Janaki Kalaganaledu September 8th: జ్ఞానాంబ నిర్ణయంతో పెరిగిన అఖిల్ టెన్షన్.. సందిగ్ధంలో జానకి!

జానకి కలగనలేదు సీరియల్ మంచి కథనంతో రోజురోజుకు జనాల్లో మంచి ఆదరణను పెంచుకుంటోంది. ఇక భర్త రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి అత్త జ్ఞానాంబ కూడా ఓకే అంటుంది. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 384 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

అఖిల్ జెస్సి టెన్షన్ లో జానకి

అఖిల్ జెస్సి టెన్షన్ లో జానకి

జానకి ప్రతి విషయంలో కూడా అత్త జ్ఞానాంబ ఇప్పుడిప్పుడే ఎంతో నమ్మకం గా ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఆమె ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. అయితే జానకి అనుకోకుండా అఖిల్ జెస్సి విషయంలో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే అఖిల్ కారణంగా జస్సీ గర్భవతి అవుతుంది. వారిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు ముందే తెలుసుకున్న జానకి విషయం అంతవరకు రావడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ విషయం ఇంట్లో చెప్పడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది కానీ చివరి నిమిషంలో మళ్లీ వెనకడుగు వేస్తుంది.

రామ అనుమానం

రామ అనుమానం

మొదట మరిది అఖిల్ జానకి నుంచి తప్పించుకోవాలని అనుకుంటాడు. కానీ జానకి మాత్రం జెస్సికి సరైన న్యాయం చేసి చేయాలని అనుకుంటుంది. ఇక చివరికి అఖిల్ ను కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తుంది. ఇక అందరూ కలిసి భోజనం చేస్తూ ఉన్న సమయంలో అఖిల్ తన ప్రేమ విషయాన్ని తల్లి తండ్రులకు చెప్పాలి అని వదినకు సైగలు చేస్తూ ఉంటాడు. అప్పుడే రామచంద్ర ఏదో మరిది గారు సైగలు చేస్తూ ఉన్నారు అని అనుమానం వ్యక్తం చేస్తాడు. అయితే చదువు గురించి మాత్రమే అంటూ జానకి కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత మల్లిక కూడా వీరి గురించి అనుమానాలు వ్యక్తం చేస్తుంది.

లీలావతి పెళ్లి సంబంధం

లీలావతి పెళ్లి సంబంధం

ఇక అందరూ భోజనం చేస్తున్న సమయంలో అక్కడికి లీలావతి వస్తుంది. ముందుగానే మల్లిక, లీలావతిని ఇంటికి రమ్మని చెబతుంది. ఎందుకంటే జానకి అఖిల్ మధ్యలో ఏదో విషయం కొనసాగుతోంది అని.. అది అఖిల్ ప్రేమ విషయమే అనే అనుమానం వస్తుంది అని కూడా అనుకుంటుంది. అయితే అఖిల్ పెళ్లి గురించి మాట్లాడితే తప్పకుండా జానకి అఖిల్ టెన్షన్ పడతారు అని అప్పుడు నా అనుమానం నిజమవుతుంది అని లీలావతికి చెప్పి మరి ఇంటికి రమ్మని అంటుంది.

ఇక నీలావతి మల్లిక చెప్పినట్లుగానే తనకు తెలిసిన ఒక సంబంధం ఉంది అని అఖిల్ కు సరైన జోడి అని తన అభిప్రాయాన్ని చెబుతుంది. కానీ జ్ఞానాంబ మాత్రం అందుకు ఒప్పుకోదు. ఎందుకంటే అఖిల్ ఉన్నత చదువులు చదవాలి అని అనుకుంటున్నాడు అని ఇప్పుడే అతన్ని పెళ్లి చేయడం కరెక్ట్ కాదు అని కూడా అంటారు.

రామ సలహాలు

రామ సలహాలు

అయితే అత్తగారికి అలాంటి అభిప్రాయం ఉండడంతో జానకి మరింత టెన్షన్లో పడుతుంది. ఎందుకంటే జెస్సి అఖిల్ ప్రేమించుకుంటున్నారు ఇప్పటికే జెస్సి గర్భవతి కూడా అయింది. జెస్సి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అఖిల్ తో వెంటనే పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. లేకపోతే మరింత గొడవ చేసే అవకాశం ఉంది అని జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది.

ఆ తర్వాత ఈ విషయంలో రామ గారికి ఏదైనా సలహాలు ఇస్తారమో అని జానకి అనుకుంటుంది. అందుకే అసలు విషయం చెప్పకుండా పరోక్షంగా తన స్నేహితురాలికి ఇలాంటి సమస్య వచ్చింది అని చెబుతుంది. అందుకు రామచంద్ర ఈ విషయంలో పెద్దగా టెన్షన్ పడకుండా మొత్తం విషయాన్ని ముందు వాళ్ళ అమ్మగారికి చెప్పేసి ఒక అడుగు ముందుకు వేయాలి అని అంటాడు. దీంతో జానకి ఆలోచనలు పడుతుంది.

మల్లిక ప్లాన్ ఫెయిల్

మల్లిక ప్లాన్ ఫెయిల్

ఆ తర్వాత మరుసటి రోజు వినాయక చవితి ఉండడంతో అందరూ కూడా ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. అయితే చిన్న కోడలు మల్లిక మాత్రం ఎలాంటి పనులు చేయకుండా అరటిపళ్ళు తింటూ ఉంటుంది. అయితే జానకిని ఈ పూజా సమయంలో ఏదో ఒక తప్పులో ఇరికించాలి అని కూడా అనుకుంటుంది.

అయితే పూజకు సంబంధించిన పూలు తెస్తూ ఉండగా జానకి ముందు అరటి తొక్క వేయాలి అని మల్లిక అనుకుంటుంది. అప్పుడు ఆ పూలు పడిపోతే అత్తగారి చేత తిట్టించాలని కూడా అనుకుంటుంది. అయితే ఆ పూలు కింద పడినప్పటికీ కూడా ఏమీ అనదు. అంతే కాకుండా రామచంద్ర జానకి కింద పడిపోకుండా పట్టుకుంటాడు.

దీంతో ప్లాన్ వేసిన మల్లిక ఒక్కసారిగా మళ్లీ షాక్ అవుతుంది. మరోవైపు జ్ఞానాంబ తను ఇంటి ఇంటి బాధ్యతలను అప్పగించినందుకు టెన్షన్లో ఉన్నావా అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదు అని ఎదో కాలు జారింది అని అంటుంది. మరి జానకి అఖిల్ విషయాన్ని ఎలా బయటపెడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X