Janaki Kalaganaledu Serial May 20th Episode: వారసుడు వస్తాడు.. జ్ఞానాంబ ఛాలెంజ్‌తో జానకి మైండ్ బ్లాక్!

ప్రస్తుతం టీవీ సీరియల్స్ కు గతంలో కంటే ఎక్కువ ఆదరణ పెరుగుతోంది. ఇక ఇదివరకే వచ్చిన రొటీన్ ఫార్మాట్ అయినప్పటికీ జానకి కలగనలేదు సిరియల్ ఓ వర్గం వారిని అమితంగా ఆకట్టుకుంటోంది. క్యూట్ లవ్ స్టొరీతో పాటు ఒక భార్య ఆశయం, భర్త అమాయకత్వ ప్రేమ, గాంబిర్యమైన అత్త డామినేషన్, ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 44వ ఎపిసోడ్ ఒక లుక్కేస్తే..

ఇష్టమైన కానుక

ఇష్టమైన కానుక

జానకి మహా సిగ్గుతో నడుచుకుంటూ ఉంటే రామచంద్ర ఆమె కంటే ఎక్కువ సిగ్గుతో కనిపిస్తాడని అందరికి తెలిసిందే. ఇక ఈ అందమైన అమాయక ప్రేమలో అద్భుతమైన సన్నివేశం చోటుచేసుకుంది. తన భార్యకు ఇష్టమైన ఒక నెక్లెస్ ను బహుమతిగా ఇవ్వడానికి సిగ్గు పడే రామచంద్ర పనిమనిషితోనే ఆ కానుకను పంపిస్తాడు.

ఇద్దరు సిగ్గుపడుతూ

ఇద్దరు సిగ్గుపడుతూ

జానకి ఒకప్పుడు ఒక షాప్ లో ఇష్టపడిన ఆ నెక్లెస్ విషయాన్ని గుర్తు చేస్తూ నువ్వు నా జీవితంలో రాకముందే ఆ బహుమతిని తీసుకున్నట్లు చెబుతాడు. అప్పుడు పని మనిషి ఇచ్చిన ట్విస్టుతో రామ్ వచ్చి జానకి మెడలో ఆ నెక్లెస్ వేయాల్సి వస్తుంది. ఇద్దరు సిగ్గుపడుతూ ఒకరినొకరు అనుమతి తీసుకుంటూ నడిచే ఆ సన్నివేశం చాలా అందంగా ప్రజెంట్ చేశారు.

సునందా దేవి కోసం వైజయంతి ఎదురుచూస్తుండగాc

సునందా దేవి కోసం వైజయంతి ఎదురుచూస్తుండగాc

ఇక వైజయంతి మనవరాలు పుట్టిన సందర్భంగా వేడుకకు పిలవడంతో అక్కడ ఊహించని అనుభవాలు ఎదురవుతాయి. జ్ఞానాంబ చాలెంజ్ కూడా విసురుతోంది. కౌన్సిలర్ సునందా దేవి కోసం వైజయంతి ఎదురుచూస్తుండగా ఆమె తనయుడు వచ్చి అమ్మ ముఖ్యమైన పొలిటికల్ మీటింగ్ వల్ల రాలేదు అని చెబుతాడు. ఇక పాత గొడవలను గుర్తు చేసుకొని అతను జ్ఞానాంబను అలాగే చూస్తుంటాడు.

సునందా దేవి కొడుకుకి జ్ఞానాంబ కౌంటర్

సునందా దేవి కొడుకుకి జ్ఞానాంబ కౌంటర్

అనంతరం జ్ఞానాంబ సునందా దేవి కంటే తన గొప్ప తనాన్ని అందరి ముందు చూపించుకుంటుంది. నా వల్లే మీ అమ్మ గెలిచింది బాబు. మా వార్డులోనే ఓట్లు కీలకం అయినప్పుడు నేను మద్దతు ఇవ్వడం వల్లే అందరూ ఓట్లు వేశారని చెబుతుంది. తోటివారు కూడా మద్దతు పలకడంతో సునంద దేవి తనయుడు అవమానంగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి కోపంతో బయటకు వెళ్లిపోతాడు.

జ్ఞానాంబ చాలెంజ్

జ్ఞానాంబ చాలెంజ్

ఇక వేడుకలో అంతా సక్రమంగా జరుగుతున్న క్రమంలో వైజయంతి, జ్ఞానాంబల మధ్యలో మాటలు కొనసాగుతాయి. మరీ మీ ఇంట్లో ఎప్పుడు బారాసలకు పిలుస్తావు అంటూ రెచ్చగొడుతుంది. ముందుగా వచ్చిన చిన్న కోడలే వరాసుడిని ఇవ్వలేదు ఇక పెద్ద కోడలు ఎప్పటికి ఇస్తుందో అన్నట్లు మాట్లాడడంతో అందుకు జ్ఞానాంబ సంవత్సరం తిరగకుండానే వేడుక జరుగుతుందని చాలెంజ్ చేస్తుంది.

జానకిపై ఫోకస్..

జానకిపై ఫోకస్..

ఇక మరోవైపు సునందాదేవి కొడుకు జ్ఞానంబ మాట్లాడిన మాటలకు అవమానంగా ఫీల్ అవుతూ ఎలాగైనా ఆమె పగ తీర్చుకోవాలని జానకిపై ఫోకస్ పెట్టాలని అనుకుంటాడు. ఇక జ్ఞానాంబ చాలెంజ్ కు జానకి షాక్ అవుతుంది. ఇక 45వ ఎపిసోడ్ లో దొంగతనం జరుగుతుంది. ఆ సీన్ తో ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X