Janaki Kalaganaledu Weekly Roundup: మల్లిక ప్లాన్స్ డిజాస్టర్.. అఖిల్ ప్రేయసితో సరికొత్త ట్విస్టులు

ఈ మధ్య కాలంలో టెలివిజన్ సీరియల్స్ లలో మంచి క్రేజ్ అందుకుంటున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు టాప్ లిస్ట్ లో ఉంది అని చెప్పవచ్చు. ఈ సీరియల్ రేటింగ్ కూడా రోజురోజుకు మరింత ఎక్కువగా పెరుగుతోంది. మొదట్లో ఈ సీరియల్ కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం
కూడా అంటే ఆగస్టు 15 నుంచి ఆగస్టు 19 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి చదువు విషయంలో జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

ఆగస్టు 15వ ఎపిసోడ్

ఆగస్టు 15వ ఎపిసోడ్

జ్ఞానాంబ జానకిని ఐపీఎస్ చదివించడానికి ఒప్పుకుంటుంది. అయితే జానకి చదువుకుంటున్న కాలేజ్ లోనే జ్ఞానాంబ చిన్న కొడుకు ప్రేమిస్తున్న అమ్మాయి కూడా ఉంటుంది. తన పేరు జెస్సి. అయితే ఒకరోజు జ్ఞానాంబ జెస్సిని ఆ కాలేజ్ లో చూసినప్పుడు ఆమె తీరు విధానం ఏమాత్రం నచ్చదు. ఆచారాలు మర్యాదలు ఆ పిల్లకు ఏమి తెలియవని జ్ఞానాంబ అనుకుంటుంది.

ఇక జెస్సి ఒక వ్యక్తికి అనుకోకుండా తగలడంతో అతని చేతిలో ఉన్న అన్నం బాక్స్ పడిపోతుంది. అది చూసిన జ్ఞానాంబ జెస్సి పై మరింత సీరియస్ అవుతుంది. వెళ్లి గొడవ పెట్టుకుంటుంది. భవిష్యత్తులో నీ లాంటి అమ్మాయి కోడలిగా వస్తే చుక్కలు చూపిస్తానని జ్ఞానాంబ అంటుంది. ఇక ఆ తరువాత అనుకోకుండా జెస్సితో జానకికి స్నేహం ఏర్పడుతుంది.

ఆగస్టు 16వ ఎపిసోడ్

ఆగస్టు 16వ ఎపిసోడ్

మల్లికా అర్ధరాత్రి ఆకలికి తట్టుకోలేక కిచెన్ లోకి వెళ్లాలని అనుకుంటుంది. ఇక ఆమెకు హాల్లో ఒక దెయ్యం తిరుగుతుంది అని అనిపిస్తుంది. వెంటనే ఇంట్లో అందరూ లేచే విధంగా కేకలు కూడా పెడుతుంది. ఏమైందో ఏమో అని అందరూ హాల్లోకి రాగానే మల్లిక తల పట్టుకుని కూర్చుంటుంది. ఇంట్లో దయ్యం తిరుగుతుంది అని చెప్పినప్పటికీ ఎవరు నమ్మరు. ఇక తర్వాత రామచంద్ర వచ్చి అది దయ్యం కాదు అని జానకి గారు చదువుకోడానికి నెత్తిపై ఒక లైట్ పెట్టుకున్నారు అని చెప్పడంతో మల్లిక ఆశ్చర్య పోతుంది. ఇక తర్వాత మల్లిక పరిస్థితిని చూసి అందరూ నవ్వుకుంటారు. మరోవైపు మామయ్య గోవిందరాజులు కూడా ఆమెపై సెటైర్లు వేస్తూ ఉంటాడు.

ఆగస్టు 17వ ఎపిసోడ్

ఆగస్టు 17వ ఎపిసోడ్

గుడి దగ్గర జానకికి ఊహించని సర్ ప్రైజ్ ఎదురవుతుంది. ఎందుకంటే అక్కడికి ఆమె సోదరుడు యోగి వస్తాడు. జానకి బాధపడుతుంది అని ప్రత్యేకంగా జ్ఞానాంబ అతనిని పిలిపిస్తుంది. గతంలో జరిగిన విషయాలు ఇంకా మరిచిపోలేను అని జానకి ఎంత చెప్పినా కూడా తనను క్షమించాలి అని యోగి బ్రతిమాలతాడు. అయినప్పటికీ కూడా జానకి ఏమాత్రం వెనుకడుగు వేయదు. నువ్వు మొదట నా చదువు విషయాన్ని దాచిపెట్టి నన్ను ఇబ్బంది పెట్టావు. ఆ తర్వాత నా భర్తను అవమానపరిచావు ఆ విషయాలు ఎలా మర్చిపోగలను అని జానకి మొండి పట్టుదలతో ఉంటుంది. దీంతో జ్ఞానాంబ ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తరువాత తన అన్నకు జానకి రాఖీ కడుతుంది.

ఆగస్టు 18వ ఎపిసోడ్

ఆగస్టు 18వ ఎపిసోడ్

మల్లిక ఎలాగైనా జానకి పై మరో నింద వేయాలని అనుకుంటుంది. గుడి దగ్గర జానకిని ప్రత్యేకంగా నైవేద్యంగా పొంగల్ చేయాలి అని జ్ఞానాంబ చెబుతుంది. ఇక అదే సమయంలో ఒక బాబు పాల కోసం ఏడుస్తూ ఉండడంతో జానకి కొన్ని పాలు ఆ బాబుకి ఇస్తుంది. ఇక అదే విషయాన్ని మల్లిక తన అత్తకు చెబుతుంది. పాలు ఎంగిలి అయ్యాయాని చెబుతుంది. ఇక జ్ఞానాంబ సీరియస్ అవ్వగానే ఆ బాబు తల్లి వచ్చి జానకి పాలు ఇవ్వకపోతే నా బాబు ఏమైపోయేవాడో అని ఆమెను తిట్టవద్దని జ్ఞానాంబకు చెబుతుంది. ఇక మానవ సేవే మాధవ సేవ అని పూజారి కూడా చెప్పడంతో జ్ఞానాంబ కోపం చల్లారుతుంది. దీంతో మల్లిక ప్లాన్ ఒక్కసారిగా రివర్స్ అవుతుంది.

ఆగస్టు 19వ ఎపిసోడ్

ఆగస్టు 19వ ఎపిసోడ్

మరోవైపు జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే వారు ఉన్న గుడికి అతని ప్రేయసి జెస్సి వస్తుంది. ఎప్పటినుంచో అఖిల్ కుటుంబ సభ్యులను కలుసుకోవాలని అనుకుంటున్న జెస్సి ఆ రోజు గుడిలో తన పుట్టినరోజు సందర్భంగా కలుసుకొని ప్రత్యేకంగా ఆశీర్వాదం కూడా తీసుకోవాలని అనుకుంటుంది. ఇక అఖిల్ హఠాత్తుగా ఆమెను చూసి వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఆ తర్వాత ఎప్పుడైనా వీలు చూసుకుని మా అమ్మకు నిన్ను పరిచయం చేస్తాను అని కంగారుపడుతూ చెబుతాడు. ఎంత చెప్పినా కూడా జెస్సి మాత్రం అక్కడ నుంచి వెళ్లదు. ఈరోజు మీ కుటుంబ సభ్యులను కలుసుకోవాల్సిందే అని జెస్సి చెబుతుంది. ఇక జెస్సిని చూసిన జానకి అఖిల్ తో ఉండడం చూస్తోంది. అక్కడి నుంచి అఖిల్ జంప్ అయ్యాక జెస్సి జానకి మాట్లాడుకుంటు ఉండగా ఇక అప్పుడే జ్ఞానాంబ వచ్చి జెస్సితో మాట్లాడేందుకు వీలు లేదని అనుకుంటుంది. ఇక ఫైనల్ గా జెస్సి.. అఖిల్ తల్లి జ్ఞానాంబ అని తెలుసుకుంటుంది. మరి ఈ విషయంలో జెస్సి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X