Janaki Kalaganaledu September 9th: జెస్సి పేరెంట్స్ ను మళ్ళీ అడ్డుకున్న జానకి.. జ్ఞానాంబ సీరియస్
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు జనాల్లో మంచి ఆదరణను పెంచుకుంటోంది. ఇక భర్త రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి అత్త జ్ఞానాంబ కూడా ఓకే అంటుంది. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 385 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

పెళ్లి చేయకూడదు
జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ జెస్సి అనే అమ్మాయితో ప్రేమలో పడి ఆమెకు గర్భం వచ్చేలా చేస్తాడు. ఇక ఆ విషయం తెలుసుకున్న జ్ఞానాంబ పెద్ద గోడలు జానకి ఎలాగైనా జెస్సికి న్యాయం చేయాలి అని అఖిల్ తో పెళ్లి జరిగేలా చేయాలని కూడా అనుకుంటుంది. కానీ పరిస్థితులు మాత్రం ఒక్కసారిగా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే అసలు విషయం తెలియని జ్ఞానాంబ కొడుకు చాలా నీతిమంతుడిగా చదువుకుంటున్నాడు అని అతని ఉన్నత చదువులు చదివించే వరకు పెళ్లి చేయకూడదు అని అనుకుంటుంది. ఇక తల్లికి భయపడి అఖిల్ కూడా తన ప్రేమ విషయం తెలియకుండా ఎంతో జాగ్రత్త పడతాడు. అంతే కాకుండా జానకి ఆ విషయం గురించి చెప్పాలని అనుకున్నప్పటికీ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించవు.

అనవసరంగా గొడవలు సృష్టిస్తే
జెస్సీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా జ్ఞానాంబ ఇంటికి వచ్చి అసలు విషయం తేల్చుకోవాలని కూడా అనుకుంటారు. కానీ జానకి వారిద్దరిని కూడా అడ్డుపడి ఈ సమస్యను మరీంత పెద్దది చేయవద్దని అనవసరంగా గొడవలు సృష్టిస్తే మీకే ఇబ్బందిగా మారుతుంది అని చెబుతుంది. ఎందుకంటే జ్ఞానాంబ చిన్న కొడుకు విషయంలో చాలా నమ్మకంతో ఉంటుంది. ఇప్పుడు ఆ విషయం తెలిస్తే ఎంత బాధ పడుతుంది. అంతే కాకుండా అనవసరంగా సీరియస్ అవుతుంది అని ఆ తర్వాత లేని పోనీ సమస్యలు ఎదురవుతాయని జానకి జెస్సి తల్లిదండ్రులకు వెనక్కి పంపిస్తుంది.

టైమ్ కూడా ఇవ్వదు
అయితే వినాయక చవితి ఉండడంతో జానకి చేతుల మీదనే పూజను జరిపించాలని అనుకుంటారు. ఇక అప్పుడు కూడా జానకి అఖిల్ విషయం గురించి మాట్లాడాలని అనుకుంటుంది. కానీ జ్ఞానాంబ అసలు మాట్లాడేందుకు టైమ్ కూడా ఇవ్వదు. ఆ తర్వాత జెస్సి తల్లిదండ్రులు ఇచ్చిన గడువు అయిపోతుంది. జానకి ఇంకా ఏమీ మాట్లాడలేదు అని అనుకుంటారు. అంతేకాకుండా వాళ్లు ఎంత ఫోన్ చేసినా కూడా జానకి లిఫ్ట్ చేయదు అని మరింత సీరియస్ అవుతుంటారు. కానీ జానకి మాత్రం ఫోన్ తన దగ్గర ఉంచుకోదు. పూజ పనుల్లో చాలా బిజీగా ఉంటుంది. ఇక జెస్సి పేరెంట్స్ పోలీస్ స్టేషన్ లోనే పిర్యాదు ఇస్తే గాని వీళ్ళు మనం చెప్పినట్లు వినరు అని అనుకుంటారు. అయితే జెస్సీ మాత్రం తల్లిదండ్రులకు నచ్చజెప్పి ప్రయత్నం చేస్తుంది కానీ వాళ్ళు ఏమాత్రం వినరు.

బయటకు వెళ్లిన జానకి
అంతేకాకుండా నువ్వు కూడా మాతో పోలీస్ స్టేషన్కు రావాలి అని అంటారు. ఇక డ్రస్ చేంజ్ చేసుకుని వస్తాను అని తన గదిలోకి వెళ్లే జానకికి ఆడియో మెస్సేజ్ చేస్తుంది. ఇక అప్పుడు విషయం తెలుసుకున్న జానకి మరింత టెన్షన్ పడుతుంది. ఎలాగైనా జెస్సి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఆపాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత జానకి రామచంద్ర కు ముఖ్యమైన పని ఉందని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళుతుంది. అత్తయ్య గారిని మీరే మ్యారేజ్ చేయాలని కూడా అంటుంది. ఇక తర్వాత జానకి బయటకు వెళుతూ ఉండగా నీలావతి కంటపడుతుంది. జానకిని పిలిచినప్పటికీ కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది.

జ్ఞానాంబ సీరియస్
దీంతో నీలావతి పూజకు రాగానే మల్లికకు ఆ విషయం చెబుతుంది. మీ జానకి ఎక్కడికో వెళుతుంది అని అంటుంది. అదే విషయాన్ని మల్లికా అత్తగారికి చెబుతుంది. మీరు పూజ పనులన్నీ కూడా చూసుకోవాలని చెప్పినప్పటికీ జానకి వినకుండా బయటికి ఎక్కడికో వెళ్ళింది అని అనడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది. పూజలో పెద్ద కోడలి చేత నిర్వహించాలని అనుకుంటే ఇలా చేసింది ఏంటి అని కోపంగా ఉండడంతో రామచంద్ర ఏదో అర్జెంట్ పని మీద బయటకు వెళ్లినట్లుగా తనతో చెప్పిందని అంటాడు. పూజ కంటే అర్జెంటు పని ఏమిటి అని తల్లి మరింత సీరియస్ అవుతుంది.

జెస్సి పేరెంట్స్ కండిషన్
ఇక తర్వాత జానకి జెస్సి తల్లిదండ్రులను మార్గం మధ్యలోనే ఆపేసి ఇంకాస్త టైమ్ కావాలని అడుగుతుంది. పూజలో బిజీగా ఉండడం వలన మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను అని తప్పకుండా కొంత సమయం తీసుకుని మా అత్తగారితో అఖిల్ విషయం గురించి మాట్లాడతాను అని అంటుంది. అందుకు జెస్సీ పేరెంట్స్ ఇప్పుడే మా అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్లి మీ అత్తగారికి పరిచయం చేయాలి అని పెళ్లి గురించి కూడా మాట్లాడాలి అని షరతు పెడతారు. అందుకు జానకి కూడా ఒప్పుకుంటుంది. మరి జ్ఞానాంబ ఎలా రియాక్ట్ అవుతుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











