Janaki Kalaganaledu Weekly Roundup: జానకి కోసం అత్త స్పెషల్ ప్లాన్.. రొమాన్స్ తో రామ ఆనందం!
జానకి కలగనలేదు సీరియల్ మొదట కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే మే 15 నుంచి మే 20 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..
మే 15వ ఎపిసోడ్: మల్లికతో చాలా ప్రత్యేకంగా మాట్లాడిన నీలావతి ఈసారి కూడా నువ్వు గర్భవతి అయినట్లుగా నాటకం ఆడుతున్నావేమో అని అనుకున్నాను. కానీ మొత్తానికి సాధించావు అని, నువ్వు తల్లి అయినందుకంటే కూడా జానకి కంటే ముందు తల్లి అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని నిలావతి మాట్లాడుతుంది. అంతే కాకుండా మల్లిక కూడా అదే విధంగా మాట్లాడుతూ.. జానకి కంటే ముందుగానే పిల్లలను కనాలని అనుకున్నాను అంటూ ఆమెకు అసలు పిల్లలు కావద్దు అని నువ్వు ఆ దేవుడిని గుడికి వెళ్లి పూజలు చేయించు అనే మల్లికా మాట్లాడుతుంది. దీంతో జానకి వారి మాటలు విని ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది. అయితే జానకి రామచంద్ర ఇద్దరినీ కూడా ఒక రెండు మూడు రోజులు వేరే ఊరికి వెళ్లాల్సిందిగా జ్ఞానాంబ ఆదేశిస్తుంది. మీ పెద్దమ్మ దగ్గర పూజ జరుగుతుంది అని మీరు ఇద్దరు కూడా అక్కడికి వెళ్లాలి అని రామచంద్రకు చెబుతుంది. మరి రామచంద్ర జానకి ఎక్కడికి వెళతారో తెలియాలి అంటే తదుపరి ఎపిసోడ్ చూడాల్సిందే.

మే 16వ ఎపిసోడ్: ఇక ఆ తర్వాత ఆమె రామ కోసం అటూ ఇటూ నడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో రామచంద్రా దూరం నుంచి బాణమ్మను చూసి ఒక్క క్షణం ఆగిపోతాడు. అంతేకాకుండా ఆమెను ఆటపట్టించాలని అనుకుంటాడు. అయితే బానమ్మను చూసినప్పటికీ కూడా పట్టించుకోకుండా ముందుకు వెళుతూ ఉంటాడు. ఇక బానమ్మా వెంటనే పరిగెత్తుకుంటూ రామచంద్రను ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆగిన రామచంద్ర ఎవరు నువ్వు అంటూ అడగడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిన్ను చిన్నప్పుడు పెంచిన దాన్ని అప్పుడే మర్చిపోయావా అని అడగడంతో రామచంద్ర మళ్లీ ఆలోచిస్తున్నట్లుగా నాటకం ఆడుతాడు. అప్పుడు రామచంద్ర గుర్తుపట్టినట్లుగా మాట్లాడుతూ కాస్త మారిపోయావు అని అందుకే గుర్తుపట్టలేదు అని అనడంతో బానమ్మ ఒక్కసారిగా అలుగుతుంది.

మే 18వ ఎపిసోడ్: నీకు ప్రత్యేకమైన ఒక మందు ఇచ్చాను ఒక రోజు వరకు కూడా ఎలాంటి మాంసం ముట్టుకోవద్దని చెప్పాను కదా అయినా కూడా నువ్వు లెక్క చేయడం లేదు అని అసలు నువ్వు కడుపుతో ఉన్నావని ఇలాంటి సమయంలో ఇలా చెప్పిన మాట తప్పడం కరెక్ట్ కాదు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఇక మరోవైపు బాణమ్మ రామచంద్ర జానకి ఇద్దరిని కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటుంది. వారికి ప్రత్యేకంగా వంట చేసి వడ్డించి పెడుతుంది. ఇక ఆ సమయంలో రామచంద్ర జానకి తో ఎంతో సరదాగా ఉంటాడు. ఇక ప్రత్యేకంగా వారు తోటలో పడుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో రామచంద్ర చాలా రొమాంటిక్ గా కూడా మారిపోతాడు. మరి జానకి అత్తగారికి ఎలాంటి శుభవార్త చెబుతుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.
మే 19వ ఎపిసోడ్ : నేను చెబుతున్నాను కదా వెళ్లి పడుకోండి అని బానమ్మ గట్టిగా చెప్పడంతో రామచంద్ర జానకి పేరట్లోకి వెళతారు. అయితే అక్కడ మాత్రమే ఏదో చాప ఉంది అని అనుకుంటాడు రామచంద్ర. కానీ అక్కడ పూల మంచంతో అందంగా రొమాంటిక్ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. దీంతో అసలు విషయం రామచంద్రకు అర్ధమవుతుంది. కానీ జానకి మాత్రం ఏమీ అర్థం కానట్లుగానే నాటకం ఆడుతూ ఉంటుందే. కాసేపు రామచంద్రను ఆటపట్టించాలని కూడా ఆమె ఆలోచిస్తుంది.

మే 20వ ఎపిసోడ్: ఇక రామచంద్ర కు మాత్రం ఆ వెన్నెల్లో రొమాంటిక్ గా మూడ్ వస్తుంది అని అంటాడు. కానీ జానకి మాత్రం మొదట ఏమీ తెలియనట్లుగా రామచంద్రను సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక బానమ్మ చేత కూడా రామచంద్ర తిట్లు తిట్టిస్తుంది. ఇక చివరికి రామచంద్ర జానకి జానకి నాకు మూడ్ వస్తుంది అని చెప్పడంతో అతను చాలా సంతోషపడతాడు. మరి ఫైనల్ గా జ్ఞానాంబ కోరుకుంటున్నట్లుగా జానకి శుభవార్తతో ఇంటికి వస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











