For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu September 2nd Episode: మరోసారి బోల్తా కొట్టిన మల్లిక ప్లాన్.. జానకి స్వీట్ వార్నింగ్

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మతింత ఉత్కంఠను కలిగిస్తోంది. అలాగే మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రాశి జ్ఞానాంబ పాత్రలో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. రొటీన్ గా అత్త కోడళ్ల గొడవలు కాకుండా క్యూట్ రొమాంటిక్ సీన్స్ కూడా హైలెట్ అవుతున్నాయి. జానకి, రామచంద్ర పాత్రలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

  అయితే మొదట్లో ఈ సీరియల్ అంచనాలను అందుకోలేకపోయింది అని కామెంట్స్ వచ్చినప్పటికీ ఆ తరువాత చాలా వేగంగా మళ్ళీ పాజిటివ్ కామెంట్స్ అందుకునే స్థాయికి వచ్చింది. ఇక మెల్లగా రేటింగ్స్ కూడా పెరుగుతున్నాయి. విభిన్నమైన ఎమోషన్స్ తో అత్త జ్ఞానాంబ పాత్రలో నటిస్తున్న రాశి సిరియల్ పై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని పరిస్థితులను క్రియేట్ చేస్తోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 119వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  జానకి గదిలో ఒక రహస్యం

  జానకి గదిలో ఒక రహస్యం

  రామ, జానకి పడుకునే గదిలో పుస్తకాలు కనిపించడంతో మల్లిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. 5వ తరగతి చదివిన జానకి గదిలో పెద్ద పెద్ద పుస్తకాలు ఎందుకు ఉన్నాయో అని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక పెద్ద రహస్యమేమీ ఉందని ఆ విషయాన్ని ఎలాగైనా అత్తతో చెప్పాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి జానకిని ఇంటి నుంచి బయటకు పంపించాలని కూడా మల్లిక పన్నాగం పన్నుతుంది. ఇక వెంటనే పరుగుపరుగున అత్త రూమ్ లోకి వెళ్ళిన మల్లిక అసలు విషయాన్ని చెబుతుంది.

  మల్లిక బ్యాడ్ లక్

  మల్లిక బ్యాడ్ లక్

  మీకు తెలియకుండా ఇక్కడ పెద్ద మోసం జరుగుతోందని, జానకి గదిలో మీరు ఎప్పుడు చూడని ఒక వింత సన్నివేశం కూడా ఇప్పుడు కనిపిస్తుందని మల్లిక జ్ఞానాంబతో అంటుంది. అందుకు కాస్త అసహనం వ్యక్తం చేసిన జ్ఞానాంబ మల్లిక తీరుపై కోపగించుకుంటింది. అయినప్పటికి ఏమాత్రం తగ్గకుండా వెంటనే జానకి గది లోకి రావాలని ఉంటుంది. జానకి గదిలోకి వెళ్ళి చూసిన జ్ఞానాంభఆమె భర్త గోవిందరాజులు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు తీసుకు వచ్చిందో అని ఆలోచిస్తూ ఉండగా అక్కడ ఏమీ కనిపించదు. ఇక అక్కడ పుస్తకాలు లేకపోవడంతో మల్లిక ఒక్కసారిగా షాక్ అవుతుంది.

  మాట మార్చిన మల్లిక

  మాట మార్చిన మల్లిక

  ఇందాక చూసిన టేబుల్, లైట్, పుస్తకాలు ఇప్పుడు కనిపించడం లేదని ఆశ్చర్యపోతూ అని షాక్ అవుతుంది. ఇక మళ్ళీ అత్త చేతిలో తిట్లు ఖాయం అని ఎదో ఒకటి చెప్పి కవర్ చేయాలని అనుకుంటుంది. రేపు పూజ ఉంది కదా ఇంట్లో బట్టలు, కటన్స్ ఏమి ఉతకలేదు అని మల్లిక జానకిపై చాడీలు చెబుతుంది. దీంతో జ్ఞానాంబ అసహనం వ్యక్తం చేస్తూ మరోసారి ఇలాంటి చాడీలు చెప్పాలని చూస్తే బావుండదు అని హెచ్చరిస్తుంది.

  ముద్దు ఇవ్వాలని..

  ముద్దు ఇవ్వాలని..

  ఇక జానకి కూడా పుస్తకాలు ఒక లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంతుంది. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత రామచంద్రను పుస్తకాలు పెట్టారు అని అడుగుతుంది. ఇక రామచంద్ర తెలివిగా దుప్పట్ల కిందనే పుస్తకాలు ఉంచడంతో ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు మొదలవుతాయి. ముద్దు ఇవ్వాలని రామచంద్ర అడుగుతాడు. అందుకు జానకి సిగ్గుపడుతూనే తన భర్తకు ముద్దు పెడుతుంది.

  జానకి స్వీట్ వార్నింగ్

  జానకి స్వీట్ వార్నింగ్

  ఇక ఉదయాన్నే తొందరగా లేచి నా జ్ఞానంభ ముగ్గు వేస్తుంది. నేను వేస్తాను కదా అని జానకి అడిగినప్పటికీ పరవాలేదు అని చెబుతోంది. అయితే ఇంట్లో అందరు కూడా తొందరగా రెడీ అవ్వాలి అని మన తోట లోకి వెళ్లి ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజ చేయాలి అని జ్ఞానాంబ ఆదేశాలు జరిచేస్తుంది.

  ఇక ఆ విషయాన్ని జానకి ఇంట్లో వాళ్ళకు చెప్పాలని అనుకుంటుంది. ఇక మల్లికకు జుట్టు వేయడానికి వెళ్లిన జానకి ఆమెకు కొన్ని నీతులు కూడా చెబుతుంది. మనసు ఆలోచనలు బావుంటే అందరం సంతోషంగా ఉంటామని అనవసరమైన విషయాలలో తలదూర్చి ఇబ్బంది పడవద్దని కూడా స్వీట్ వార్నింగ్ ఇస్తుంది.

  పూజ కోసం ప్రత్యేకంగా..

  పూజ కోసం ప్రత్యేకంగా..

  ఇక అందుకు మల్లిక మరోసారి జానకి పై పగ పడుతుంది. పైకి నవ్వుతూనే సమాధానం ఇస్తూ తప్పకుండా మరోసారి పగ తీర్చుకుంటానని అంటుంది. ఇక గోవిందరాజులు ప్రత్యేకంగా తోటకు వెళ్లడానికి ట్రాక్టర్ ను తీసుకొని వస్తాడు. ఈరోజు వరలక్ష్మి పూజ కోసం మనం అందరం ఈ ట్రాక్టర్ లోనే వెళ్లాలని అంటాడు. ఇక అందరూ రావడంతో ట్రాక్టర్ ఎక్కుతారు. అయితే అందరూ ఇంటి నుంచి బయటకు వచ్చినప్పటికీ మల్లిక మాత్రం బయటకు రాదు. గత ఏడాది తరహాలోనే మల్లిక ఈసారి ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటుంది అని జ్ఞానాంబ విష్ణుతో అంటుంది.

  Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
  అవకాశం కోసం ఎదురుచూస్తున్న మల్లిక

  అవకాశం కోసం ఎదురుచూస్తున్న మల్లిక

  ఇక విష్ణు కాస్త కోపంతో మల్లికను ఇంట్లో మంచి ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంత పిలిచినా కూడా మల్లిక ఇంట్లో నుంచి తొందరగా బయటకు రాదు. ఇక చివరికి అందరూ డాక్టర్ ఎక్కేసి పొలంకు వెళతారు. పూజ దగ్గర జానకి తన అత్త జ్ఞానాంబ పాదాలకు పసుపు పెడుతుంది. జానకి పనితనాన్ని చూసిన జ్ఞానంబ మరోసారి తన ప్రేమను పెంచుకుంటుంది.

  సొంత కూతురిలా భావిస్తుంది. వారి ప్రేమను చూసిన మల్లికా మరోసారి కుల్లుకుంటుంది. ఎలాగైనా వారి మధ్యలో మరొక చిచ్చు పెట్టాలని అనుకుంటుంది. ఎన్ని ప్రణాళికలు రచించిన కూడా ఫలించకపోవడంతో సరైన అవకాశం కోసం ఎదురు చూడాలని అనుకుంటుంది. మరి మల్లిక ఆలోచనలతో జానకి ఇంకా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 119
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X