Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Janaki Kalaganaledu Weekly Roundup: సీమంతం వేడుకలో మల్లిక దొంగతనం.. జానకిలో హై టెన్షన్
జానకి కలగనలేదు సీరియల్ డిసెంబర్ మూడవ వారం వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త నీరసంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 16 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

డిసెంబర్ 12వ ఎపిసోడ్
సునంద దేవి ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఆ తర్వాత కన్నబాబు వచ్చినప్పటికీ అతనిపై కూడా జానకి సీరియస్ అవుతుంది. మరోసారి నా కుటుంబం దగ్గరికి వస్తే ఏ మాత్రం వదిలిపెట్టను అని జానకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జానకి అత్తగారి పరిస్థితిని చూసి షాక్ అవుతుంది. జ్ఞానాంబ తన మనవళ్ళతో ఆడుకోవాలని ఎంతగానో ఆశపడుతుంది. అయితే మల్లిక కడుపు పోయింది అని అబార్షన్ అయింది అని తెలియడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతేకాకుండా పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది.
ఇక జానకి ఆ పరిస్థితిని చూసి ఎంతగానో బాధపడుతుంది. మల్లికా చేసిన మోసం గురించి కూడా ఆలోచిస్తుంది. ఇక ఆ తర్వాత రోజు చిన్న కోడలు వెన్నెల కూడా కడుపుతో ఉండడం వలన ఆమెకు సీమంతం చేయాలని అనుకుంటారు. అందుకోసం తగిన ఏర్పాట్లు కూడా చేయవలసిందిగా జ్ఞానాంబ తన కొడుకులకు చెప్తుంది.

డిసెంబర్ 13 వ ఎపిసోడ్
జ్ఞానాంబ మరుసటి రోజు జెస్సికి సీమంతం చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయాలి అని రామచంద్రతో చెబుతుంది. ఇక వెంటనే జ్ఞానాంబ జెస్సి తండ్రికి కూడా ఫోన్ చేసి చెబుతుంది. అయితే జెస్సి తల్లి మాత్రం కేరళ వెళ్లింది అని అతను చెప్పడంతో మేరీ గారు వచ్చిన తర్వాత సీమంతం చేద్దామని జ్ఞానాంబ చెబుతుంది.
అయితే తమవల్ల ఆ వేడుక ఆగిపోకూడదు అని మీరు జరిపించండి అని చెప్పడంతో జ్ఞానాంబ అందుకు ఒప్పుకుంటుంది. ఇక మరుసటి రోజు అందరూ కూడా సీమంతం వేడుకలతో హడావిడిగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలో జానకి రామచంద్ర మధ్యలో మరో రొమాంటిక్ సన్నివేశం చోటు చేసుకుంటుంది.

డిసెంబర్ 14 వ ఎపిసోడ్
ఈ క్రమంలో పనుల హడావిడిలో ఉన్న రామచంద్ర ఒక్కసారిగా జానకికి తగలడంతో ఆమె కింద పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రామచంద్ర ఆమెను రొమాంటిక్ స్టిల్ తో పట్టుకుంటాడు. ఇక వారిని చూసిన పనిమనిషి సరదాగా కామెంట్ చేస్తూ ఉంటుంది. అనంతరం వెంటనే జానకి అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది.
జెస్సి కడుపులో బిడ్డకు సంబంధించిన కొన్ని టెస్టులు చేసాము అని 80% నమ్మకం లేదు అని మా ప్రయత్నాల మేము చేస్తామని వైద్యులు చెప్పడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతేకాకుండా రిపోర్ట్స్ ను మీ ఇంటికి నర్సు చేత పంపించాము అని డాక్టర్ చెప్పడంతో జానకి మరింత కంగారుపడుతుంది. అయితే ఆ రిపోర్ట్స్ డైరెక్టుగా వెళ్లి జ్ఞానాంబ చేతిలో పడతాయి.

డిసెంబర్ 15వ ఎపిసోడ్
ఎలాగైనా వాటిని తీసుకొని అందులో ఏముందో తెలుసుకోవాలని ఆమె అనుకుంటుంది. ఇక సీమంతం వేడుకలో అందరిని దాటుకుంటూ మల్లిక మెల్లగా జానకి గదిలోకి వెళుతుంది. ఇక జానకి దాచిపెట్టిన రిపోర్ట్స్ తీసుకున్న మల్లికా అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతుంది.
అయితే మల్లికపై జానకి కూడా కొంత అనుమానం వస్తుంది. వెంటనే ఆమె కనిపించకపోవడంతో తన గదికి వెళ్ళిన జానకి రిపోర్ట్స్ ఉన్నాయో లేవో చూడాలని అనుకుంటుంది. ఇక బీరువా తెరిచి చూడగా అక్కడ రిపోర్ట్స్ కనబడవు. దీంతో జానకి ఒక్కసారిగా మళ్ళీ షాక్ అవుతుంది.

డిసెంబర్ 16వ ఎపిసోడ్
మల్లిక తన గదిలో దాచిపెట్టిన రిపోర్ట్స్ ను తీసుకొని వాటిలో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటుంది. అయితే ఆమెకు ఇంగ్లీష్ రాకపోవడంతో వాటిని ఎవరి చేత చదివించాలి.. ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంది. ఇక తర్వాత ఈ విషయాన్ని డైరెక్ట్ గా జెస్సిని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది అని చూస్తుంది. ఇక ఆ రిపోర్ట్స్ జెస్సి కంటపడితే తట్టుకోలేదు అని జానకి అనుకుంటుంది.
మరి మల్లికను ఆమె ఎలా అడ్డుకుంటుందో చూడాలి. అలాగే అఖిల్ విషయంలో కూడా జానకి రామచంద్రకు ఒక సలహా ఇస్తుంది. కానీ అతను సీరియస్ అవుతాడు. మరి ఈ పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.