Janaki Kalaganaledu Weekly Roundup: అఖిల్ పోలీస్ స్టేషన్ గొడవలు.. మరో సమస్యలో జానకి కాపురం
జానకి కలగనలేదు సీరియల్ నవంబర్ రెండవ వారం కూడా మరింత ఆసక్తికరమైన కథాంశంతో ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ మొదట్లో కాస్త నిరుత్సాహంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే నవంబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

అక్టోబర్ 7వ ఎపిసోడ్
స్వార్థంగా ఆలోచించకూడదు అని ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటే ఎలాంటి భేదాలు కూడా చూపకూడదని అందరికి న్యాయం చేసేలా ఉండాలి అని జానకి ప్రమాణం చేస్తుంది. ఇక ఇప్పుడు తన కుటుంబం కోసం ఆలోచించి అఖిల్ ను కాపాడాలని అనుకోవడం తప్పు అవుతుంది అని.. నిజం తెలుసు కాబట్టి వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని కూడా జానకి అనుకుంటుంది. అనుకున్నట్లే జానకి మదూరిని కొట్టినందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి అఖిల్ మీద కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు జ్ఞానాంబ ఇంటికి వెళ్లి అఖిల్ ను అరెస్ట్ చేస్తున్నట్లు చెబుతారు. అయితే జ్ఞానాంబ మాత్రం ఈ ఒక్కసారికి పోలీసులను వెళ్ళమని చెప్పు తర్వాత దీని గురించి మాట్లాడదామని నచ్చ చెప్పాలని చూస్తుంది. కానీ జానకి సమయం లేదు అంటూ అందుకు అవకాశం కూడా లేదు అని చెబుతుంది.

నవంబర్ 8వ ఎపిసోడ్
అయితే అఖిల్ మాత్రం తనకు ఏమీ తెలియనట్టుగా అబద్ధాలు చెబుతూ ఉంటాడు. అసలు మాధురి అనే అమ్మాయి కూడా ఎవరో తెలియదు అని జానకి వదిన అనవసరంగా నన్ను ఈ కేసులో విరిపించాలని చూస్తోంది అంటూ అఖిల్ మళ్ళీ అబద్ధాలు చెబుతూ ఉంటాడు. దీంతో ఇంట్లో వాళ్ళు మళ్లీ కన్ఫ్యూజన్లో పడతారు. గోవిందరాజులు కూడా ఈ విషయం గురించి మరోసారి ఆలోచించాలి అని అఖిల్ జైలుకు వెళితే అతని భవిష్యత్తుకు కూడా ప్రమాదమేనని జానకికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఎంత చెప్పినా కూడా జానకి కళ్లారా చూసాను అని చెప్పడంతో పోలీసులు కూడా అఖిల్ ను అరెస్టు చేసి తీసుకు వెళుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో రామచంద్ర మాత్రం జానకితో కొంత విభేదించే ప్రయత్నం చేస్తాడు.

నవంబర్ 9వ ఎపిసోడ్
ఇక అఖిల్ అలాంటి తప్పు చేయడు అని చిన్నప్పటి నుంచి అతన్ని నేను చూస్తున్నాను అని రామ అంటాడు. అంతేకాకుండా మీరు ఐపీఎస్ తరహాలో ఆలోచిస్తూ కుటుంబం గురించి పట్టించుకోవడం లేదు అని అనడంతో జానకి మరోసారి షాక్ అవుతుంది. ఇప్పటివరకు చదువు విషయంలో ఎంతగానో సపోర్ట్ చేసిన రామచంద్ర ఇలా మాట్లాడడంతో జానకి మౌనంగా ఉండిపోతుంది.

నవంబర్ 10 వ ఎపిసోడ్
అఖిల్ పోలీస్ స్టేషన్లో ఒక్క నిమిషం కూడా ఉండలేను అన్నయ్య నన్ను వెంటనే విడిపించు అని రామను బ్రతిమాలితాడు. ఇక రామచంద్ర తప్పకుండా నిన్ను విడిపిస్తాను అని అంటాడు. జానకి కేసు వెనక్కి తీసుకుంటేనే అఖిల్ విడిపించడం జరుగుతుందని పోలీసులు కూడా చెప్పడంతో రామచంద్ర మరొకసారి జానకి తో మాట్లాడాలని అనుకుంటాడు. మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆలోచిస్తూ ఇంటి గురించి మర్చిపోతున్నారు అని ఇది ఎంత మాత్రం న్యాయం కాదు అని రామచంద్ర మరోసారి ఊహించిన విధంగా మాట్లాడతాడు. దీంతో రామా ఆ విధంగా మాట్లాడడంతో జానమి మరింత బాధపడుతూ ఉంటుంది.

నవంబర్ 11వ ఎపిసోడ్
ఇక అఖిల్ పోలీస్ స్టేషన్ లో ఎంతో బాధగా కనిపిస్తాడు. అసలు నేను ఏ తప్పు చేయలేదు అని ఒక అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడేంత చెడ్డవాడిని కాదు అని అఖిల్ అబద్ధాలు చెబుతాడు. ఇక దాన్ని చూసి జ్ఞానాంబ కుటుంబ సభ్యులు కూడా నమ్మేస్తారు. మరోవైపు మల్లిక జానకి పై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది. అయితే జానకి మాత్రం మల్లికకు అవకాశం ఇవ్వకుండా నీ దొంగ ప్రెగ్నెన్సీ విషయం గురించి తర్వాత ఆలోచిస్తాను అని ముందు ఈ సమస్య పూర్తవ్వని చెబుతాను అని సవాల్ విసురుతుంది.


Click it and Unblock the Notifications











