకుంటాడు. జ్ఞానాంబ తన చేతిలో ఉన్న టాబ్లెట్స్ చూపించి ఇవి నివేనా అని జ్ఞానాంబను అడుగుతుంది.

జానకి నేను వాడాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు అంటూ వినయంగానే సమాధానం చెబుతుంది. ఇక ఆ తర్వాత ఎవరిని అడగలో తెలియక జ్ఞానాంబ ఆలోచిస్తుంది. ఇక వెంటనే టాబ్లెట్ కు సంబంధించిన ఆధారాల కోసం జానకి గదిలో వెతకమని చిన్న కొడుకు చెబుతుంది. అయితే అక్కడ డెస్క్ లో కొన్ని టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. ఆ టాబ్లెట్స్ నిజంగానే జానకి వాడుతుందా లేక మల్లికా ముందుగానే కావాలని ఇరికించిందా అనే విషయం తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X