For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu September 8th Episode: ఇంటి పెత్తనం నాకు వద్దు.. అసలు నిజం చెప్పిన జానకి

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా జానకి అత్త మాటకు ఎదురు చెప్పడంతో ఒక్కసారిగా జ్ఞానాంబ ఇంట్లో వాతావరణం మారిపోయింది. ఓ వైపు ఐపీఎస్ చదవాలని ఆశయంతో అడుగులు వేయాలని అనుకుంటున్న జానకికి మల్లిక నుంచి అపాయం ఏర్పడుతుంది. ఇక ఇంట్లో పెత్తనం ఇవ్వడం సంగతి పక్కన పెడితే మల్లిక చేసే చెడు పనులపైనే జానకి ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇక జానకి అత్త మాటకు ఎదురు చెప్పడం భర్తకు ఏ మాత్రం నచ్చదు.

  సంతోషంగా ఇంటి బాధ్యతలు ఇచ్చినప్పుడు తీసుకోక పోవడంతో ఆమెపై రామచంద్ర బాధతో ఉంటాడు. ఇక జానకి ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా రామ ఏ మాత్రం ఒప్పుకోడు. ఇక జానకి అసలు నిజాన్ని బయట పెడుతుంది. రెగ్యులర్ గా రొటీన్ గా అత్త కోడళ్ల గొడవలు కాకుండా క్యూట్ రొమాంటిక్ సీన్స్ కూడా హైలెట్ అవుతున్నాయి. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని పరిస్థితులను క్రియేట్ చేస్తోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 123వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  అందరిలో కన్ఫ్యూజన్

  అందరిలో కన్ఫ్యూజన్

  వరలక్ష్మి పూజ ముగిసిన అనంతరం ఇంటి బాధ్యతలను పూర్తిగా జానకి చేతుల్లో పెట్టి ఇక తాను రెస్ట్ తీసుకోవాలని జ్ఞానాంబ అనుకుంటుంది. అయితే జానకి మాత్రం ఆ నిర్ణయానికి విరుద్ధంగా పెత్తనాన్ని తీసుకోవడానికి వెనకడుగు వేస్తుంది. మీ నిర్ణయాన్ని కాదని అంతున్నందుకు నన్ను క్షమించండి అని అందరి ముందు చెప్పడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా తలదించుకుంటుంది. రామ కూడా భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్లాన్ వర్క్ అవుట్ అవ్వదు. ఒక్కసారిగా అందరి మధ్యలో దూరాలు పెరుగుతాయి. మల్లిక కూడా అలా ఎందుకు చెప్పింది అనే అనుమానంతో కన్ఫ్యూజన్ లో పడుతుంది.

  జానకి అత్త కోపం..

  జానకి అత్త కోపం..

  జ్ఞానాంబ కూడా జానకి తో మాట్లాడడానికి ఏ మాత్రం ఆసక్తి చూపదు. ప్రతిరోజు అత్తమామలకు అన్నం వడ్డించే పనిని కూడా దూరం పెడుతుంది. గోవిందరాజులు జ్ఞానాంబ భోజనానికి కూర్చొని ఉండడంతో జానకి అన్నం పెట్టేందుకు ముందుకు వస్తుంది. కానీ అప్పుడు జ్ఞానాంబ జానకితో మాట్లాడకుండా తన భర్తకు సమాధానమిస్తూ మన పనులు మనం చేసుకోగలం వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెబుతుంది. అత్త మాట్లాడటంతో జానకి ఒక్కసారిగా బాధకు గురి అవుతుంది.

  చిచ్చు మరింత పెద్దగా అవ్వాలని మల్లిక ప్రయత్నం

  చిచ్చు మరింత పెద్దగా అవ్వాలని మల్లిక ప్రయత్నం

  ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన మల్లిక జానకి, జ్ఞానాంబ మధ్యలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. అందుకు జ్ఞానాంబ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గట్టిగా చెబుతుంది. ఎలాగైనా అత్త దగ్గరనుంచి ఇంటి తాళాలు అందుకనే పెత్తనం చేయాలని మల్లిక మరొక విధంగా మాట్లాడుతుంది. ఇక మల్లిక ఆలోచనలను అర్థం చేసుకున్న గోవింద రాజులు కాస్త తగ్గితే మంచిది అని కూడా సెటైర్ వేసాడు. ఇక జానకిని మల్లిక దూరంగా వెళ్లి పొమ్మని తోసే ప్రయత్నం చేస్తుంది. అందుకు గోవిందరాజులు అడ్డు పడినప్పటికీ జ్ఞానాంబ ఒక్క మాట కూడా అనదు.

  జానకిపై బాధతో ఉన్న రామచంద్ర

  జానకిపై బాధతో ఉన్న రామచంద్ర

  జ్ఞానాంబ మాటలకు జానకి మనసు ఎంతగానో గాయపడుతుంది. కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటూ తన రూమ్ లోకి వెళ్లి పోతుంది. ఇక ఆ తర్వాత భోజనం చేయడానికి వచ్చిన రామచంద్ర సైలెంట్ గా ఇంట్లోనే వచ్చి పడుకుంటాడు. భోజనం చేయమని ఎంత బ్రతిమాలినా కూడా తను బయటనే చేసి వచ్చాను అని సమాధానమిస్తాడు. కానీ జానకి ఆ మాటలను నమ్మదు. వెంటనే లేవాలని డిమాండ్ చేస్తుంది. రామచంద్ర జానకి అన్న మాటలను మరోసారి గుర్తు చేసుకుంటాడు.తన తల్లి మాటకు గౌరవం ఇవ్వలేదని ఆలోచనతో రామచంద్ర జానకి పై కాస్త బాధతోనే ఉంటాడు.

  ఇంటి పెత్తనం తీసుకుంటే జరిగేది ఇదే..

  ఇంటి పెత్తనం తీసుకుంటే జరిగేది ఇదే..

  ఇక జానకి కూడా తన మనసులో ఉన్న ఒక నిజాన్ని బయట పెడుతుంది. నేను ఇంటి పెత్తనం తీసుకుంటే మల్లిక మరింత కోపానికి గురి అవుతుంది అని ఆ తర్వాత మీ తమ్మున్ని తీసుకొని బయటకు వెళ్లి వేరే కాపురం కూడా పెడుతుందని చెబుతుంది. ఆ భయం వల్లనే అత్తగారి దగ్గర నుంచి ఇంటి తాళాలు తీసుకోలేదని వివరణ ఇస్తుంది. కానీ అందుకు రామచంద్ర ఒప్పుకోడు. ఏ సమస్య వచ్చినా కూడా తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రేపు మీరు ఐపీఎస్ అయిన తర్వాత ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తాయి. అప్పుడు ఎలా చేస్తారు అని ప్రశ్నిస్తాడు.

   ఎలాగైనా ఆ రహస్యం తెలుసుకోవాలని..

  ఎలాగైనా ఆ రహస్యం తెలుసుకోవాలని..

  ఒక అనవసరపు కారణం వలన అమ్మ నిర్ణయాన్ని తప్పుపట్టడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆ బాధ నాకు అలానే ఉంటుంది అని రామచంద్ర బయటకు వెళ్ళిపోతాడు. ఈ గదిలో ఒంటరిగా కూర్చుని జానకి మరోసారి కంటతడి పెట్టుకుంటుంది. ఇక మరోవైపు మల్లిక తన కుట్రలను మరింత బలోపేతం చేయాలని అనుకుంటుంది. గతంలో జానకి ఫోటో పేపర్లో వచ్చిన విషయాన్ని ఎవరికైనా చూపించాలని దాని వెనుక ఉన్న రహస్యం కూడా తెలుసుకోవాలని అనుకుంటుంది. అందుకోసం తన స్నేహితురాలికి ఫోన్ చేసి రేపు ఉదయం వస్తున్నా అని అంటుంది.

  Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
  మొత్తం వినేసిన జ్ఞానాంబ

  మొత్తం వినేసిన జ్ఞానాంబ

  ఆలస్యం చేస్తే జానకి మళ్లీ ఇంటి పెత్తనం తీసుకునే అవకాశం ఉంటుందని ఎలాగైనా అత్త దగ్గర మంచి మార్కులు కొట్టేసి తాళాలు తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇక మరో వైపు జానకి రామ చంద్ర ఇద్దరి మధ్య దూరం పెరుగుతంది. ఇక జానకి భర్తకు సేవలు చేసే సమయంలో దగ్గరవ్వాలని అనుకుంటుంది. రామచంద్ర చొక్కాను ఇస్త్రీ చేస్తూ ఉంటుంది. కానీ అది కూడా రామచంద్రకు ఏ మాత్రం నచ్చదు. మరోసారి అసంతృప్తికి లోనైన జానకి మీ అమ్మగారి నుంచి ఇంటి పెత్తనం తీసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను కానీ ఆ తర్వాత ఆమె మళ్లీ మల్లిక వల్ల బాధపడే అవకాశం ఉంటుంది మీరు. చెబితే ఇప్పుడు తప్పకుండా వెళ్లి అత్తయ్యగారు కాళ్లు పట్టుకుని తీసుకుంటాను. మీకు సమ్మతమేనా అని అడుగుతుంది. ఇక రామచంద్ర ఆలోచనలో ఉండగా అప్పుడే వారి మాటలను గోవిందరాజులు జ్ఞానాంబ వింటారు. మరి కోడలు తీసుకున్న నిర్ణయం పై అత్త ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి

  English summary
  Janaki Kalaganaledu Today Episode 123
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X