For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu September 6th Episode: అమ్మ మాటకే ఎదురు చెబుతావా.. జానకిపై రామ ఆగ్రహం

  |

  జానకి కలగనలేదు సీరియల్ వంద ఎపిసోడ్స్ అనంతరం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఐపీఎస్ అవ్వాలని జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా వేసే అడుగులకు భర్త రామచంద్ర కూడా తోడుగా వస్తున్నాడు. అబద్దాలు అంటేనే గిట్టని జ్ఞానాంబ ముందు జానకి పెద్ద సవాళ్ళను ఎదుర్కొంటుంది. మరోవైపు మల్లిక పాము లాంటి పగతో అంతకంతకూ రెచ్చిపోతూనే ఉంటుంది. ఈ క్రమంలో జానకి నుంచి ఎలాంటి అబద్ధం బయటపడినా కూడా అందరూ షాక్ అయ్యేలా నిర్ణయం తీసుకోవడం ఖాయం. ఇక జ్ఞానాంబ కోడలి మీద నమ్మకంతో అంతకంతకు తన నమ్మకాన్ని పెంచుకుంటుంది.

  ఆ విషయంలో జానకి మనసులో నిత్యం ఆందోళన కొనసాగుతుంది. అయితే కోడలు తన అత్తకు తెలియకుండా ఎలా చదువును పూర్తి చేసింది అనేది ఈ కథలోని అసలు పాయింట్. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రాశి చేస్తున్న జ్ఞానాంబ పాత్ర కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతొంది. రొటీన్ గా అత్త కోడళ్ల గొడవలు కాకుండా క్యూట్ రొమాంటిక్ సీన్స్ కూడా హైలెట్ అవుతున్నాయి. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని పరిస్థితులను క్రియేట్ చేస్తోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 121వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  మల్లిక మాయాజాలం

  మల్లిక మాయాజాలం

  జ్ఞానాంబను ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలని చిన్న కోడలు మల్లిక చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఓవైపు పెద్ద కోడలిపై అత్త మరింత ప్రేమను చూపించడంతో మల్లికకు పట్టలేని కోపం వస్తుందిm అయినప్పటికీ జ్ఞానాంబ ఇద్దరినీ సమానంగా చూడాలని అనుకుంటుంది. మల్లిక చేసే తప్పులను కూడా ఎప్పటికప్పుడు క్షమిస్తు మద్దతుగా నిలుస్తూ ఉంటుంది. కానీ భర్త మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. ఎలా పగ తీర్చుకోవాలా అని అనుకుంటుంది. ఇక అందరూ కలిసి పొలం దగ్గర వరలక్ష్మి వ్రతం పూజకు హాజరవుతారు. ఈ క్రమంలో అత్త చేత మల్లిక కాళ్ళకు పసుపు రాయించుకోవడం అని అనుకుంటుంది. అందుకు జానకి కాస్త అటు చెప్పినప్పటికీ మల్లిక ఎమోషనల్ గా ఫీల్ అవుతూ మాయ చేసే ప్రయత్నం చేస్తుంది.

   ఇక పూజ అనంతరం అందరికీ పట్టు చీరలు పెట్టించిన జ్ఞానాంబ

  ఇక పూజ అనంతరం అందరికీ పట్టు చీరలు పెట్టించిన జ్ఞానాంబ

  కోడళ్లిద్దరిని ఆశీర్వదిస్తుంది. అయితే అక్కడే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెబుతూ బీరువా తాళం అమ్మవారి ముందు ఉంచుతుంది. దీంతో అత్త ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ నిర్ణయం ఏమిటి అని అడిగే ప్రయత్నం చేస్తాడు కానీ జ్ఞానాంబ సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇంటికి వెళ్లేటప్పుడు ఆ విషయాన్ని తప్పకుండా చెబుతాను అంటుంది. ఇక మల్లికా కూడా తన మనసులో ఎన్నోన్అనుమానాలు కలుగ చేసుకుంటూ ఆలోచిస్తుంది. కీలక నిర్ణయం ఏమిటో అని తన భర్తను కూడా అడుగుతుంది కానీ అందుకు విష్ణు ఎలాంటి సమాధానం ఇవ్వడు.

   పగ తీర్చుకోవాలని

  పగ తీర్చుకోవాలని

  ఇక పూజ ముగిసిన అనంతరం అందరూ కూడా ఆటపాటలతో సంతోషంగా గడుపుతాము అని చెప్పడంతో తోట లోకి వెళ్తారు. అయితే అక్కడే వల్లిక మరో కండిషన్ పెడుతోంది. అందరం కలిసి ఒక ఆట పాడితే బాగుంటుంది అని కళ్ళకు గంతలు కట్టుకొని దొరికిన వారిని చితక్కొట్టాలని కండిషన్ పెడుతోంది. మల్లిక మనసులోని ఆలోచనలను పసిగట్టిన జ్ఞానాంబ సరేనని సవాల్ విసురుతుంది. ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకుంటుంది.

  భర్తను కొట్టిన మల్లిక

  భర్తను కొట్టిన మల్లిక

  ఎంత ప్రయత్నం చేసినా కూడా జ్ఞానాంబ ఆమె చేతికి చిక్కదు. ఇక చివరికి ఆమె భర్త విష్ణు దొరకడంతో తనివితీరా కొడుతుంది ఇక మల్లిక దెబ్బలకు కింద పడిపోయిన విష్ణు నన్ను కాపాడండి అంటూ అరుస్తాడు. కాస్త కూడా కనికరం లేకుండా అలా కొడతావా అని అడిగే ప్రయత్నం చేస్తాడు. మల్లికను చూసిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కసారిగా పగలబడి నవ్వుతారు.

  మరోసారి ముద్దుల వర్షం

  మరోసారి ముద్దుల వర్షం

  ఇక ఆ తర్వాత జ్ఞానాంబ, ఆమె భర్త సరదాగా పాటలకు డాన్సులు వేస్తూ ఉంటారు. తరచుగా పాటలను మారుస్తూ గోవిందరాజులు తన భార్యతో మరింత ప్రేమగా స్టెప్పులు వేసే ప్రయత్నం చేస్తాడు. ఇక వారి ఆటలు పాటలు ముగిసిన తర్వాత కూడా జానకి రామచంద్ర రంగంలోకి దిగుతారు. అయితే ఈసారి గోవిందరాజులు జానకి ఒక కండిషన్ కూడా పెడతాడు. జానకి తప్పనిసరిగా రామచంద్రకు ఒక ముద్దు పెట్టాలని అంటాడు. అందుకు జానకి సిగ్గుపడుతూ ఉన్నప్పటికీ రామ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే జానకి ముద్దు ముద్దు పెట్టడానికి కాస్త ఇబ్బంది పడుతుంది. ఇక వెంటనే అందరూ అటు వైపు తిరుగుతూ జానకికి కొంత ప్రైవసీ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.

   మరొకసారి అని అడగడంతో

  మరొకసారి అని అడగడంతో

  ఇక జానకి కూడా తన భర్తకు రెండు ముద్దులు పెడుతుంది. అందుకు రామచంద్ర మరొకసారి కావాలి అని కూడా అంటాడు కానీ ఇప్పుడే జానకి మావయ్యని పిలవడంతో అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. అందుకు రామచంద్రన్ కూడా కాస్త వెనక్కి తగ్గుతాడు. ఆటపాటలు ముగిసిన అనంతరం అందరూ కూడా మళ్ళీ పూజ స్థలానికి తిరిగి వస్తారు. అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. మొదట్లో జ్ఞానాంబ ఒక కీలక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పిన విషయం తెలిసిందే. అందుకే అత్తగారు ఏం చెప్తారో అని మల్లిక కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంటుంది.

  Legendary Director Raghavendra Rao Releases Pellikuturu Party Trailer
  అమ్మ మాటకే ఎదురు చెబుతావా?

  అమ్మ మాటకే ఎదురు చెబుతావా?

  లక్ష్మీ దేవత ముందు ఉంచిన బీరువా తాళాలను తీసుకున్న జ్ఞానాంబ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు అందరితో చెబుతుంది. తాళాలు తీసుకుని వెంటనే జానకి చేతుల్లో పెట్టి ఇక నుంచి ఈ ఇంటి బరువు బాధ్యతలు కూడా నీ మీద పెడుతున్నట్లు చెబుతుంది. అందుకు అందరు కూడా ఎంతగానో సంతోషిస్తారు. మరోవైపు మల్లిక తన పగను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ తాళాలు మళ్ళీ అత్త పాదాల దగ్గర నుంచి మీ నిర్ణయాన్ని నేను తిరస్కరిస్తున్నందుకు క్షమించాలి అని అంటుంది. వెంటనే రామచంద్ర అమ్మ మాటకు ఎదురు చెబుతారా అని జానకిని ప్రశ్నించే ప్రయత్నం చేస్తాడు. ఇక జానకి తీసుకున్న నిర్ణయంపై జ్ఞానాంబ ఎలా స్పందిస్తుందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 121:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X