Janaki Kalaganaledu September 30th Episode: జానకి కోసం తవ్విన గొయ్యిలో మల్లిక.. మరో లక్కీ ఛాన్స్!

స్టార్ మా డైలీ సీరియల్స్ లలో జానకి కలగనలేదు రోజురోజుకు అభిమానుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ ఉంది. మొదట్లో కాస్త బోరింగ్ గా ఉందని కామెంట్స్ వచ్చినప్పటికీ ఆ తరువాత అసలు కథ మోదలవ్వడంతో ఈ షో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక సీనియర్ నటి రాశి జ్ఞానాంబ పాత్రలో చాలా పవర్ఫుల్ గా కనిపిస్తోంది. దీంతో జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఐపీఎస్ చదువుకోవలనే కలలు కనే జానకి మొత్తానికి మొదటి అడుగు వేసింది. భర్త సహాయంతో కోచింగ్ తీసుకుంటూ చదువును పూర్తి చేసేందుకు సిద్దమైంది.

నేటితరం యువతకు కూడా ఇందులో జానకి, రామ లవ్ స్టొరీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. భావోద్వేగమైన సీన్స్ తో జానకి రామచంద్ర ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక జానకి చదువు విషయంలో మల్లికకు అనుమానాలు వస్తాయి. ఆ విషయాన్ని జ్ఞానాంబకు చెప్పాలని అనుకుంటుంది. కానీ ఆమె ప్లాన్స్ డిజాస్టర్ అవుతుంటాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 139వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లు..

తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లు..

వారసుడు కావాలని జ్ఞానాంబ చాలాకాలంగా చిన్న కోడలిపై నమ్మకం పెట్టుకుంటుంది. అయితే ఆమె అత్త మీద కోపం తో పిల్లలు పుట్టకుండా ఉండాలని మందులు వాడుతూ ఉంటుంది. అంతేకాకుండా అబద్ధాలు ఆడుతూ భర్తతో ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అలాగే ప్రత్యేకంగా కాపురం పెట్టాలని అనుకుంటుంది. కానీ ఆమె ఎన్ని ప్రణాళికలలు రచించినా కూడా ఏవి అంతగా సక్సెస్ అవ్వవు. ఇక మల్లిక చివరికి తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లు అయ్యింది. ఆమె ప్లాన్స్ మొత్తం ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి.

జానకి కల కోసం అబద్ద..

జానకి కల కోసం అబద్ద..

జ్ఞానాంబ మనవడు మనవరాలుతో ఆడుకోవాలని ఎన్నో కలలు కంటుంది. చిన్న కోడలి త్వరగా పిల్లలు పడలేదని పెద్ద కోడలు అయినా తొందరగా పిల్లలను కాంగుండెమోనని జ్ఞానాంబ ఆశపడుతుంది. ఒక విధంగా జానకి పై జ్ఞానాంబ ఎంతో నమ్మకంతో ఉంటుంది. కానీ జానకి చదువు విషయం గురించి ఆలోచించి నిజం దాచి పెడుతుంది. ఎలాగైనా నిజం చెప్పాలని అనుకున్నప్పటికీ భర్త రామచంద్ర వద్దని చెప్పడంతో జానకి వెనకడుగు వేస్తుంది. ఇక ఎలాగైనా ఐపిఎస్ చదువులు పూర్తి చేసి రెండేళ్ళ తర్వాత తల్లి కోరికను తీర్చాలని రామచంద్ర చెబుతాడు.

మల్లిక చేసిన తప్పుకి..

మల్లిక చేసిన తప్పుకి..

అయితే మల్లిక చేసిన ఒక పొరపాటు వలన జానకి ఇరకాటంలో పడుతుంది. జ్ఞానాంబ కూడా జానకిని ఎంతగానో అనుమానిస్తుంది. పిల్లలు పుట్టకుండా ఉండాలని మల్లిక మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్స్ తెచ్చుకుంటుంది. అయితే పొరపాటును అందులో ఒక ప్యాకెట్ ఇంట్లోనే కింద పడిపోవడంతో చూసుకోదు. ఇక ఆ టాబ్లెట్ ప్యాకెట్ జ్ఞానాంబ దృష్టికి రావడంతో అసలు నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది. పిల్లలు పుట్టకుండా ఎవరో ఈ టాబ్లెట్స్ వాడుతున్నారు అని ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది.

రెండు గదులలో.. చెకప్

రెండు గదులలో.. చెకప్

జ్ఞానాంబ.. మల్లిక పై మొదట అనుమానం వ్యక్తం చేయడంతో తాను మాత్రమే ఇంట్లో ఉన్నానా? అంటూ పెద్ద కోడలు కూడా ఉంది అంటూ ఆమె కూడా ఈ టాబ్లెట్స్ వాడే అవకాశం ఉందని మరో అనుమానం కలుగజేస్తుంది. అంతే కాకుండా తన అతితెలివితో కొన్ని టాబ్లెట్స్ జానకి గదిలో తెలియకుండా ఉంచుతుంది. ఇక ఆ తర్వాత రెండు గదులలో చెక్ చేయమని చెప్పిన మల్లిక తప్పు ఉంటే ఏ శిక్ష భరించడానికి అయినా తాను సిద్ధమేనని చెబుతుంది ఇక మల్లికా చెప్పినట్లుగానే జ్ఞానాంబ రెండు గదులను చెక్ చేయిస్తుంది.

జానకి ఒట్టు వేసింది అంటే..

జానకి ఒట్టు వేసింది అంటే..

ముందుగానే మల్లికా జానకి గదిలో టాబ్లెట్స్ వేయడం వలన జ్ఞానాంబ జానకి పై అనుమానం వ్యక్తం చేస్తుంది. అబద్ధం ఎలా చెప్పాలనిపించింది అని ఒక్కసారిగా తీవ్ర మనోవేదనకు గురి అవుతుంది. జానకి మాత్రం అమ్మతో సమానమైన మీ మీద ఒట్టు వేస్తున్నాను.. నేను అబద్ధం చెప్పడం లేదు అంటూ కంటతడి పెట్టుకుంది. ఇంకా అబద్ధాన్ని చెప్పాలని చూస్తావా అంటూ జ్ఞానాంబ జానకిని కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక అప్పుడే రామచంద్ర తల్లికి అడ్డుపడతాడు. జానకి నీ మీద ఒట్టు వేసి చెప్పింది అంటే అందులో తప్పకుండా నిజం ఉండే ఉంటుంది అని తల్లికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు.

Recommended Video

Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
మల్లికకు మరొక ట్విస్ట్..

మల్లికకు మరొక ట్విస్ట్..

ఇక జ్ఞానాంబ ఎవరితో మాట్లాడకుండా వెళ్లి పచ్చిమిర్చిలు దంచుతూ ఉంటుంది. ఆమె చాలా కోపంగా ఉన్నట్లు అందరికీ అర్థమవుతుంది. అయితే ఇంతలో మెడికల్ షాప్ నుంచి గోవిందరాజులు టాబ్లెట్స్ ఇవ్వడానికి ఒక వ్యక్తి వస్తాడు. అయితే అదే సమయంలో అతను మల్లికను చూసి.. మీరు ఇంతకుముందు షాప్ కు వచ్చినప్పుడు ఆ టాబ్లెట్స్ తీసుకున్నారు కదా అలాగే చిల్లర తీసుకోలేదు అంటూ ఆమెకు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు.

నిజం తెలుసుకున్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. జ్ఞానాంబ కూడా మల్లికా కోరుకున్నట్లుగానే ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాలని అనుమతిస్తుంది. ఒక విధంగా అందుకు మల్లిక ఎంతగానో సంతోషిస్తుంది. మరి ఈ విషయంపై జానకి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X