Janaki Kalaganaledu Weekly Roundup: అఖిల్ కోసం మరో పొరపాటు చేసిన రామచంద్ర.. ట్విస్ట్ ఇచ్చిన జానకి!

జానకి కలగనలేదు సీరియల్ డిసెంబర్ నాలుగవ వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త నీరసంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 23 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

డిసెంబర్ 19వ ఎపిసోడ్

డిసెంబర్ 19వ ఎపిసోడ్

అఖిల్ తప్పుగా అర్థం చేసుకోవడంతో జానకి కాస్త బాధపడుతుంది. ఇక తర్వాత అఖిల్ కూడా ఏదో ఒక జాబ్ చేయాలి అని లేకపోతే వదినా తనపై ఇలానే ఏదో ఒకటి చెబుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక జెస్సి తన దగ్గర టాబ్లెట్స్ లేకపోవడంతో జానకికి చెప్పాలి అని అనుకుంటుంది. కానీ అఖిల్ మాత్రం నేను టాబ్లెట్స్ తీసుకు వస్తాను అని అంటాడు.

అంతేకాకుండా జాబ్ సెర్చింగ్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తాను అని అంటాడు. ఇక రామచంద్ర తన చిన్ననాటి స్నేహితుడు ఒకడు కలిసి అఖిల్ కు జాబ్ ఇప్పిస్తాను అన్నాడు అని తన కార్డు కూడా ఇచ్చాడు అని దాన్ని మీరే అఖిల్ కు ఇవ్వాలి అని జనాకికి చెబుతాడు. కానీ జానకి మాత్రం ఇవ్వలేను అని అంటుంది.

డిసెంబర్ 20వ ఎపిసోడ్

డిసెంబర్ 20వ ఎపిసోడ్

మరోవైపు జానకి ఇంట్లో సమస్యల గురించి ఆలోచిస్తూ చదువును పక్కన పెడుతుంది. దీంతో వెంటనే ప్రిన్సిపల్ వచ్చి నువ్వు మరో రెండు నెలల్లో మెయిన్స్ పరీక్షలు రాయాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు కాస్త సీరియస్ గా చదువుపై దృష్టి పెట్టాలి అని సలహా ఇస్తుంది. దీంతో జానకి మళ్ళీ చదువుపై శ్రద్ధ పెడుతుంది. ఇక రామచంద్రా ఇంటికి రాగానే తన స్నేహితుడి ఇచ్చిన కార్డు గురించి జానకితో చెబుతాడు. అతను జాబ్ ఇస్తానని అన్నాడు అని దాని గురించి నువ్వు అఖిల్ తో చెప్పాలి అని భార్యకు చెబుతాడు. కానీ అతనికి మాత్రం నేను చెప్పలేను అని అంటుంది.

డిసెంబర్ 21 వ ఎపిసోడ్

డిసెంబర్ 21 వ ఎపిసోడ్

ఇక అఖిల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ సమయంలో అఖిల్ కూడా ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ ఉంటాడు. అయితే అఖిల్ ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత సైలెంట్ గా బయటకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత రామచంద్ర మళ్ళీ అదే ఆఫీసుకు వచ్చి తన స్నేహితున్ని కలుస్తాడు. అఖిల్ గురించి చెబుతాడు. ఇక మరోవైపు జానకి తన తల్లిదండ్రుల ఆప్తికం ఉంది అని మా అన్నయ్య వదినలకు ఫోన్ చేశారు అని వెళ్లాలి అని అంటుంది. అయితే తనకు ఆలస్యం అవుతుంది అని ఇప్పట్లో రాలేను అని నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని అంటాడు.

డిసెంబర్ 22వ ఎపిసోడ్

డిసెంబర్ 22వ ఎపిసోడ్

ఇంట్లో వాళ్ళు అందరూ కూడా అఖిల్ జాబ్ కోసం ఆలోచిస్తున్నారు అని రామచంద్ర తమ్ముడి కోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. అందుకోసం అతను మళ్ళీ ఒక పొరపాటు చేస్తాడు. ఇంటి కి సంబంధించిన పేపర్లను ఒక దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతాడు. అయితే రామచంద్ర గతంలో మాదిరిగానే ఒక తెల్ల పేపర్ మీద సంతకం పెట్టడానికి ఒప్పుకుంటాడు. గతంలో కన్నబాబు మరొక వ్యక్తి చేత రామచంద్ర షాప్ కు సంబంధించిన పేపర్లు పెట్టుబడిగా పెట్టుకొని అప్పులు ఇస్తాడు. ఇప్పుడు మరోసారి తమ్ముడు అఖిల్ కోసం రామచంద్ర కొన్ని ఆస్తి పత్రాలను మరొక చోట తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవాలని అనుకుంటాడు.

డిసెంబర్ 23వ ఎపిసోడ్

డిసెంబర్ 23వ ఎపిసోడ్

మరో మూడు నెలల్లోనే ఈ డబ్బు మొత్తం వెనక్కి వచ్చేలా చేస్తాను అని కూడా అంటాడు. దీంతో రామచంద్ర కొంత సంతోషిస్తాడు. ఆ తరువాత మరోవైపు జానకి తన తండ్రి అప్తికంలో పాల్గొంటూ రామచంద్ర రాకపోవడంతో కొంత బాధపడుతూ ఉంటుంది. అయితే ఇంట్లో అఖిల్ ఉద్యోగం గురించి తన అన్నయ్యకు చెప్పడంతో అఖిల్ కు యోగి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక జానకి ఇంటికి వచ్చిన తర్వాత రామచంద్ర అసలు విషయం చెబుతాడు. అఖిల్ ఉద్యోగం కోసం 20 లక్షల అవసరం పడటంతో నేను ఇల్లు తాకట్టుపెట్టి డబ్బులు ఇచ్చాను అని ఇక వాడికి ఉద్యోగం చేసినట్టే అని చెబుతాడు. దీంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే ఈ విషయాన్ని అత్తయ్య గారితో చెబుతాను అని అంటుంది. మరి జానకి చెప్పిన తరువాత ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X