Janaki Kalaganaledu Weekly Roundup: మళ్ళీ ఐపీఎస్ డ్రీమ్ ను వదిలేసిన జానకి.. ఊహించని ట్విస్టులు!

జానకి కలగనలేదు సీరియల్ నవంబర్ మూడవ వారం వారం మరింత ఆసక్తికరమైన ట్విస్ట్ లతో కొనసాగుతోంది. ఈ సీరియల్ మొదట్లో కాస్త నిరుత్సాహంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే నవంబర్ 14 నుంచి నవంబర్ 18వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

అక్టోబర్ 14వ ఎపిసోడ్

అక్టోబర్ 14వ ఎపిసోడ్

మల్లిక జానకిని మరింత ఇబ్బంది పెట్టాలని జరిగిన విషయం మొత్తాన్ని కూడా అఖిల్ అత్తమామలకు చెబుతుంది. మీరు అనవసరంగా జానకి దేవత అనుకున్నారు కానీ ఆమె మీ అబ్బాయిని హత్యాయత్నం నేరం కింద అరెస్టు చేయించింది అని చెబుతుంది. ఇక మరోవైపు రామచంద్ర తన తమ్ముడికి బెయిల్ రప్పించే విధంగా లాయర్ తో వెళ్లి మాట్లాడుతాడు.

అయితే ఎఫ్ఐఆర్ నమోదయిందని చెప్పడంతో లాయర్ అందుకు సంబంధించిన కాపీని తీసుకురమ్మని చెబుతాడు. అంతే కాకుండా ఎవరైతే కేసు పెట్టారో వారిని కేసు వెనక్కి తీసుకునే విధంగా ఒప్పించాలి అని కూడా లాయర్ చెప్పాడు. ఇక రామచంద్ర మరోసారి జానకిని బ్రతిమాలేదుకు ఇంటికి వెళతాడు. మీరు ఒకసారి కుటుంబం పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి అని చెబుతాడు.

నవంబర్ 15వ ఎపిసోడ్

నవంబర్ 15వ ఎపిసోడ్

జ్ఞానాంబ చిన్న కోడలు జెస్సి ఒక దగ్గర కూర్చుని ఉండగా మల్లిక వెళ్లి ఆమెతో కొన్ని అబద్ధాలు చెబుతుంది. జానకి పై కోపం రగిలించాలి అని.. ఇప్పుడు అఖిల్ కు బేయిల్ రాకపోతే అతనికి ఉరిశిక్ష పడే అవకాశం ఉంది అని ఊళ్లో వాళ్ళందరూ అనుకుంటున్నట్లుగా ఆమె అబద్దాలు చెబుతుంది. ఇక అదే విషయాన్ని పక్కనే ఉన్న రామచంద్ర కూడా వింటాడు. వెంటనే వెళ్లి రామచంద్ర జానకి తో మరోసారి సీరియస్ గా మాట్లాడుతాడు. మీరు ఎలాగైనా సరే కేసు వెనక్కి తీసుకోవాలి అని అంటాడు. అయితే జానకి మాత్రం ఈ విషయంలో క్షమించండి రామ గారు అంటూ నా నిర్ణయంలో ఇలాంటి మార్పు లేదు అని చెబుతోంది.

నవంబర్ 16వ ఎపిసోడ్

నవంబర్ 16వ ఎపిసోడ్

కేసు ఎంత మాత్రం వెనక్కి తీసుకోకూడదు అని ఒక ఆడపిల్లకు అన్యాయం చేయకూడదు అని.. కాబోయే పోలీస్ ఆఫీసర్ గా నేను అలాంటి నిర్ణయం తీసుకుంటే నేను చదివిన చదువు అర్థం ఉండదని జానకి అనుకుంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని జానకి బాధపడుతుంది.

అంతేకాకుండా ఈ కేసు విషయంలో నా చదువు కారణంగానే ఇంట్లో బాధలు ఏర్పడుతున్నాయి కాబట్టి నేను కేసును వెనక్కి తీసుకుంటాను. అలాగే నా ఎపిఎస్ చదువును కూడా ఇంతటితో వదిలేస్తాను అని జానకి రామచంద్ర తో చెప్పాలని అనుకుంటుంది. అయితే ఆమె మాట్లాడుతున్నప్పుడు రామచంద్ర మాటలు పట్టించుకోకుండా బయటికి వెళ్లిపోతాడు. ఇక తర్వాత జానకి రామచంద్ర తో పాటు పోలీస్ స్టేషన్కు వెళుతుంది.

నవంబర్ 17 వ ఎపిసోడ్

నవంబర్ 17 వ ఎపిసోడ్

అయితే అప్పుడే తన మనసులో ఐపీఎస్ అవ్వడానికి చేసిన వాగ్దానం గుర్తుకు వస్తూ ఉంటుంది. కుటుంబ భేదాలు చూపను అని న్యాయం కోసం కృషి చేస్తానని ప్రమాణం చేసిన విషయాలు గుర్తుకు వస్తాయి. ఇక చేసేదేమీ లేక జానకి తన నిర్ణయం మార్చుకుంటుంది. ఇక అఖిల్ ఎట్టకేలకు ఇంటికి వస్తాడు. దీంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే జానకి మాత్రం చదువును పూర్తిగా వదిలేస్తుంది. కానీ వదిలేస్తున్నట్లు కనిపించదు. రామ మాత్రం ఆమెను కాలేజ్ కు వెళ్ళమని చెబుతూ ఉంటాడు.

నవంబర్ 18వ ఎపిసోడ్

నవంబర్ 18వ ఎపిసోడ్

తర్వాత రామచంద్ర, జానకిని మళ్లీ ఎప్పటిలానే ఐపీఎస్ కోచింగ్ కోసమని కాలేజ్ లో దింపాలి అని అనుకుంటాడు. కానీ జానకి మాత్రం మాట మారుస్తూ నాకు వేరే పని ఉంది అని చెబుతూ ఉంటుంది. ఇక మరోవైపు జెస్సి ఇల్లు తుడుస్తూ కిందపడే ప్రమాదంలో ఉంటుంది. ఇక మరొకవైపు రామచంద్ర జానకి విషయంలో సీరియస్ గా అడిగే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు చదువుకోవడం లేదు అని అడుగుతాడు.

దీంతో జానకి నాకు ఐపిఎస్ చదువు ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా అంటే కుటుంబమే ముఖ్యం అనే ఆలోచనకు వచ్చాను. అందుకే చదువు వదిలేసాను అని చెబుతుంది. మరి ఆమె నిర్ణయం పై రామచంద్ర ఎలా స్పందిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X