Janaki Kalaganaledu Weekly Roundup: అఖిల్ లవర్ సమస్యలో జానకి.. ప్రెగ్నెన్సీ టెన్షన్ లో జెస్సి

టెలివిజన్ సీరియల్స్ లలో మంచి క్రేజ్ అందుకుంటున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు టాప్ లిస్ట్ లో ఉంది అని చెప్పవచ్చు. ఈ సీరియల్ రేటింగ్ కూడా రోజురోజుకు మరింత ఎక్కువగా పెరుగుతోంది. మొదట్లో ఈ సీరియల్ కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 26 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి చదువు విషయంలో జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

ఆగస్టు 29వ ఎపిసోడ్

ఆగస్టు 29వ ఎపిసోడ్

అఖిల్ ప్రేమించిన జెస్సి గర్భవతి అవుతుంది. ఆమె తండ్రి ఎంత అడిగినా కూడా జెస్సీ సమాధానం చెప్పదు. సాయంత్రం లోపు అతను ఎవరో చెప్పాలి అని హెచ్చరిస్తాడు. ఇక జెస్సీ మాత్రం అఖిల్ పేరు చెప్పదు. ఇక మరోవైపు అఖిల్ తన కుటుంబ సభ్యులతో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ లో చాలా సంతోషంగా ఉంటాడు.

అందరూ కోలాటం ఆడుతూ ఉంటే మల్లికా మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది. తాను కూడా కోలాటం ఆడతాను అంటుంది. కడుపుతో ఉన్నావు కాబట్టి నువ్వు అలా ఆటలు ఆడకూడదు అని అత్తగారు చెబుతారు. ఇక ఈ తరుణంలో జానకి పై మల్లికా మరింత కోపం పెంచుకుంటుంది.

ఆగస్టు 30వ ఎపిసోడ్

ఆగస్టు 30వ ఎపిసోడ్

అఖిల్ కోసం జెస్సి వెతుకుతూ ఉండగా హఠాత్తుగా ఆమెను అక్కడి నుంచి ఇంటి వెనకాల వైపుకు తీసుకువెళ్తాడు. ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చావు అని అఖిల్ అంటాడు. అంతేకాకుండా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను నిన్ను తర్వాత కలుస్తాను అని అంటాడు. అయితే ఆ తర్వాత జెస్సి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ నేను గర్భవతి అయ్యాను అని చెబుతుంది. దీంతో ఒక్కసారి అఖిల్ మైండ్ బ్లాక్ అవుతుంది. నువ్వు చెప్పేది నిజమా అంటూ ఆశ్చర్యపోతాడు.

అవును నేను మనం కలుసుకున్న రోజు ఎంత చెప్పినా కూడా వినకుండా తొందరపడ్డావు ఏమీ కాదు అని నచ్చజెప్పావు. కానీ ఇప్పుడు విషయం చాలా సీరియస్ గా మారిపోయింది. ఇంట్లో కూడా తెలిసిపోయింది ఎవరో చెప్పాలి అని నన్ను ఇంట్లో కొడుతున్నారు అంటూ జెస్సి చెబుతుంది. ఇక వారిని జానకి గమనిస్తుంది.

ఆగస్టు 31వ ఎపిసోడ్

ఆగస్టు 31వ ఎపిసోడ్

నిజానికి మల్లిక గర్భవతి కాదు. జానకి పై రివెంజ్ తీర్చుకునేందుకు అలా అబద్ధం చెబుతుంది. ఎదో ఒక సందర్భంలో తన కడుపు పోయేలా నాటకం ఆడాలి అని ఆ తరువాత ఆ పని జానకి చేసిందని నాటకం ఆడాలని అనుకుంటుంది.

ఇక మధ్యలో ఒకసారి మల్లిక కాలు జారీ కింద పడిపోగా డాక్టర్ ని పిలుస్తారు. ఇక డాక్టర్ నిజం చెప్పడంతో అసలు విషయం బయటపడుతుందని మల్లిక అనుకుంటుంది. కానీ అది కల అవుతుంది. ఇక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మల్లిక అనుకుంటుంది.

సెప్టెంబర్ 1వ ఎపిసోడ్

సెప్టెంబర్ 1వ ఎపిసోడ్

ఇక అఖిల్ ఆ సమయంలో చాలా టెన్షన్ గా ఉన్నట్లుగా జానకి గమనిస్తుంది. ఇక అఖిల్ జెస్సి మధ్యలో ఏం జరిగిందని వీలైనంత తొందరగా ఆ విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక అఖిల్ టెన్షన్ పడుతూ బయట హడావిడిగా తిరిగుతూ ఉండడంతో జానకి అడుగుతుంది. కానీ అఖిల్ మాత్రం అసలు విషయం చెప్పడు. జెస్సి ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. కానీ అందుకు అఖిల్ ఆమె ఎదో తన ఫ్రెండ్ ఇంటికి వచ్చి నన్ను క్యాజువల్ గా కలిసింది అని మరో అబద్ధం చెబుతాడు.

ఇక జానకి మరింత అనుమానిస్తుంది. అఖిల్ ను అంత ఈజీగా నమ్మడానికి వీలు లేదని వెంటనే అతని బెడ్ రూమ్ ని చెక్ చేస్తుంది. అఖిల్ చేడు దారులు తిరగకుండా ఉండాలి అని అత్త మామ అలాగే రామగారు అతని మీదే ఆశలు పెట్టుకున్నారు కాబట్టి అఖిల్ ని మంచి దారిలో పెట్టాలని జానకి ఆలోచిస్తుంది.

సెప్టెంబర్ 2వ ఎపిసోడ్

సెప్టెంబర్ 2వ ఎపిసోడ్

వెంటనే జానకి ఫోన్లో ఉన్న ఫోటోలను అఖిల్ డిలీట్ చేస్తాడు. ఇక మధ్యలో జానకి లేచినప్పటికీ అతను మంచం కింద దూరి.. ఆ తర్వాత మళ్లీ వచ్చి మరికొన్ని ఫోటోలను డిలీట్ చేస్తాడు. ఇక పని పూర్తయిన తర్వాత అఖిల్ హాల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర గ్లాస్ తగిలి కింద పడిపోవడంతో అప్పుడే నీళ్లు తాగడానికి వచ్చిన తల్లి జ్ఞానాంబ అఖిల్ ను చూస్తుంది.

అంతే కాకుండా ఆమె లైట్ వేయగానే అఖిల్ టెన్షన్ పడుతూ కనిపిస్తాడు. ఎందుకు ఇంత అర్ధరాత్రి లేచావని జ్ఞానాంబ అడుగుతుంది. మీరు నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కదామ్మా.. అందుకే నిద్రపోకుండా చదువుకుంటున్నాను అని పక్కనే ఉన్న ఒక పుస్తకాన్ని చూపిస్తాడు. ఇక కొడుకు చదువుకుంటున్నాడు అని జ్ఞానాంబ ఎంతో సంతోషపడుతుంది. అంతేకాకుండా నీకు కాఫీ పెట్టిస్తాను ఉండు అని చెబుతుంది. ఇక ఆ తర్వాత జానకి నిద్ర లేచి చూశాక ఫోన్ ఎవరు తీసినట్లు అనుమానం వస్తుంది. మరి అఖిల్ డిలీట్ చేసిన విషయాన్ని కనుగొంటుందా లేదా అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X