Janaki Kalaganaledu September 6th: అఖిల్ ఇంటికి జెస్సి తల్లిదండ్రులు.. మల్లిక అనుమానంలో జానకి
జానకి కలగనలేదు ఫ్యామిలీ సీరియల్ గా రోజురోజుకు జనాల్లో మంచి ఆదరణను పెంచుకుంటోంది. భర్త రామచంద్ర సహకారంతోనే భార్య జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి చివరికి అత్తగారు కూడా ఒప్పుకుంటారు. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 382 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

గొప్ప స్థాయికి
జ్ఞానాంబ పెద్ద కొడుకులు చదువుకోలేదు అని తన చిన్న కొడుకు అఖిల్ ను ఉన్నత చదువులు చదివించాలని అనుకుంటుంది. ఇక అతని చదువుతో గొప్ప స్థాయికి తీసుకురావాలి అని కుటుంబ సభ్యులు అందరూ కూడా అనుకుంటారు. కానీ అఖిల్ మాత్రం మరోవైపు చదువుపై దృష్టి పెట్టకుండా ప్రేమ వ్యవహారాలతో తప్పులు చేస్తాడు. ప్రేమించిన అమ్మాయి జెస్సి అఖిల్ వలన గర్భవతి కూడా అవుతుంది. ఇక అది తెలియడంతో జానకి కూడా షాక్ అవుతుంది. జానకి అఖిల్ విషయంలో ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంది. అలాగే జెస్సికి కూడా న్యాయం చేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలో వాళ్ల ఫోటోలను కూడా జెస్సి దగ్గరనుంచి తీసుకుంటుంది. కానీ ఆ సాక్షాలను అఖిల్ జానకి ఫోన్ లో నుంచి డిలీట్ చేస్తాడు.

ఎలాంటి సంబంధం లేదని..
ఎలాంటి సంబంధం లేదని..

జానకి మళ్ళీ వెనుకడుగు
ఇక వినాయకచవితి సందర్భంగా జ్ఞానాంబ ఇంట్లో అందరికి కూడా కొత్త బట్టలు తీసుకు వస్తుంది. ఇక అప్పుడే జానకి జెస్సి అఖిల్ విషయాన్ని కూడా చెప్పాలని అనుకుంటుంది. జ్ఞానాంబ కొత్త బట్టలు తీసుకు వచ్చిన సందర్భంగా ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. కొత్త బట్టలు చూస్తూ మురిసిపోతారు. ఇక ఆ తరువాత అఖిల్ విషయం గురించి చెప్పాలి అనుకున్న జానకి మళ్ళీ వెనుకడుగు వేస్తుంది. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఇలాంటి విషయం మాట్లాడడం సరైనది కాదు అని అనుకుంటుంది.

గట్టిగా అడిగేసరికి
అప్పుడే జెస్సి జానకికి జరిగిన విషయాన్ని చెబుతుంది. మా అమ్మానాన్నలు గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పేసాను. ఇప్పుడు మా అమ్మా నాన్నలు మీ ఇంటికి వస్తున్నారు అని జెస్సి చెప్పడంతో జానకి షాక్ అవుతుంది. ఇక జానకి ఆ సమయంలో మరింత టెన్షన్ పడుతుంది. ఇప్పుడు జెస్సి పేరెంట్స్ ఇంటికి వస్తే గొడవలు అవుతాయి. వాళ్ళని ఎలాగైనా మధ్యలోనే అడ్డుకోవాలి అని ఇక్కడికి రాకుండా చూడాలని జానకి అనుకుంటుంది. ఇక ఆ తరువాత రామచంద్ర ఒక విషయం మాట్లాడాలి అంటూ వస్తాడు. నేను ఈ రోజు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంటికి స్వీట్స్ ఆర్డర్ చేయడానికి వెళ్ళాను అని అయితే అక్కడ ఇద్దరు గోడవను ఆయన చిటికెలో సాల్వ్ చేసినట్లు మాట్లాడుతాడు. ఇక మరోవైపు జానకి జెస్సి విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రామ ఎంత మాట్లాడుతున్నా కూడా పెద్దగా పట్టించుకోని జానకి మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది.

జెస్సి పేరెంట్స్ ను ఒప్పించిన జానకి
ఇక అప్పుడే జెస్సి పేరెంట్స్ కూడా వస్తారు. ఇక వారిని ఇంట్లోకి రానివ్వకుండా బయట ఆపేసిన జానకి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మాట్లాడితే అనవసరంగా గొడవలు జరుగుతాయి. తరువాత మాట్లాడుకుందాం అని అంటుంది. కానీ జెస్సి పేరెంట్స్ మాత్రం ఇప్పుడే ఏదో ఒకటి తెలుచుకుంటాం అని పెళ్లి కాకముందే నా కూతురుని తల్లి చేసిన అఖిల్ ని నిలదీసే వెళతాం అని అంటారు. అలాగే పెళ్లి కూడా చేసుకోవాలి అని అంటారు. తప్పకుండా వారిద్దరికీ పెళ్లి అవుతుంది అని అయితే ఇప్పుడు మాట్లాడితే మాత్రం పెళ్లి జరగదు అని జానకి చెబుతుంది.

అఖిల్ భయం
నా మాటను నమ్మి ఇప్పుడు వెళ్లిపోండి తప్పకుండా అఖిల్ , జెస్సిలకు పెళ్లి అవుతుంది అని తను నా చెల్లి లాంటిది అంటూ జానకి భరోసా ఇస్తుంది. ఇక జానకి మాటలకు విలువ ఇచ్చి జెస్సి పేరెంట్స్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక అఖిల్ విషయంలో ఏదో ఒకటి తేల్చాలి అని జానకి సీరియస్ గా అఖిల్ ను అడుగుతుంది. అయితే అమ్మకు భయపడి నేను జెస్సికి పెళ్లి చేసుకొనని చెప్పాను అని జానకికి చెబుతాడు. ఇక ఆ తరువాత ఈ విషయం ఎలాగైనా అత్తకు తెలియాల్సిందే అని అంటుంది. కానీ అఖిల్ మాత్రం తన తల్లికి చెప్పొద్దని బ్రతిమాలుతాడు. మరి ఈ విషయంలో జానకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











