For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu September 26th: జ్ఞానాంబ కోపం తగ్గించేలా జానకి ప్లాన్.. మల్లిక దొంగ తిండి!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన కథాంశంతో మరో మలుపు తిరిగింది. రామచంద్ర సహకారంతోనే, భార్య జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. అందుకు ఆమె అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. జానకి మరిది అఖిల్ మరో అమ్మాయిని ప్రేమించి గర్భం వచ్చేలా చేస్తాడు. ఇక ఆ అమ్మాయికి న్యాయం చేయాలని జానకి ప్రయత్నం చేస్తోంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 396 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

   జ్ఞానాంబ కోపం

  జ్ఞానాంబ కోపం

  అఖిల్ జెస్సి పెళ్లి జరగడంతో ఇంట్లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతాయి. ఇంట్లో పద్ధతులు ఆచారాలు పెద్దగా తెలియని జెస్సి అత్తకు కోపం తెప్పించేలా బట్టలు వేసుకుంటుంది. ఇక తర్వాత జానకిని పిలిచి జ్ఞానాంబ, జెస్సీని కొంచెం పద్ధతి ఉండేలా చూడమని చెబుతుంది. జెస్సి అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో జ్ఞానాంబ వారితో ఏమాత్రం మాట్లాడదు. వారిపై కోపం ఇంకా అలానే ఉంటుంది. అయితే మరోవైపు జానకి రామచంద్ర మాత్రం జ్ఞానాంబ కోపం తగ్గేలా చూడాలని అనుకుంటారు. ఇక అందరూ కలిసి ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో అప్పుడే జెస్సి తల్లిదండ్రులు కూడా వస్తారు.

  ఇంట్లోకి నాన్ వెజ్

  ఇంట్లోకి నాన్ వెజ్

  మా ఆనవాయితీగా పెళ్లి జరిగితే నాన్ వెజ్ తో విందు భోజనం ఏర్పాటు చేస్తామని అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఇంట్లో చేసిన నాన్ వెజ్ వంటకాన్ని తీసుకువచ్చినట్లుగా జెస్సి పేరెంట్స్ చెబుతారు. దీంతో జ్ఞానాంబ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇంతవరకు ఆచారం ప్రకారం ఇంట్లో ఎవరూ కూడా నాన్ వెజ్ తినలేదు. ఒక మల్లిక మాత్రమే చెప్పకుండా దొంగతనంగా తింటూ ఉంటుంది. ఇక జెస్సీ తల్లిదండ్రులు నాన్ వెజ్ తీసుకువచ్చారు అనగానే మల్లిక కూడా గంతేస్తుంది. అది ఇంట్లో ఇస్తే బాగుండు అని ఉంటుంది అలాగే వాళ్ళు ఇవ్వగానే ఆమె చేతికి అందుకుంటుంది. కానీ జ్ఞానాంబతో పాటు మిగతా ఇంటి సభ్యులందరూ కూడా సీరియస్గా చూస్తూనే ఉంటారు.

  మన ఆచారాలు తెలియవు

  మన ఆచారాలు తెలియవు

  ఇక తర్వాత జెస్సీ తల్లిదండ్రులు వాటిని ఇంట్లో ఇచ్చి వెళ్లిపోతారు. కానీ జ్ఞానాంబ మాత్రం అందరి ముందు మాట్లాడుతూ మన ఆచారాలు తెలియవు కాబట్టి వాళ్లు నాన్ వెజ్ తీసుకువచ్చారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలి అని జానకితో జ్ఞానాంబ అంటుంది. ఆ మాటలకు జెస్సి కూడా ఆశ్చర్య పోతుంది. ఇక తర్వాత మల్లిక వాటిని బయటపడేస్తాను అని చెప్పి బయటే ఒక దగ్గర కూర్చుని మల్లికా వాటిని ఓపెన్ చేసి తింటుంది. ఇక తర్వాత ఆమె భర్త విష్ణు అక్కడికి వస్తాడు. వీటిని బయట పడేస్తాను అని చెప్పి ఇక్కడ కూర్చుని తింటున్నావా అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

  జానకి పండగ ఆలోచన

  జానకి పండగ ఆలోచన

  కానీ తాను కడుపుతో ఉన్నాను అని అబద్ధం చెప్పిన మల్లిక కడుపుతో ఉన్నవాళ్లు వివిధ రకాల వంటకాలు తినాలని ఉంటుంది అని మరోసారి ఎమోషనల్ గా టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దీంతో విష్ణు ఏమీ అనలేక తన చేతులతోనే ఆమెకు తినిపిస్తాడు. ఇక తర్వాత రామచంద్ర జానకి ఇద్దరు కూడా ఇంట్లో ఎలాగైనా జ్ఞానాంబ కోపం తగ్గించాలి అని మళ్లీ ఎప్పటిలాగే సంతోషంగా అందరితో కలిసి ఉండేలా చేయాలని అనుకుంటారు. అయితే ఇంట్లో ఉండ్రాల తద్ది పండగ జరిపిద్దామని జానకి రామచంద్రకు సలహా ఇస్తుంది. అలా నలుగురిని పిలిచి పండగ జరిపిస్తే తప్పకుండా మళ్ళీ అత్తయ్య గారి బాధ తగ్గుతుంది అని అంటుంది.

  ఒప్పుకున్న జ్ఞానాంబ

  ఒప్పుకున్న జ్ఞానాంబ

  ఇక అదే విషయాన్ని జానకి అత్తగారితో చెప్పగానే ఆమె కొంత ఆలోచిస్తుంది ఇంట్లో అందరూ వస్తే మళ్లీ ఏదో ఒకటి అంటూ ఉంటారు అని ముఖ్యంగా అఖిల్ పెళ్లి గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటారు అని అందుకే తనకు ఆ పండగ జరుపుకోవడానికి ఇష్టం లేదు అని జ్ఞానాంబ జానకి మొహం మీద చెప్పేస్తుంది. కానీ రామచంద్ర మాత్రం నలుగురి కోసం మన సంతోషాన్ని ఎందుకు కాదనుకోవాలి అని ఈరోజు కాకపోయినా రేపైనా సరే అఖిల్ పెళ్లి గురించి అందరికీ తెలుస్తుంది అని వాళ్ళ మాటలు ఎప్పుడూ అలానే ఉంటాయి అని వాటిని పట్టించుకోవద్దు అని అంటాడు. అలాగే మరోవైపు గోవిందరాజులు కూడా చెబుతాడు. ఇక చివరికి సరే అని ఒప్పుకున్నా జ్ఞానాంబ ఆ పనులను జానకి చూసుకోవాలి అని అంటుంది.

  పూజలో అపశకునం

  పూజలో అపశకునం

  ఇక మరోవైపు జానకి ప్రత్యేకంగా రేపు పండగ సందర్భంగా గోరింటాకు సిద్ధం చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జెస్సి పండగ విశేషాల గురించి అడుగుతుంది. అలా అడుగుతుంటే పక్కనే ఉన్న జ్ఞానాంబ కూడా చూస్తుంది. ఇక ప్రత్యేకంగా పూజ జరుగుతుండగా ఆ సమయంలోనే హారతికి ఒకరి చీర అంటుకుంటుంది. ఇక ఆ సమయంలో మిగతా వాళ్ళు వాయనం తీసుకోవడానికి నిరాకరిస్తారు. ఈ ఇంట్లో వాయనం తీసుకుంటే మన పసుపు కుంకుమాలకు కూడా మంచిది కాదు అని వెళ్లిపోవాలని అనుకుంటారు. మరి ఈ తరహా అపశకునంపై జ్ఞానాంబ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial September Episode from 26th
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X