Janaki Kalaganaledu Weekly Roundup: కథలోకి కొత్త క్యారెక్టర్ జెస్సి.. జ్ఞానాంబ భవిష్యత్తు సవాల్!
ఈ మధ్య కాలంలో టెలివిజన్ సీరియల్స్ లలో మంచి క్రేజ్ అందుకుంటున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు టాప్ లిస్ట్ లో ఉంది అని చెప్పవచ్చు. ఈ సీరియల్ రేటింగ్ కూడా రోజురోజుకు మరింత ఎక్కువగా పెరుగుతోంది. మొదట్లో ఈ సీరియల్ కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం
కూడా అంటే ఆగస్టు 8 నుంచి ఆగస్టు 12 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి చదువు విషయంలో జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

ఆగస్టు 8వ ఎపిసోడ్
మొత్తానికి జ్ఞానాంబ జానకిని ఐపీఎస్ చదివించడానికి ఒప్పుకుంటుంది. అయితే జానకి విషయంలో అలాంటి నిర్ణయం తీసుకోవడంతో చిన్న కోడలు మల్లిక మాత్రం కొంచెం కూడా సహించదు. పెద్ద కోడలికి చదువుకునే అవకాశం ఇస్తే ఆమె ఐపిఎస్ అయిన తర్వాత మరింత ఉన్నత స్థాయికి చేరుతుంది అని తట్టుకోలేక పోతుంది. అందుకే కావాలని తప్పులో జానకిని ఇరికించాలి అని ఎలాగైనా ఐపిఎస్ చదువుకు ఇబ్బంది కలిగించాలని అనుకుంటుంది.

ఆగస్టు 9వ ఎపిసోడ్
జానకి పుస్తకాలను తీసుకువచ్చిన మల్లిక ఎవరికి తెలియకుండా వాటిని ఒక పూజ సామాను ఉన్న బీరువాలో పెడుతుంది. అలాగే జ్ఞానంబకు ఎంతో పవిత్రమైన కొన్ని భక్తి వస్తువులను కూడా కింద పడేస్తుంది. అయితే అది జానకి చేసింది అని మల్లికా నిందలు వేయాలని అనుకుంటుంది. కానీ ఆ తర్వాత జానకి తెలివిగా ప్రవర్తించే మల్లికా చేతనే అసల నిజం చెప్పిస్తుంది. మల్లిక చేతికి పసుపు ఉండడంతో అత్తగారి ముందు రెడ్ హ్యాండెడ్ గా పట్టించేస్తుంది. ఆ తర్వాత మల్లికా ఏమి చేయలేని పరిస్థితుల్లో అత్త కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుతుంది.

ఆగస్టు 10వ ఎపిసోడ్
అయితే అత్త మీద మరింత కోపం తెచ్చుకున్న మల్లిక ఇంట్లో కనీసం చికెన్ కూడా తినడానికి వీలు లేదు అని ఆచారాలపై అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే అత్తగారికి చిన్న కోడలు మాత్రం పూర్తిగా నాన్ వెజ్ తినే అమ్మాయి రావాలి అని కోరుకుంటుంది. ఇక ఆమె కోరుకున్నట్లైతే జెస్సి అని ఒక క్యారెక్టర్ ఈ కథలోకి ఎంట్రీ ఇస్తుంది. అయితే ఇదివరకే జానకితో జెస్సికి మంచి పరిచయం ఏర్పడుతుంది. జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ ఆమెతో ప్రేమను కొనసాగిస్తూ ఉంటాడు.

ఆగస్టు 11వ ఎపిసోడ్
ఇక ఎవరికీ తెలియకుండా మల్లిక చికెన్ తినాలని అనుకుంటుంది అలాగే భర్త చేత బయట నుంచి మాంసం తెప్పించుకుంటుంది. ఇక ఇంట్లో తినకూడదు అని బయట తినాలి అని జ్ఞానాంబ చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా మల్లిక ఏమాత్రం పట్టించుకోదు. ఇక చివరికి మరోసారి జ్ఞానంభ కంట పడడంతో ఆమె మల్లికాకు శిక్ష వేస్తుంది. ఇంట్లో అసలు అన్నం కూడా తినడానికి వీలులేదు అని రెండు రోజులపాటు ఉపవాసం ఉండాలి అని పనిష్మెంట్ ఇస్తుంది. కానీ మల్లిక మాత్రం అత్తకు తెలియకుండా ఇంట్లో భోజనం చేయాలి అని పలు రకాల ప్రణాళికలు కూడా రచిస్తూ ఉంటుంది.

ఆగస్టు 12వ ఎపిసోడ్
ఫైనల్ గా భవిష్యత్తులో జ్ఞానంబకు రాబోయే మూడవ కోడలితో పరిచయం ఏర్పడుతుంది. అయితే ఈ పరిచయం గొడవతో ఏర్పడడం ఆసక్తికరంగా మారింది. అఖిల్ ప్రేమలో ఉన్న జెస్సి కాలేజీలోనే జానకి కూడా జాయిన్ అవుతుంది. జ్ఞానంబనే ఆ కాలేజీలో జానకిని చేర్పిస్తుంది. అయితే ఈ క్రమంలో జెస్సీ ఇతర అమ్మాయిల ఏడిపించడం అలాగే ఒక వాచ్మెన్ తింటున్న భోజనానికి కింద పడేయడం వంటి అంశాలు జ్ఞానంబకు చాలా కోపాన్ని తెప్పిస్తాయి. దీంతో ఆమె జెస్సి ఎవరో తెలియక పోయినప్పటికీ కూడా తనతో గొడవ దిగడానికి సిద్ధమవుతుంది. భవిష్యత్తులో నీలాంటి కోడలు నాకు వస్తే చుక్కలు చూపిస్తానంటు వార్నింగ్ ఇస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











