Janaki Kalaganaledu Weekly Roundup: జానకి పై పగ తీర్చుకొనేందుకు మల్లిక మరో ఎత్తు.. హై అలెర్ట్

టెలివిజన్ సీరియల్స్ లలో మంచి క్రేజ్ అందుకుంటున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు టాప్ లిస్ట్ లో ఉంది అని చెప్పవచ్చు. ఈ సీరియల్ రేటింగ్ కూడా రోజురోజుకు మరింత ఎక్కువగా పెరుగుతోంది. మొదట్లో ఈ సీరియల్ కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే ఆగస్టు 15 నుంచి ఆగస్టు 19 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి చదువు విషయంలో జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

 ఆగస్టు 22వ ఎపిసోడ్

ఆగస్టు 22వ ఎపిసోడ్

మల్లిక నుంచి ఇంట్లో ఒక గుడ్ న్యూస్ వస్తుంది. ఆమె తల్లి కాబోతోంది అని తెలియడంతో ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక ప్రత్యేకంగా ఈ సంతోషాన్ని సెలెబ్రేట్ చేసుకోవాలని కూడా జ్ఞానాంబ అనుకుంటుంది.

అయితే అప్పుడే ఆమె భర్త గోవిందరాజులు ఒక మాట చెబుతాడు. మొదట నువ్వు పెద్ద కోడలు జానకి కడుపు పండితే బాగుంటుంది కదా అని అనుకున్నావు అయితే ఇప్పుడు అందరిని పిలిచి సంబరాలు చేస్తే తోటి వాళ్ళు జానకిని మాటలతో ఏ విధంగా బాధపడతారో ఊహించవచ్చు అని గోవిందరాజులు అంటాడు. అయినా కూడా ఆ విధంగా ఆలోచించి మల్లికా ఆనందాన్ని దూరం చేయడం కూడా కరెక్ట్ కాదు అని జ్ఞానాంబ వివరిస్తుంది.

ఆగస్టు 23వ ఎపిసోడ్

ఆగస్టు 23వ ఎపిసోడ్

ఇక ఆ తరువాత మల్లికాను దీవించడానికి చుట్టూ పక్కల వాళ్ళు ఇంట్లోకి వస్తారు . అయితే అదే సమయంలో నీలావతి మరిన్ని మాటలతో బాధపెట్టే ప్రయత్నం చేస్తుంది . మీ పెద్ద కోడలు కూడా తొందరగా నెల తప్పితే బాగుంటుంది అని అనడంతో తోటి వాళ్లు కూడా ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని డాక్టర్ కి చూపించుకోవడం బెటర్ అని సలహాలు ఇస్తారు .

అంతేకాకుండా అమ్మాయిలో కాకుండా అబ్బాయిలు కూడా ఏదైనా లోపం ఉందేమో అని అనుమానాలు వచ్చేలా మాట్లాడడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది .

ఆగస్టు 24వ ఎపిసోడ్

ఆగస్టు 24వ ఎపిసోడ్

నిజానికి మల్లిక గర్భవతి కాదు. జానకి పై రివెంజ్ తీర్చుకునేందుకు అలా అబద్ధం చెబుతుంది. ఎదో ఒక సందర్భంలో తన కడుపు పోయేలా నాటకం ఆడాలి అని ఆ తరువాత ఆ పని జానకి చేసిందని నాటకం ఆడాలని అనుకుంటుంది.

ఇక మధ్యలో ఒకసారి మల్లిక కాలు జారీ కింద పడిపోగా డాక్టర్ ని పిలుస్తారు. ఇక డాక్టర్ నిజం చెప్పడంతో అసలు విషయం బయటపడుతుందని మల్లిక అనుకుంటుంది. కానీ అది కల అవుతుంది. ఇక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మల్లిక అనుకుంటుంది.

ఆగస్టు 25వ ఎపిసోడ్

ఆగస్టు 25వ ఎపిసోడ్

మరోవైపు కాలేజీకి వెళ్లిన జానకి అక్కడ జెస్సిని చూస్తుంది . ఒక విధంగా జెస్సి జానకి కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది . ఎలాగైనా అఖిల్ ను పెళ్లి చేసుకోవాలని అందుకు జానకి సహాయం కూడా తీసుకోవాలని అనుకుంటుంది . ఇక అందుకోసం జెస్సి కూడా చాలా వరకు చేంజ్ అవుతుంది . మొన్నటి వరకు మోడరన్ డ్రెస్సులలో కనిపించిన జెస్సి అఖిల్ తల్లి గారికి అలాంటి వేషధారణ నచ్చదు అని అందుకే తనను తాను పూర్తిగా మార్చుకోవాలని అనుకుంటుంది . అఖిల్ లేనిది తన జీవితం లేదు అని కూడా అనుకుంటుంది .

అయితే జానకి మాత్రం ఆ విషయంలో నువ్వు మరీ ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు అని మా అత్తగారు ఒక్కసారి ఏదైనా ఆలోచిస్తే దానికి తగ్గట్టుగా ఉంటారు అని నువ్వు అఖిల్ గురించి ఆలోచించకుండా ముందు నీ చదువు గురించి దృష్టి పెట్టు అని ఆ విషయం గురించి మర్చిపోవాలి అని కూడా అంటుంది . కానీ అఖిల్ లేకపోతే నేను బ్రతకలేను అంటూ అతన్ని పెళ్లి చేసుకుంటాను అని జెస్సి అంటుంది.

ఆగస్టు 26వ ఎపిసోడ్

ఆగస్టు 26వ ఎపిసోడ్

జానకి తెలియకుండానే ఆ ఫ్రూట్స్ సలాడ్ లో మల్లిక ముందుగానే బొప్పాయి పండు కలుపుతుంది. ఇక తర్వాత మల్లికా అది తింటూ ఉండగా అప్పుడే జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. ఒక్కసారిగా మల్లిక వాటిని తినకూడదు అని చెబుతుంది. ఎందుకంటే తల్లిగా ఉన్నవారు బొప్పాయి పండు తినకూడదు అని అది చాలా ప్రమాదం అని కూడా చెప్పడంతో జానకి తనకు కావాలని ఇచ్చి ఉండవచ్చు అని మల్లికా అనుమానం వ్యక్తం చేస్తుంది.

తనకు ముందుగా పిల్లలు కారేమో అని కారణం చేత అసూయ చెంది ఇలా ఇచ్చి ఉండవచ్చు అని కూడా ఉంటుంది. తర్వాత మల్లిక భర్త విష్ణు వచ్చి ఆ బొప్పాయి పండు నేనే కలిపాను అని చెబుతాడు. నిజానికి తల్లిగా ఉన్నవారు బొప్పాయి పండు తింటే మంచిది కాదన్న విషయం నాకు తెలియదు అని ఏదో ఆరోగ్యానికి మంచిది కదా అని అందులో కలిపాను అని అంటాడు.

అందుకు తల్లికి క్షమాపణలు కూడా చెబుతాడు. ఇక తర్వాత విష్ణు తన భార్యను గదికి తీసుకువెళ్ళి నువ్వు అందులో బొప్పాయి పండు కలపడం నేను చూశాను అనవసరంగా వదినపై నింద వేయడానికి ప్రయత్నం చేశావు అది ఎంత మాత్రం మంచిది కాదు అని చెబుతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X