For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu September 9th Episode:గయ్యాలి మల్లిక చేతిలో ఇంటి పెత్తనం.. జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరొక కీలక మలుపు తిరగబోతోంది. ఐపీఎస్ కావాలని అశయంతో అత్తగారికి తెలియకుండా బిజీగా చదువుతున్న జానకి గుట్టు అందరికి తెలిసిపోయే సమయం ఆసన్నమైంది. ఇన్ని రోజులు భర్త రామచంద్ర జాగ్రత్తల వలన తృటిలో తప్పించుకున్న జానకి ఇప్పుడు అత్త ముందు దోషిగా నిలబడే పరిస్థితి ఎదుర్కోబోతోంది. మల్లిక అసలు నిజం అత్త ముందు ఉంచడానికి చాలా ఆతృతగా వచ్చేస్తుంది. దీంతో సీరియల్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా జానకి అత్త మాటకు ఎదురు చెప్పడంతో ఒక్కసారిగా జ్ఞానాంబ ఇంట్లో వాతావరణం మారిపోయింది.

  ఓ వైపు ఐపీఎస్ చదవాలని ఆశయంతో అడుగులు వేయాలని అనుకుంటున్న జానకికి మల్లిక నుంచి అపాయం ఏర్పడుతుంది. రెగ్యులర్ గా రొటీన్ గా అత్త కోడళ్ల గొడవలు కాకుండా క్యూట్ రొమాంటిక్ సీన్స్ కూడా హైలెట్ అవుతున్నాయి. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని పరిస్థితులను క్రియేట్ చేస్తోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 124వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

   నిజం తెలుసుకున్న మల్లిక

  నిజం తెలుసుకున్న మల్లిక

  గతంలో జానకి ఫోటో ఒక ఇంగ్లీష్ పేపర్ లో రావడంతో మల్లిక ఆ పేపర్ ముక్కను ఎంతో భద్రంగా దాచుకుని రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. మధ్యలో ప్రయత్నాలు చేసినప్పటికీ వర్కౌట్ కాదు. ఇక ఫైనల్ గా తన స్నేహితురాలి అన్నయ్యకు చూపిస్తుంది. ఇంగ్లీషులో చదవడం తో మొదట ఏమీ అర్థం కాదు కానీ ఆ తర్వాత కట్టే కొట్టే తెచ్చే అనే పద్ధతిలో చెప్పాలని మల్లిక కోరడంతో జానకి ఐపీఎస్ ఆఫీసర్ గా అవ్వాలని అనుకుంటుందని, మరొక పరీక్ష రాస్తే తప్పకుండా పోలీసాఫీసర్ అవుతుందని అతడు చెబుతాడు.

  ఇంత పెద్ద మోసం జరిగిందని తెలిస్తే..

  ఇంత పెద్ద మోసం జరిగిందని తెలిస్తే..

  ఆ నిజం తెలుసుకోగానే మల్లికా ఒక్కసారిగా షాక్ అవుతుంది. కేవలం 5వ తరగతి మాత్రమే చదువుకున్నట్లు చెప్పిన జానకి ఈ స్థాయిలో చదువుకుంటుంది అని అస్సలు ఊహించలేదు. చిన్న చిన్న విషయాలకి తనను బయటకు పంపించే అత్తగారు పెద్ద కోడలు విషయంలో ఇంత పెద్ద మోసం జరిగిందని తెలిస్తే తప్పకుండా బయటకు నెట్టేస్తుందని ఆశ పడుతుంది. ఒక విధంగా షాక్ అవుతునే మరోవైపు మల్లిక సంబరపడిపోతుంది. త్వరగా ఇంటికి వెళ్లి అసలు విషయాన్ని బయట పెట్టాలని అనుకుంటుంది.

  అసలు కారణం చెప్పిన జానకి

  అసలు కారణం చెప్పిన జానకి

  ఇక భర్త రామచంద్ర తనకు దూరంగా అవుతుండడంతో జానకి తన వైపు నుంచి ఒక వివరణ ఇస్తుంది. నేను పెత్తనం తీసుకోకపోవడం వల్లనే కదా మీరు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. అయితే మీరు చెప్పినట్లే నేను అత్తగారి నుంచి ఇంటి అధికారాన్ని తీసుకుంటాను. కానీ అలా చేస్తే ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద కోడలని మహారాణిలా చూసుకుంటూ నన్ను ఏ మాత్రం లెక్క చేయడం లేదని మల్లిక అనుమానం ఆలోచనతో ఉంది.

  ఇక ఇప్పుడు నాకు పెత్తనం ఇచ్చింది అని తెలిస్తే తప్పకుండా వేరే కాపురం పెట్టడానికి మీ తమ్ముడిని ఉసిగొల్పుతోంది. ఆ తరువాత అత్తయ్య గారు చాలా బాధ పడతారు. అన్నదమ్ముల మధ్యలో గొడవలు వస్తాయి. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి పెత్తనాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. అవన్నీ జరిగితే పరవాలేదు అని మీరు అనుకుంటే తప్పకుండా మీరు చెప్పినట్లుగానే చేస్తాను. తీసుకొమ్మంటారా? చెప్పండి అని జానకి భర్తను అడుగుతుంది.

  జానకి తెలివికి షాక్ అయిన జ్ఞానాంబ

  జానకి తెలివికి షాక్ అయిన జ్ఞానాంబ

  ఇక రామచంద్ర ఆలోచనలో పడుతున్న సమయంలో అప్పుడే జ్ఞానాంబ, గోవిందరాజులు అక్కడికి వస్తారు. జానకి ఆలోచన విధానానికి ఆమె ఒక్క సారిగా షాక్ అవుతుంది. నిజంగానే నువ్వు ఐదో తరగతి మాత్రమే చదువుకున్నావా? ఎందుకంటే నీ ఆలోచనా విధానం ఉన్నత చదువులు చదివిన అమ్మాయి తరహాలో ఉందని చెబుతుంది. అయితే పక్కనే ఉన్న గోవిందరాజులు ఈ ఆలోచనకు చదువుకు ఏమాత్రం సంబంధం లేదు అంటూ జానకికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇక అప్పుడే జ్ఞానాంబ ఒకటి నిర్ణయం తీసుకుంటుంది. ఇంటి పెత్తనం మల్లిక చేతిలో పెట్టాలని అనుకుంటున్నట్లు చెబుతూ అందుకు జానకి నిర్ణయం కావాలని అడుగుతుంది.

  మల్లిక చేతిలో ఇంటి పెత్తనం

  మల్లిక చేతిలో ఇంటి పెత్తనం

  ఆ మాటలు విన్న రామచంద్ర జానకి గోవిందరాజులు కూడా షాక్ అవుతారు. ఏ మాత్రం ఆలోచించకుండా అడుగులు వేసే మల్లిక చేతిలో పెత్తనాన్ని పెట్టడం అంటే చాలా రిస్క్ అని గోవిందరాజులు చెబుతాడు. ఏ మాత్రం లెక్క లేకుండా ఖర్చు పెడుతుందని సమస్యలు కూడా మరింత ఎక్కువ అవుతాయని గోవిందరాజులు తన భార్యకు సలహా ఇస్తాడు. కానీ జ్ఞానాంబ మాత్రం అలా జరగదు అంటూనే, మల్లికను కనీసం ఇంటి బాద్యత గురించి అడగలేదని ఒక బాధ ఉంటుంది. తనకు బాధ్యత ఇచ్చినట్లే ఇచ్చి మనం కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలని అంటుంది. ఇక అప్పుడే తన విలువ ఏంటో కూడా మల్లిక ఆలోచిస్తుందని చెబుతుంది.

  జ్ఞానాంబ ముందు జానకి నిజం

  జ్ఞానాంబ ముందు జానకి నిజం

  ఇక మరోవైపు మల్లిక ఎలాగైనా అత్తకు జానకి చదువు గురించి అసలు నిజం చెప్పాలని ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అదే సమయంలో మల్లిక భర్త విష్ణు ఫోన్ చేస్తాడు. ఒక గుడ్ న్యూస్ అంటూ మా అమ్మ నీ చేతిలో ఇంటి పెత్తనాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉందమి అంటాడు. దీంతో ఒక్కసారిగా ఎగిరి గంతేసిన మల్లిక ఈరోజు నా లక్కు చాలా బాగుందని సంబరపడుతుంది. ఇక ఇంటికి వెళ్ళగానే అందరికీ హారతి ఇస్తున్న జ్ఞానాంబకు మల్లిక అసలు నిజాన్ని చెప్పాలని ల్ అనుకుంటుంది. ఇక ఆమె చేతిలో ఉన్న న్యూస్ పేపర్ ను కింద జారవిడుస్తుంది. అది చూసిన జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక జానకి చదువుకున్న విషయం తెలుస్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్ చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 124
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X