Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Janaki Kalaganaledu Weekly Roundup: జానకి మనసు మార్చేందుకు రామ విశ్వ ప్రయత్నాలు.. అఖిల్ నాటకాలు
జానకి కలగనలేదు సీరియల్ నవంబర్ మూడవ వారం వారం మరింత ఆసక్తికరమైన ట్విస్ట్ లతో కొనసాగుతోంది. ఈ సీరియల్ మొదట్లో కాస్త నిరుత్సాహంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే నవంబర్ 14 నుంచి నవంబర్ 18వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

అక్టోబర్ 21వ ఎపిసోడ్
జానకి కాలేజీకి వెళుతుందా లేదా అనే విషయం తెలుసుకోవాలి అని రామచంద్ర కాలేజ్ కి వెళతాడు. అక్కడ జానకి స్నేహితులు అని అడిగే ప్రయత్నం చేస్తాడు. జానకి కాలేజీకి వచ్చిందా లేదా అని అడిగితే వాళ్ళు ఈరోజు రాలేదు అని అనడంతో మళ్లీ వెంటనే రామచంద్ర ఇంటికి వస్తాడు. ఇక మరోవైపు మల్లికకు నిలావతి ఫోన్ చేస్తుంది. అసలు విషయం ఇంట్లో తెలిసిందేమో అని కంగారుగా ఉంది నీ దొంగ ప్రెగ్నెన్సీ గురించి జానకి కనిపెట్టిందేమో అని ఆమె హెచ్చరిక చేస్తుంది. అయితే ఆమె అనవసరంగా టెన్షన్ పడుతుంది అని మల్లికా ఎంత మాత్రం తెలియలేదు అని చెబుతోంది. పగ తీర్చుకోవాలని అనుకున్నా మల్లిక అనవసరంగా దొంగ ప్రెగ్నెన్సీ విషయం తెలియడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఇక మరోవైపు రామచంద్ర జానకి అసలు చదువు గురించి ఎందుకు ఆలోచించడం లేదు అని అడుగుతుంది. నేను చదవాలని అనుకోవడం లేదు అని జానకి సమాధానం ఇస్తుంది. మరి వారి మధ్య మాటల సంఘర్షణ ఎలాంటి నిర్ణయాలకు దారితీస్తుందో చూడాలి.
Janaki
Kalaganaledu
November
21st:
జానకి
చదువు
విషయంలో
రామ
సందేహాలు..
మరో
షాకింగ్
ట్విస్ట్!

నవంబర్ 22వ ఎపిసోడ్
అయితే అప్పుడే అక్కడికి జానకి వదిన తన కొడుకుతో వస్తుంది. బాబుకు కూడా జానకి తండ్రి పేరు పెట్టడంతో ఎమోషనల్ అవుతుంది. అప్పుడే తండ్రి కి చేసిన వాగ్దానం మాట కూడా గుర్తుకొస్తుంది. నువ్వు ఎలాగైనా ఐపీఎస్ అయితే నేను పైనుంచి చూస్తాను అని తండ్రి చెప్పిన మాటలు ఆమెకు గుర్తుకు వస్తాయి. ఇక ఏం జరిగింది అని ఎందుకు అలా ఉన్నావు అని జానకి వదిన అడిగే ప్రయత్నం చేస్తుంది. మరి జానకి తన వదినకు అసలు నిజం చెబుతుందో లేదో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.
Janaki
Kalaganaledu
November
22nd:
చదువుకు
దూరమవుతున్న
జానకి..
కలచివేస్తున్న
తండ్రి
మాటలు!

నవంబర్ 23వ ఎపిసోడ్
మరోవైపు అఖిల్ తన మంచితనంతో ఇంట్లో నటిస్తూనే ఉంటాడు. ఇంట్లో కొన్ని రోజులుగా పరిస్థితులు బాగోలేకపోవడంతో మీరిద్దరూ అసలు సంతోషంగా లేరు అని అందుకే నీ భార్యని తీసుకొని మీ అత్తగారింటికి వెళ్లి రా అని జ్ఞానాంబ అఖిల్ కు డబ్బులు ఇస్తుంది. అయితే అక్కడ మంచి మార్కులు కొట్టేయాలి అని అఖిల్ డబ్బులు వద్దని నేను నా కెరీర్ పై ఫోకస్ చేయాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. అంతే కాకుండా ఒక కోర్స్ నేర్చుకుంటుంన్నట్లు చెబుతూ అది పూర్తయ్యే వరకు ఎక్కడికి వెళ్లాలని అనుకోవట్లేదని కూడా అంటాడు. ఇక అఖిల్ పూర్తిగా మారిపోయాడు అని ఇంట్లో వాళ్ళందరు మరోసారి నమ్ముతారు. ఇక మరోవైపు రామ తన తప్పును సరిదిద్దుకోవాలి అని జానకి మళ్ళీ తన చదువును కొనసాగించేలా చేయాలని అనుకుంటాడు. మరి ఆ విషయంలో అతను ఏ విధంగా ఆలోచిస్తాడో చూడాలి.
Janaki
Kalaganaledu
November
23rd:
అందుకే
నా
ఐపీఎస్
డ్రీమ్
వదిలేసుకున్నా..
భర్తకు
షాక్
ఇచ్చిన
జానకి

నవంబర్ 24 వ ఎపిసోడ్
జానకి, రామ మాట్లాడుకుంటున్న విషయాన్ని మల్లిక కనిపెడుతుంది. మొత్తానికి జానకి ఐపిఎస్ చదవడం వదిలేసింది అని అయితే అందుకు గల కారణం ఏమిటో తెలుసుకోవాలి అని ఆమె వారిని ఫాలో అవ్వాలని అనుకుంటుంది. అయితే ఈ వంకతో మల్లిక ఎంతో సంతోషంగా ఉంటుంది. కింద పడిపోతూ ఉంటే జ్ఞానాంబ పట్టుకుంటుంది. ఇక మల్లిక గదిలోకి వెళ్ళిన తర్వాత జానకితో మరొక విధంగా మాట్లాడుతుంది. ఈ దొంగ ప్రెగ్నెన్సీ గురించి ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని అంటుంది. దీంతో ఆ విషయం ఎవరికి తెలియదు అని మల్లికా మరొక కౌంటర్ ఇస్తుంది. మరి ఈ విషయంలో జానకి ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి.
Janaki
Kalaganaledu
November
24th:
అఖిల్
విషయంలో
గోవిందరాజులు
అనుమానం..
మల్లిక
కౌంటర్

నవంబర్ 25వ ఎపిసోడ్
మల్లిక, జానకి మాటలను పెద్దగా పట్టించుకోదు కానీ జానకి తన అత్త కోపం గురించి మరోసారి గుర్తు చేస్తుంది. అప్పుడు నిన్ను ఎవరు కాపాడలేరు అని కూడా చెప్పడంతో మల్లిగా మళ్ళీ టెన్షన్లో పడిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం అందరూ కూడా శివాలయం కు వెళతారు. అక్కడ హోమం కూడా చేయమని చెబుతారు. ఇక కోనేటిలో దీపాలను వదలాలని కూడా పంతులుగారు చెప్పడంతో జానకి రామచంద్ర ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. ఇక అఖిల్ మాత్రం జెస్సి పై ప్రేమ ఉన్నట్లుగా నాటకమాడుతూ ఉంటాడు. మరోవైపు జానకి తన చదువు విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉంటాడు. అయితే తీరని కోరికలు మాత్రం కోరుకోవద్దని జానకి చెబుతుంది. ఇక మరోవైపు పక్కనే ఉన్న చిన్న కోడలు మల్లిక, జానకి దీపం ఎలాగైనా ఆర్పేయాలి అని నీళ్లను అటువైపుగా తోస్తుంది. ఆమె అలా చేస్తూ ఉండడంతో జానకి చూస్తుంది. మరి ఈ విషయంలో జానకి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Janaki
Kalaganaledu
November
25th:
కోడలిని
కాపాడిన
జ్ఞానాంబ..
జానకి
విషయంలో
రామ
ఛాలెంజ్