Janaki Kalaganaledu Weekly Roundup: జానకిపై ఎస్ఐ హెచ్చరికలు.. గుడ్ న్యూస్ తో జానకి సంబరం!

జానకి కలగనలేదు సీరియల్ మొదట కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే మే 23 నుంచి మే 27 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..

మే 23వ ఎపిసోడ్: ఆ క్రమంలో బానమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు ఎందుకు వస్తారో ఎందుకు వెళ్లిపోతారో అర్థం కాదు అని అయినా ఎక్కువగా ప్రేమను పెంచుకుంటే ఇంతే బాధపడాల్సి వస్తుంది అని ఆమె తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక ఆమె ఏడుస్తున్న విధానాన్ని చూసి రామచంద్ర జానకి కూడా ఎమోషనల్ అవుతారు. అయితే తాను ఏమీ ఏడవడం లేదు అని బానమ్మ చెబుతుంది. అయినప్పటికీ కూడా నువ్వు ఏమీ బాధపడకు బానమ్మ మేము మళ్ళీ వస్తాను కదా నేను ఎప్పటికీ నీకు గుండెల్లోనే ఉంటాను అని అంటాడు. ఇక ఆమెకు అలా చెప్పి వాళ్ళు ఇంటికి బయలుదేరుతారు. అయితే మరోవైపు జానకి ఎస్సై మనోహర్ నుంచి కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ జానకి అతనికి ఎదురుగా నిలబడి నువ్వు ఏమీ చేయలేవు అని సవాల్ విసురుతూ ఉంటుంది.

 Janaki Kalaganaledu Weekly Roundup

మే 24వ ఎపిసోడ్: కాస్త జ్యూస్ మాత్రం ముందుగానే మల్లిక తెలివిగా తన నోటికి రాసుకుంటూ ఉంటుంది. ఇక నిజంగానే మల్లికా ఆ జ్యూస్ తాగిందని అత్తగారు అనుకుంటారు. రోజు ఇలానే తాగించాలి అని కూడా ఆమె పని వాడితో చెబుతూ ఉండడంతో అతను ఆశ్చర్యపోతాడు. కానీ ఏమి చెప్పలేకపోతాడు. ఇక మరోవైపు అత్తగారు జ్ఞానాంబ జానకికి ఎలాగైనా కడుపు పండాలి అని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులైనా శుభవార్త చెప్పకపోవడంతో అమ్మవారు కరుణించడం లేదు అని ఆమె అనుకుంటూ ఉండగా జానకి అప్పుడే వచ్చి తప్పకుండా మన సమయం వచ్చేవరకు అమ్మవారి అనుగ్రహం కోసం ఎదురు చూడాలి అని తప్పకుండా ఆమె నమ్ముకున్న వారికి న్యాయం చేస్తుంది అని జానకి చెబుతుంది. అయితే మరోవైపు జానకి ఎస్ ఐ మనోహర్ నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతుంది.

 Janaki Kalaganaledu Weekly Roundup

మే 25వ ఎపిసోడ్:రామచంద్ర ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి అసలు విషయం చెబుతాడు. మీ జానకి కారణంగా ఈ రోజు నా కుటుంబం ఒక పెద్ద సమస్య నుంచి తప్పించుకుంది అని మా కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బును ఒక దొంగ తీసుకొని వెళ్ళిపోతుంటే జానకి ధైర్యం చేసి అతన్ని పట్టుకొని మళ్లీ నా డబ్బు వెనక్కి తిరిగి ఇచ్చింది అని అంటూ.. ఆమె చేసిన మేలు నేను ఏ మాత్రం మర్చిపోలేను అని చెబుతాడు. ఇక ఆ విషయం గురించి తెలియడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో సంతోషిస్తారు. అయితే మళ్లీ మీ షాపును వెనక్కి తీసుకు రావడానికి సిద్ధమయ్యాను అని ఆ పాపం నేను అనవసరంగా చేశాను అని అతను తప్పు ఒప్పుకుంటాడు. ఇక అదే విషయాన్ని రామచంద్ర జానకి తో సంతోషంగా చెప్పాలని బయలుదేరుతాడు. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అనడంతో జానకి మొదట ప్రెగ్నెన్సీ గురించి తెలిసిందేమో అని అనుకుంటుంది. కానీ ఆ విషయం కాదు అని రామచంద్ర మాటలతో అర్థమవుతుంది.

 Janaki Kalaganaledu Weekly Roundup

మే 26వ ఎపిసోడ్: రామచంద్ర జానకి ఇద్దరు కూడా గదిలోకి వెళ్లి ఎంతో సరదాగా ఉంటారు. అయితే రామచంద్ర తనకు పాయసం తినాలని ఉంది అని చెప్పడంతో జానకి వెంటనే ప్రత్యేకంగా చేసి తీసుకువస్తుంది. అయితే గర్భం వచ్చింది అని మీరు తండ్రి కాబోతున్నారు అని నిజం చెప్పాలని జానకి అనుకుంటుంది. అయితే ఇంతలోనే అత్తగారు పిలవడంతో జానకి మళ్ళీ ఆ మాటను చెప్పలేక పోతుంది. ఇక జానకి ఎలాగైనా మళ్ళీ ఐపీఎస్ కావాలి అని కూడా రామచంద్ర కోరుకుంటాడు. ఆ విషయాన్ని మరోసారి భార్యతో మాట్లాడతారు. జానకి ప్రెగ్నెన్సీ తో ఉన్న విషయాన్ని తెలుసుకోలేకపోయినా రామచంద్ర మీరు ఎలాగైనా ఈసారి ఐపీఎస్ పరీక్షల్లో పాస్ అవ్వాలి అని అందుకు తగ్గట్టుగా చదవాలి అని, మిమ్మల్ని అభిమానించిన వారు ఇప్పుడు మీకు సెల్యూట్ చేసేలా చేయాలి అని చెబుతాడు. అయితే జానకి తాను ప్రెగ్నెన్సీ తో ఉన్న విషయాన్ని చెప్పకుండా ఒక సంవత్సరం వరకు ఆగుదామని చెబుతుంది. దీంతో రామచంద్ర కాస్త అసహనం వ్యక్తం చేస్తూ.. ఎందుకు ఇంట్లో గిన్నెలు తోముకుంటూ ఉంటారా? అని వెటకారంగా మాట్లాడుతాడు. ఇక జానకి నిజం చెప్పాలని అనుకుంటుంది. మరి ఈ విషయంలో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X