Janaki Kalaganaledu Weekly Roundup: జానకి కోసం రామ ఊహించని అబద్ధం.. షాక్ లో ఫ్యామిలీ!

జానకి కలగనలేదు సీరియల్ మొదట కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే జూన్ 12 నుంచి జూన్ 16 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..

జూన్ 12వ ఎపిసోడ్:మొదట ఆమె భర్తతో మాట్లాడడానికి అంతగా ఆసక్తి అసలు చూపించదు. ఎవరు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఉంటుంది. టాబ్లెట్స్ వేసుకోవాలి అని గోవిందరాజులు చెప్పినప్పటికీ కూడా అసలు మాటలు పట్టించుకోదు. దీంతో గోవిందరాజులు ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు కాబట్టి ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి అని అనవసరంగా మన ఇష్టాల కోసం ఒకరిని బాధ పెట్టకూడదు అని అర్థమయ్యేలా చెబుతాడు. దీంత జ్ఞానాంబ అందుకు సరే అంటుంది. మరోవైపు జానకి తల్లి కాలేదేనే బాధలో ఉంటుంది. ఈ దురదృష్టం ఎవరికి రాకూడదు అని బాధపడుతూ ఉండడంతో రామచంద్ర ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. అంతే కాకుండా నవ్వుల్లోకి తీసుకువస్తాడు.

Janaki Kalaganaledu Serial Weekly Roundup: 2023 June 12th to June 16th Episode

జూన్ 13వ ఎపిసోడ్:మరికొన్ని నెలలు గడవగానే మల్లిక కూతురికి అన్నప్రాసన జరిపిస్తారు. ఈ క్రమంలో అప్పుడే నీలవతి కూడా ఆ వేడుకకు వస్తుంది. ఇక మల్లికకు ఎప్పుడు ఏదోక అనుమానం కలిగేలా మాట్లాడుతూ ఉంటుంది. ఈసారి కూడా జానకితో అన్నప్రాసన ఏమాత్రం చేయించకు అని చెబుతుంది. ఇక మల్లిక కూడా అదే తరహాలో ఆలోచిస్తుంది. జానకి గొడ్రాలు అనేలా ఆమె చేయి మంచిది కాదని అంటుంది. మల్లిక బిడ్డకు జానకి అన్నం తినిపిస్తూ ఉండగా మల్లిక ఆపేస్తుంది. అన్నం ఎక్కువైతే పాపకు బాగుండదు అని చెబుతుంది. దీంతో జానకి కూడా ఏమీ అనకుండా సైలెంట్ గా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ తరువాత జానకి అసలు విషయం బయట పెట్టాలి అని మల్లిక అనుకుంటుంది. మీరు రోజు జానకికి టాబ్లెట్స్ ఇస్తున్నారు కానీ ఆమె మాత్రం వాటిని వేసుకోకుండా బయట పాడవేస్తోంది అని మల్లికా అత్తగారికి చూపిస్తుంది. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది.

Janaki Kalaganaledu Serial Weekly Roundup: 2023 June 12th to June 16th Episode

జూన్ 15వ ఎపిసోడ్:అసలు మీరు ఎందుకు ఇలా అబద్దం చెప్పారు అని జానకి అడుగుతుంది. అయితే రామ్ అసలు నిజం చెబుతాడు. మీకు పిల్లలు పుట్టరు అనే విషయం నాకు తెలుసు అని ఇప్పుడు ఆ విషయం ఇంట్లో చెబితే మళ్ళీ అనవసరమైన గొడవలు జరుగుతాయి అని ముఖ్యంగా మల్లికా మిమ్మల్ని మరింత బాధ పెట్టే ప్రయత్నం చేస్తుంది అని అర్థమైంది. అందుకే ఈ అబద్ధం ఆడాల్సి వచ్చింది అని ఇది ఎవరికి నష్టపరిచే అబద్ధం అయితే కాదు అని అతను చెప్పడంతో జానకి ఏమాత్రం వినదు. ఇది అసలు కరెక్ట్ కాదు అని నాకు జరిగిన దురదృష్టాన్ని మీరు భరించడం అనేది నేను ఎంత మాత్రం ఒప్పుకోను అని, ఆమె అసలు నిజం చెప్పాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం జానకిని దగ్గరికి తీసుకొని బాధపడకండి అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆమె వెనక్కి తగ్గుతుంది ఇక తర్వాత విష్ణు మల్లిగా తీరును చూసి కాస్త సంతృప్తి చెందుతాడు.

Janaki Kalaganaledu Serial Weekly Roundup: 2023 June 12th to June 16th Episode

జూన్ 16వ ఎపిసోడ్:ఇక మరోవైపు చిన్న కుమారుడు అఖిల్ తన భార్యతో కూడా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అతనిలో చాలా మార్పు వస్తుంది. అతను తండ్రి గురించి కూడా ఆలోచిస్తాడు. ఇక ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటున్న సమయంలో పక్కింటి నుంచి ఒక మహిళ వచ్చి జ్ఞానాంబ ను తన ఇంట్లో వ్రతం జరుగుతుంది అని దానికి రావాలి అని ఆహ్వానిస్తుంది. ఆమె కోడలు చేత బొట్లు కూడా పెట్టిస్తుంది. అయితే వారి కోడలు జానకికి బొట్టు పెడుతూ ఉండగా ఆమె ఒక్కసారిగా అడ్డుపడుతుంది. ఎవరికి పడితే వారికి బొట్టు పెట్టకూడదు అని పిల్లలు లేని వారికి అసలు పెట్టకూడదు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో జానకీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి ఈ విషయంలో అత్తగారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X