Janaki Kalaganaledu Weekly Roundup: మల్లిక ప్లాన్ తో టెన్షన్ గా మారిన అఖిల్.. జానకి అలెర్ట్!

జానకి కలగనలేదు సీరియల్ ప్రతీ వారం కూడా మరింత పెరుగుతోంది. మొదట్లో ఈ సీరియల్ కాస్త నీరసంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి, అఖిల్ జెస్సి ప్రేమ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

అఖిల్ ద్వారా ప్లాన్

అఖిల్ ద్వారా ప్లాన్

జెస్సి ఆలోచనకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలి అని ఆమె అత్తగారికి ఏ మాత్రం దగ్గరవ్వకూడదు అని అందుకు అఖిల్ ద్వారా ప్లాన్ వేయాలని అనుకుంటుంది. అఖిల్ కు కూడా మల్లిక లేని పోనీ మాటలు చెబుతూనే ఉంటుంది. నిన్ను మీ అమ్మకు దూరం చేయాలి అని ని భార్య ఆలోచిస్తుంది అని చెప్పడంతో అఖిల్ కూడా ఎలాగైనా జెస్సి దూకుడుకు తాళం వేయాలని అనుకుంటాడు. మరోవైపు జానకి చదువులో అశ్రద్ధ చేస్తుంది అని ఇంట్లో సమస్యల గురించి ఆలోచించి తన చదువు గురించి పట్టించుకోవడం లేదు అనే రామ కొంత అలకతో ఉంటాడు.

అలా ఏమీ లేదు అని ఒకవైపు ఇంటి కోడలిగా నా బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది అని చదువుకునేందుకు సమయం కూడా కేటాయిస్తాను అని అంటుంది. అదే సమయంలో అత్త జ్ఞానాంబ మిగతా ఇద్దరు కొడళ్ళు కడుపుతో ఉన్నారని కాబట్టి వారికి పాలల్లో కుంకుమ పువ్వు వేసి ఇవ్వాలని అంటుంది. ఇక జానకి తోడికోడళ్ళ విషయంలో ఇంకా బాధ్యత ఉండాలని అనుకుంటుంది.

సమయాన్ని వృధా చేయకూడదు

సమయాన్ని వృధా చేయకూడదు

జానకి విషయంలో రామచంద్ర సంతృప్తితో ఉంటాడు. మీరు చదువుకోవాలి అని సమయాన్ని వృధా చేయకూడదు అని నేను చెప్పినప్పటికీ పట్టించుకోవడంలేదని అనవసరంగా ఇంట్లో బాధ్యతలను నెత్తిన పెట్టుకుంటున్నారు అని రామా అసహనం వ్యక్తం చేస్తాడు. కానీ జానకి మాత్రం రెండు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తేనే బాగుంటుంది అని వివరణ ఇస్తుంది. అలాగే అఖిల్ జెస్సీ మధ్యలో జరిగిన గొడవ గురించి కూడా చెబుతుంది.

మనం కష్టపడి వారికి పెళ్లి చేసింది సంతోషంగా ఉండాలి అని ఇప్పుడు వారు అలా ఉంటే పట్టించుకోకుండా ఉండకపోవడం ఏమాత్రం మంచిది కాదు అని జానకి అర్థమయ్యేలా చెబుతుంది. అందుకు రామచంద్ర కూడా సరే అని ఇప్పుడు అయితే మీరు చదువుకోండి అని అంటాడు.

జానకిపై అఖిల్ అసహనం

జానకిపై అఖిల్ అసహనం

జానకి వచ్చి జెస్సి తప్పు లేకపోయినా ఎందుకు అంటున్నావు అని అడుగుతుంది. ఇక ఆ పక్కనే ఉన్న మల్లిక ఒకవైపు జానకిని సపోర్ట్ చేస్తూనే మరొకవైపు అఖిల్ కు కోపం వచ్చేలా చేస్తుంది. దీంతో అఖిల్, జానకి పై మరింత అసహనం వ్యక్తం చేస్తాడు. నువ్వు నీ ఐపిఎస్ చదువు కోసం మా అన్నయ్యను అలాగే అమ్మను మోసం చేశావు.

అదేమీ పెద్ద తప్పు కాదు. కానీ నేను చేసింది మాత్రం పెద్ద తప్పు అని అందరి ముందు దోషుల నిలబెట్టారు అని మరింత ఘాటుగా మాట్లాడుతాడు. దీంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అఖిల్ మాటలకు జానకి కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జానకి బాధపడుతూ ఉండడంతో మల్లికా మళ్ళీ సంతోషపడుతుంది. ఈ దెబ్బతో జానికి ఆలోచన మారిపోతుంది అని ఆమె చదువుపై దృష్టి పెట్టదు అని సంతోషపడుతుంది.

అఖిల్ వలన బాధలో జ్ఞానాంబ

అఖిల్ వలన బాధలో జ్ఞానాంబ

జ్ఞానాంబ గోవిందరాజులు హాల్లో ఉండి అఖిల్ విషయం గురించి బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన జానకి రామచంద్ర అఖిల్ ఇలా కావడానికి మీరు మాట్లాడకపోవడమే కారణం అని జ్ఞానాంబకు చెబుతారు. నువ్వు ఉంటే వాడికి ఎంతో ఇష్టం కదమ్మా అందుకే వాడు నువ్వు మాట్లాడకపోతే అయితే ఇలా అయ్యాడు అనిపిస్తుంది అని రామా చెప్పడంతో జ్ఞానాంబ ఆలోచనలో పడుతుంది.

మరి కొడుకు మీద ఉన్న కోపాన్ని జ్ఞానాంబ కూడా తగ్గించుకుంటుందో లేదో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X