Janaki Kalaganaledu September 29th: జనకితో రామ రొమాంటిక్ ముద్దులు.. ఏకంగా ఎత్తుకొని మరి..

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు ఎంతో ఆసక్తికరమైన ఎమోషన్స్ తో ముందుకు సాగుతోంది., భార్య జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. అందుకు ఆమె అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 399 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

బాధలో జ్ఞానాంబ

బాధలో జ్ఞానాంబ

ఇంట్లో పూజ జరిపించినప్పుడు కొత్త కోడలు జెస్సి చేసిన పొరపాట్ల కారణంగా జ్ఞానాంబ బాధపడుతుంది. ఆమెకు హిందూ సంప్రదాయాలు పెద్దగా తెలియక పోవడంతో పూజలో చాలావరకు తెలియకుండానే పొరపాట్లు చేస్తుంది. ఆ కారణంగానే హారతి పళ్లెం కు జాకెట్ ముక్కలు అంటుకొని మంటలు చెలరేగేయి అని అదే ఆపశకులంగా భావించి మిగతా ఆడవాళ్ళు ఎవరు కూడా వాయనం తీసుకోలేదు అని జ్ఞానాంబ బాధపడుతూ ఉంటుంది. ఇక అపశకునం ఇంటికి కూడా మంచిది కాదు అని ఆమె అలా బాధపడుతూ ఉండడంతో భర్త గోవిందరాజులు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. జరిగిన విషయాన్ని పట్టించుకోని బాధపడకూడదు అని జరగబోయే వాటి గురించి ఆలోచించాలి అని గోవిందరాజులు చెప్పడంతో అయినప్పటికీ కూడా జ్ఞానాంబ సంతోషంగా ఉండదు.

ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉన్నారు

ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉన్నారు

అంతేకాకుండా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉన్నారు అని చిన్న కొడుకు అఖిల్ చదువుకొని మంచి పేరు ప్రతిష్టలు తెస్తాడు అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్నాము.. అయినప్పటికీ కూడా అతను ప్రేమించి పెళ్లి చేసుకుని మనకు పెళ్లి చేసే భాగ్యం కూడా ఇవ్వలేదు అని అనుకుంటుంది. ఇంట్లో కేవలం రామచంద్ర మాత్రమే కష్టపడుతున్నాడు అని కుటుంబం కోసం అతను తన సంతోషాలను కూడా పట్టించుకోవడం లేదు అని జ్ఞానాంబ ఆవేదన చెందుతుందు. ఇక తర్వాత జానకి ఇంట్లోకి వచ్చి అత్తగారిని భోజనం చేయమని చెబుతుంది అయినప్పటికీ జ్ఞానాంబ తనకు ఆకలిగా లేదు అని అంటుంది.

మల్లిక డ్యాన్స్

మల్లిక డ్యాన్స్

ఇక అత్తగారు అలా బాధపడుతూ ఉండడంతో జానకి కూడా బాధపడుతుంది. మరోవైపు రామచంద్ర కూడా జానకి పరిస్థితిని చూసి తన ఐపీఎస్ చదువుకు ఇంట్లో పరిస్థితులు అడ్డంకిగా మారుతున్నాయని ఎలాగైనా ఆ ఆలోచనల నుంచి జానకిని పక్కదారి పట్టించి చదువుపై ఫోకస్ చేసేలా చేయాలి అని ఆలోచిస్తాడు. ఇక మరొకవైపు మల్లిక మాత్రం జ్ఞానాంబ బాధపడుతూ ఉంటే ఎంతగానో సంతోషిస్తుంది. తన గదిలోకి వెళ్లి డ్యాన్సులు కూడా చేస్తుంది. అయితే కడుపుతో ఉన్నట్లు మల్లికా నాటకం ఆడుతున్న విషయం ఎవరికీ తెలియదు. అయితే ఆమె కడుపుతో ఉంది అనుకొని భర్త విష్ణు డాన్స్ చేస్తూ ఉంటే ఆశ్చర్యపోతాడు. అసలు నువ్వు కదలకూడదు కదా ఎందుకు ఇలా డాన్స్ చేస్తున్నావు అని అడుగుతాడు. అయితే కొన్నిసార్లు ఆనందం వచ్చినప్పుడు ఇలా కూడా చేయాలి అని మళ్ళీ అబద్ధాలు చెబుతుంది. అంతే కాకుండా కాళ్లు నొప్పులు పుడుతున్నాయి అని భర్త చేత కాళ్ళు పట్టించుకుంటుంది.

మరోసారి ఆలోచిస్తూ

మరోసారి ఆలోచిస్తూ


ఇక తర్వాత జానకి తన గదిలోకి వెళ్లి ఇంట్లో పరిస్థితుల గురించి మరోసారి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా సమస్యలను తొందరగా తొలగిపోవాలి అని కూడా అనుకుంటుంది. అయితే రామచంద్ర మళ్లీ జానకిని ఆ బాధలో నుంచి బయటకు తీసుకురావాలని అనుకుంటాడు. మీరు వీలైనంత తొందరగా మీ చదువుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని మీ ప్రిన్సిపాల్ గారు కూడా నన్ను కలిశారు అని అలాగే ఫిట్నెస్ విషయంలో కూడా మీరు కొంత మారాల్సి ఉంటుంది అని కూడా రామచంద్ర చెబుతాడు. ఇక అలా చెప్పడంతో జానకి కూడా సరే అని అంటుంది.

 ముద్దులు పెట్టిన జానకి

ముద్దులు పెట్టిన జానకి

అయితే మీరు ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకోవడానికి కొన్నాళ్లు నాకు దూరంగా ఉండాలి కదా అప్పటివరకు నాకు ఏదైనా గుర్తుండి పోయాలా శక్తి ఇవ్వాల్సి ఉంటుంది అని అంటాడు. అందుకు జానకి కూడా సిగ్గుపడుతూ రామచంద్ర కు ముద్దు పెడుతుంది. ఇంకా మరింత శక్తి కావాలా అని అడుగుతూ మరొక ముద్దు కూడా ఇస్తుంది. ఇక అందుకు రామచంద్ర సిగ్గు పడిపోతూ ఉంటాడు.

జానకి ఎన్తుకున్న రామ

జానకి ఎన్తుకున్న రామ

ఆ తర్వాత ఉదయం నుంచే మీరు వాకింగ్ చేయాలి అని రామచంద్ర చెబుతాడు. ఇక కొద్దిసేపు పరిగెత్తిన తర్వాత జానకి ఇంట్లో ఆలోచనలే గుర్తు చేసుకుంటూ అలసిపోతుంది. ఇక జానకిని అలర్ట్ చేసేందుకు రామచంద్ర ఒక ప్లాన్ వేస్తాడు. ముసుగులో ఒక వ్యక్తి ఫోన్ లాక్కొని వెళ్లిపోతాడు. ఇక అది చూసిన జానకి అతను దొంగ అనుకొని పరిగెడుతుంది. ఇక తీరా చూసేసరికి రామచంద్ర అని తెలిసాక ఆశ్చర్య పోతుంది. మీకోసమే ఇలా చేశాను అని మీ కర్తవ్యం మీకు గుర్తు రావాలి అని అంటాడు. అంతే కాకుండా జానకి కాలు నొప్పిగా ఉండడంతో ఆమెను ఎత్తుకొని తీసుకువెళ్తాడు. ఇక ఈ పరిస్థితుల తర్వాత జానకి ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X