Janaki Kalaganaledu Weekly Roundup: మనోహర్ ను ఎదిరించి భర్తను కాపాడుకున్న జానకి.. మరో షాకింగ్ ట్విస్ట్!
జానకి కలగనలేదు సీరియల్ మొదట కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే మే 8 నుంచి మే 12 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..
మే 8వ ఎపిసోడ్ : జానకి అత్తగారు తన కొడుకు ఇంటికి వచ్చేవరకు భోజనం కూడా చేయను అని చెబుతుంది. అయితే ఆమెను ఓదార్చాలని జానకి ప్రయత్నం చేస్తుంది. కానీ నాలో ఉన్న బాధ మీకు ఏమీ అర్థం కాదు అని జ్ఞానాంబ ఆమెతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడదు. నువ్వు నా కొడుకును తీసుకువస్తాను అని ముందే మాట ఇచ్చావు కానీ ఇప్పటివరకు ఆ మాటను నిలబెట్టుకోలేదు. నీకు ఈ కుటుంబం కంటే కూడా నీ ఉద్యోగమే ముఖ్యం నా కొడుకు తప్పు చేయకపోయినా అతన్ని పోలీస్ స్టేషన్లో వేశారు. ఎందుకు నీ చదువులు? ఏదో సాధిస్తావ్ అనుకుంటే ఇలా అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చుంటావా అని అత్తగారు ప్రశ్నించడంతో జానకి మళ్ళీ ఆలోచనలో పడుతుంది. తన ఉద్యోగాన్ని వదిలేయాలని అనుకుంటున్న సమయంలో ఆమెకు ఒకే ఒక్క అవకాశం ఎదురవుతుంది.

మే 9వ ఎపిసోడ్ : జానకి ఇంట్లో కూడా అందరూ ఆమెపై కోపంగా ఉంటారు. అసలు జానకి ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది అని భర్త కోసం తన ఉద్యోగాన్ని వదిలిపెట్టవచ్చు కదా అని అంటూ ఉంటారు. అయితే జానకి మాత్రం భర్తను కాపాడుకోవాలి అని అలాగే అన్యాయం జరిగిన వారికి న్యాయం కూడా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. బిల్డర్ మధుకర్ చేసిన మర్డర్ ను కోర్టులో నిరూపించి అలాగే రామ ఎలాంటి డ్రగ్స్ అమ్మలేదు అని నిజం నిరూపించాలి అని జానకి అనుకుంటుంది ఇక ఆఖరి రోజు ఆమె ఎస్సై మనోహర్ ఇంటికి వెళ్లి అక్కడ అతని దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ దొంగతనం చేస్తుంది. అందులో మధుకర్ మర్డర్ చేసిన సిసి వీడియో ఫుటేజ్ లో కూడా ఉంటాయి.

మే 10వ ఎపిసోడ్
ఎలాగైనా కోర్టులో కేసు గెలవాలని జానకి ధైర్యంగా ముందడుగు వేస్తుంది ఎస్సై మనోహర్ ఆమెను అడ్డుకునేందుకు ఎంతగా ప్రయత్నం చేసిన కూడా జానకి అసలు ఏ మాత్రం వెనుకడుగు వేయదు. అయితే ముందుగా కోర్టులో రామచంద్రను ప్రవేశపెట్టినప్పుడు జానకి జడ్జితో మాట్లాడాలని అనుకుంటుంది. కానీ ఆమెను ఎస్ఐ మనోహర్ అడ్డుకోవాలి అని చూస్తాడు. ఇక తర్వాత జడ్జి ఆమెకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తాడు. ఇక జానకి తన భర్తను బయట పడేసే విధంగా తగిన సాక్షాలను కూడా బయటపెడుతుంది.
మే 11వ ఎపిసోడ్ : జడ్జి ఈ మర్డర్ కి రామచంద్ర డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం ఉంది అని అడగడంతో కావాలని నన్ను ఇరికించడానికి ఎస్సై మనోహర్ అలాగే బిల్డర్ కలిసి నా భర్తను ఇరికించారు అని చెప్పడంతో జడ్జి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక రామచంద్రపై అబద్ధం సాక్ష్యం చెప్పిన వ్యక్తి కూడా ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఒక వెయ్యి రూపాయలు ఇస్తారు అని చెబితే ఈ అబద్ధం ఆడాను అని రామచంద్ర బండిలో డ్రగ్స్ ఎస్సై గారు చెబితేనే పెట్టాను అని నిజం చెప్పడంతో చివరికి జడ్జి రామచంద్ర నిర్దోషి అని చెబుతాడు. ఇక ఎస్ఐ మనోహర్ ను సస్పెండ్ చేస్తూ మర్డర్ చేసిన మధుకర్ పై కూడా కేసు నమోదు చేయాలి అని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేస్తారు. ఇక జానకి ఎంతో సంతోషంగా భర్తను ఇంటికి తీసుకు వెళుతుంది. ఇక అత్తగారు ఆమెను చూసి చాలా సంతోషపడతారు. నేను కూడా ఇకనుంచి మీ బిడ్డనే అంటూ జానకి ఆప్యాయంగా మాట్లాడుతుంది. దీంతో జ్ఞానాంబ జానకిని దగ్గరకు తీసుకొని సంతోషపడుతుంది.

మే 12వ ఎపిసోడ్ : అయితే ఇప్పుడు మీ టైం బాగోలేదు అని కాస్త సైలెంట్ గా ఉంటేనే బెటర్ అని అతను చెప్పడంతో మనోహర్ మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు అంటూ సీరియస్ అవుతూ ఉంటాడు. తనను ఉద్యోగం నుంచి తొలగించాలి అనుకుంటే ఇప్పుడు నాకు ఉద్యోగం లేకుండా చేసింది అని అంత ఈజీగా జానకిని వదిలిపెట్టను అని తన కుటుంబాన్ని ఇంకా ఇబ్బంది పెడతాను అని చెబుతాడు. ఇక మరోవైపు జానకి తన భర్తను కౌగిలించుకొని ఏమాత్రం వదలకుండా అలానే పట్టుకుంటుంది. ఇక రామచంద్ర కూడా చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటాడు. అయితే జానకి మాత్రం తనకు ఇన్ని రోజులు ఎదురైనా చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక బాధపడకండి అని అంతా మంచి జరుగుతుంది అని ఎలాంటి కష్టాలు వచ్చిన కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెబుతాడు. మరి జానకి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











