Janaki Kalaganaledu September 3rd Episode: మల్లిక నాటకాలకు చెక్.. ప్రేమతో కొట్టిన జ్ఞానాంబ

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఐపీఎస్ అవ్వాలని అనుకునే కోడలు తన అత్తకు తెలియకుండా ఎలా చదువును పూర్తి చేసింది అనేది ఈ కథలోని అసలు పాయింట్. ఇక మరోవైపు అబద్దాలు అంటేనే గిట్టని అత్తకు ఆ నిజం తెలిస్తే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని అందరూ కంగారు పడుతుంటారు. ఇక కొడుకు కూడా కోడలికి మద్దతుగా ఉండడం మరొక ట్విస్ట్. ఈ కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రాశి చేస్తున్న జ్ఞానాంబ పాత్ర కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతొంది.

రొటీన్ గా అత్త కోడళ్ల గొడవలు కాకుండా క్యూట్ రొమాంటిక్ సీన్స్ కూడా హైలెట్ అవుతున్నాయి. జానకి, రామచంద్ర అందమైన ప్రేమ సన్నివేశాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సీరియల్ కు మెల్లగా రేటింగ్స్ కూడా పెరుగుతున్నాయి. విభిన్నమైన ఎమోషన్స్ తో అత్త జ్ఞానాంబ పాత్రలో నటిస్తున్న రాశి సిరియల్ పై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని పరిస్థితులను క్రియేట్ చేస్తోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 120వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

ముందే పసిగట్టిన జ్ఞానాంబ

ముందే పసిగట్టిన జ్ఞానాంబ

తోటలో వరలక్ష్మీ పూజకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత కుటుంబసభ్యులంతా అక్కడికి వెళ్లడానికి సిద్ధం అవుతారు. జానకి కూడా అత్త చెప్పడంతో అందరిని రెడీ అవ్వాలి అని చెబుతుంది. అయితే మరోవైపు మల్లిక ఎప్పటిలానే ఏదో ఒక కారణం చెప్పి ఈ పూజకు వెళ్ళకూడదు అని ప్లాన్ వేస్తుంది. ఎంత పిలిచినా కూడా బయటకు రాకపోవడంతో ఆమె భర్త విష్ణు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇక జ్ఞానంబ కూడా మల్లిక ఆలోచనలను ముందే పసిగడుతుంది. గత ఏడాది కూడా ఏదో ఒక కారణం చెప్పి ఇలానే తప్పించుకుంది అని అంటుంది.

మల్లిక నాటకాలకు చెక్

మల్లిక నాటకాలకు చెక్

జ్ఞానంబ అలా అనడంతో విష్ణు కూడా మల్లికను కోపంగా బయటనుంచి పిలుస్తూ ఉంటాడు. ఎంత పిలిచినా కూడా ఆమె రాదని మరోవైపు జ్ఞానంబ అసహనం వ్యక్తం చేస్తుంది. ఈసారి తప్పకుండా ఆమె కడుపు నొప్పి అని చెప్పి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుందని చెబుతుంది. ఆ విషయం అందరికీ చెప్పగానే నిజంగానే మల్లిక కడుపు నొప్పి అంటూ బయటకు వస్తుంది. నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నాను అని అనగానే అందరూ నవ్వుతారు. ఇక చేసేదేమీలేక తల్లి ఆదేశాలతో విష్ణు ఆమెను ట్రాక్టర్ ఎక్కిస్తాడు.

గోవిందరాజు మతిమరుపు

గోవిందరాజు మతిమరుపు

అందరూ కలిసి ఎంతో సంతోషంగా పొలంకు వెళ్లి అక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే అక్కడ ఊహించని విధంగా గోవిందరాజులు పూజారిని పిలవడం మర్చిపోతాడు. అందుకు జ్ఞానంబ కాస్త కోపగించుకుని ఉంటుంది. ఇక ఇంతలో రామచంద్ర ముందుగానే పూజారిని తాను పిలిచారని కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని కూడా అంటాడు. కొడుకు చేసిన పనిని తన ఖాతాలో వేసుకోవడానికి గోవిందరాజు ట్రై చేస్తూ ఉంటాడు. జ్ఞానంబ కూడా భర్తపై కాస్త కోపగించు కుంటుంది.

పెద్దకోడలు అతి ప్రేమ..

పెద్దకోడలు అతి ప్రేమ..

పూజ మొదలైన తర్వాత అందరూ కూడా కాళ్ళకు పసుపు రాసుకోవాలి అని అనుకుంటారు. అయితే కోడళ్లకు పసుపు రాసేందుకు జ్ఞానంబ ముందుకు వస్తుంది. కానీ జానకి మాత్రం అందుకు ఇష్టపడదు. మీరు నా కాళ్ళకు పసుపు రాయడం ఏమిటని నేనే మీ కాళ్ళకు పసుపు రాస్తాను అని జానకి చెబుతోంది. అందుకు జ్ఞానంబ సంతోషిస్తుంది. ఒక కూతిరిలా ప్రేమను చూపిస్తుంది. అయితే మరోవైపు మల్లిక మాత్రం కాస్త అసహనం వ్యక్తం చేస్తుంది. ప్రతి ఏడాది కూడా జ్ఞానంబ నా కళ్ళకు పసుపు పెడుతుంది.కానీ ఈ సారి పెద్దకోడలు అతి ప్రేమ వలన ఆ చాన్స్ మిస్ అవుతుందని అసూయ వ్యక్తం చేస్తుంది.

ప్రేమతో కొట్టిన జ్ఞానాంబ

ప్రేమతో కొట్టిన జ్ఞానాంబ

అయినప్పటికీ పర్వాలేదని ఈసారి పెద్ద కోడలితో పసుపు అంటే బాగుంటుంది అని అనుకుంటుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ మనసు మార్చుకున్న మల్లిక నా కాళ్ళకు అత్త పసుపు రాస్తే బాగుంటుంది అని చెబుతోంది. దీంతో జ్ఞానంబ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే. అలాంటిది నాకు సిగ్గు ఎందుకు అని జ్ఞానంబ ప్రేమతో కొడుతోంది. అందుకు మల్లిక కాస్త ఆలోచనలో పడుతుంది. అత్తకు తనపై కూడా ప్రేమ ఉందని అనుకున్నప్పటికీ మళ్ళీ మారిపోతుంది.

Recommended Video

Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
ఆ నిజం ఎప్పుడు బయటపడుతుందో..

ఆ నిజం ఎప్పుడు బయటపడుతుందో..

ఇక పూజ జరిగిన అనంతరం తోటి మహిళలకు చీరలు ఇవ్వాలి అని.. జ్ఞానంబ కోడళ్ళ చేతులమీదుగా తోటి మహిళలకు చీరలు అందిస్తుంది. పూజ అయిపోయిందా అనంతరం అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆటపాటలతో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఏడాది కూడా పొలం దగ్గర పూజ చేశాక ఇలాగే సంబరాలు చేసుకుంటామని జానకితో గోవిందరాజులు చెబుతాడు.

అలాగే పొలాలు కూడా చూపిస్తూ జానకి తో ఆమె భర్త సరదాగా గడుపుతుంటాడు. ఒక్కొక్కరూ ఒక్కో పాటకు డాన్స్ చేస్తూ ఉంటారు అయితే మల్లిక ఎప్పుడు ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తుందో తెలియదు కాబట్టి మరోసారి జానకిపై ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో చూడాలి. ఇప్పటికే జానకి చదువుకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తుంది. గతంలో న్యూస్ పేపర్ లో వచ్చిన జానకి ఫోటోపై కూడా గుట్టు లాగేందుకు మరోసారి ప్రయత్నం చేస్తుంది. మరి జానకి చదువు విషయం ఎప్పుడు బయట పడుతుందో తెలియాలి అంటే మరికొన్ని ఎపిసోడ్స్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X