For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu September 30th: జెస్సిపై ఫోకస్ పెట్టిన మల్లిక.. జానకి హెచ్చరికతో వెనుకడుగు!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మంచి రేటింగ్స్ తో టాప్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతోంది. జానకి తన భర్త సహాయంతో ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక జనకికి ఇంట్లోనే కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. మరి వాటిని దాటి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోనే ప్రధాన అంశం. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 400 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  చదువుపై దృష్టి

  చదువుపై దృష్టి

  జానకి ఇంట్లో కొన్ని పరిస్థితుల కారణంగా తన చదువుకు దూరం అవుతుంది. గతంలో ఒక పరీక్ష కూడా రాయకుండా ఉంటుంది. అయితే అదే విషయాన్ని జానకి చదువుతున్న కాలేజీ ప్రిన్సిపల్ రామచంద్ర తో చెబుతోంది. మీ ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు కానీ జానకి చదువుకు మాత్రం ఏదో సమస్య ఉన్నట్లుగా అర్థమవుతోంది. అయితే ఆమె చదువుకు భంగం కలగకుండా ఉండాలి. జానకి ఈ మధ్యకాలంలో అసలు చదువుపై దృష్టి పెట్టడం లేదు. ఆమె చాలా మంచి అమ్మాయి. చాలా బాగా చదువుతుంది. తన అనుకున్న లక్ష్యాన్ని చేదించాలి అంటే ఆమెకు ఎలాంటి సమస్య ఎదురవకూడదు అని మా ప్రిన్సిపల్ రామచంద్ర తో చెబుతుంది. దీంతో రామచంద్ర కూడా జానకినీ మళ్లీ ఎలాగైనా చదువుపై దృష్టి పడేలా చేయాలని అనుకుంటాడు.

  జానకి కోసం రామ ప్లాన్

  జానకి కోసం రామ ప్లాన్

  అంతేకాకుండా జానకి ఐపీఎస్ కావాలి అంటే ఫిట్నెస్ విషయంలో కూడా ముందుగానే సిద్ధమవుతూ ఉండాలి. అయితే ఈ క్రమంలో జానకిని పరిగెత్తించడానికి రామచంద్ర ఒక ప్లాన్ వేస్తాడు. ఒక వ్యక్తి దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని పరిగెడతాడు. ఇక అతను దొంగ దొంగ అని అరుస్తూ ఉండగా జానకి అతని వెంట పడుతుంది. ఇక తర్వాత రామచంద్రాన్ని పట్టుకున్న తర్వాత జానకి ఆశ్చర్యపోతుంది. దీంతో రామచంద్ర మీరు ఫిట్నెస్ లో చాలా పటిష్టంగా ఉండాలి కాబట్టి ఈ విధంగా చేశాను అని మీరు ముందు ఐపిఎస్ కోచింగ్ కు సిద్ధం అవ్వాలి అని ఏ టెన్షన్ కూడా పెట్టుకోకూడదు అని రామచంద్ర అంటాడు. ఇక జానకి కూడా అందుకు సంతోషిస్తుంది.

  ఇంట్లో పనులతో బిజీగా జానకి

  ఇంట్లో పనులతో బిజీగా జానకి


  ఇక తర్వాత మళ్ళీ జానకి ఎప్పటిలనే ఇంట్లో పనులన్నీ కూడా చేస్తుంది. అందరికీ భోజనాలు కూడా సిద్ధం చేస్తుంది. ఇక ఆమె పనిచేయడం చూసిన రామచంద్ర మీకు చదువుకోమని చెప్పాను కదా మళ్లీ ఎందుకు ఈ పనులు చేస్తున్నారు అని అంటాడు. పరవాలేదు రామా గారు తర్వాత చదువుకుంటాను అని చెబుతుంది. ఇక జ్ఞానాంబ కూడా జానకితో అదే ఉంటుంది. జెస్సి పక్కనే ఉండడంతో ఇంట్లో ఇంకా పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు నువ్వు చేస్తున్నావు అని అడుగుతుంది. అందుకు జానకి వెన్నెల కాలేజ్ కి వెళ్ళింది అని పనిమనిషి చికిత్త జ్వరంతో ఉండడంతో నేనే రెస్ట్ తీసుకోమని చెప్పాను అని అంటుంది. అందుకు జ్ఞానాంబ.. జెస్సి కూడా చేయవచ్చు అనే విధంగా చెప్పి చెప్పనట్లుగా మాట్లాడుతుంది.

  జానకి వార్నింగ్

  జానకి వార్నింగ్

  ఇక తర్వాత మల్లికా, జానకి జెస్సీ విషయంలో మరొక విధంగా ఆలోచిస్తుంది. పెద్ద కోడలు చిన్న కోడలు ఒకటి అయితే మధ్యలో ఉన్న నా పరిస్థితి చాలా కష్టమవుతుంది అని వాళ్ళిద్దరూ ఎంత మాత్రం కలవకూడదు అని ఏదైనా గొడవ సృష్టించాలి అని అనుకుంటుంది. ఇక మల్లిక జెస్సి దగ్గరికి వెళ్లి జానకి పై లేనిపోని అబద్ధాలు చెబుతుంది. ఆమెను నమ్ముకుంటే నువ్వు ఇంట్లో ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేవు అత్తయ్య గారికి నువ్వు దగ్గరవ్వాలి అంటే నేను చెప్పినట్లు చేయాలి అని వివిధ రకాలుగా చెబుతుంది. దీంతో జానకి అప్పుడే సీన్లోకి ఎంట్రీ ఇచ్చి మల్లికపై సీరియస్ అవుతుంది. ఉన్న సమస్యలను పట్టించుకోవడమే కాకుండా మళ్లీ దాన్ని పెద్దది చేయాలని అనుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని ఈ విషయంలో నేను మరోసారి సీరియస్ కాకముందే నువ్వే కంట్రోల్ లో ఉంటే మంచిది అని వార్నింగ్ ఇస్తుంది. అందుకు మల్లిక ఏమీ అనకుండా సైలెంట్ గా తన మనసులోని మరోసారి ఏదైనా ప్లాన్ వేయాలని ఆలోచిస్తుంది.

   అఖిల్ మరో ప్లాన్

  అఖిల్ మరో ప్లాన్

  మరోవైపు రామచంద్ర తమ్ముడు అఖిల్ ఇంట్లో ఎవరు మాట్లాడకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. మునుపటి తరహాలోనే అందరూ తనతో ప్రేమతో మాట్లాడలేదంటే ఏదో ఒకటి చేయాలి అని ముందుగా తన అమాయకపు అన్నయ్య రామచంద్రను నమ్మించాలి అని అనుకుంటాడు. ఇంట్లో తనతో ఎవరూ మాట్లాడలేదు అని నరకంగా ఉంది అంటూ అఖిల్ మాట్లాడుతూ ఉంటాడు.
  ఇక రామచంద్ర ఆ విధంగా బాధపడొద్దు అని ధైర్యం చెబుతాడు. అలాగే మరోవైపు జానకి కూడా అతనికి భరోసా ఇస్తుంది.

  వాడు చిన్నపిల్లాడు కాదు

  వాడు చిన్నపిల్లాడు కాదు

  కానీ ఇంతలో అక్కడికి వచ్చిన తల్లి జ్ఞానాంబ వాడు ఇప్పుడు చిన్నపిల్లాడు కాదు మీరు ఆ విధంగా చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది. వాడు పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు అని అనవసరంగా మీ సమయం వృధా చేసుకోవద్దు అని రామచంద్రను షాప్ కు వెళ్లమని చెబుతుంది. ఇక జానకిని చదువుకోమని అంటుంది. దీంతో అఖిల్ తల్లి దగ్గర తన పప్పులు ఉడకవని మరొక విధంగా ఆలోచించాలని అనుకుంటాడు. ఇక రామచంద్ర షాప్ కు వెళ్లిన తర్వాత జానకి చదువుకుంటుందో లేదో అనే టెన్షన్లో ఉంటాడు. కానీ జానకి మాత్రం చదువుపై దృష్టి పెడుతుంది. మరి జానకి వచ్చే పరీక్షల్లో ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial September 30th Episode 340
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X