Janaki Kalaganaledu Weekly Roundup: మరోసారి తప్పు చేసి జానకి కంట పడిన అఖిల్.. ఊహించని ట్విస్ట్

జానకి కలగనలేదు సీరియల్ నవంబర్ మొదటి వారం కూడా మరింత ఆసక్తికరమైన కథాంశంతో ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ మొదట్లో కాస్త స్లోగా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

Photos Courtesy: Star మా and Disney+Hotstar

అక్టోబర్ 31వ ఎపిసోడ్

అక్టోబర్ 31వ ఎపిసోడ్

మరొకవైపు మల్లిక దొంగ ప్రెగ్నెన్సీ విషయంలో జానకికి అసలు నిజం తెలిసిపోయింది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నీలావతికి ఏదైనా సలహా ఇస్తుందేమో అని ఫోన్ చేస్తుంది. కానీ ఆమె ఎంత ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక తర్వాత జ్ఞానాంబ అసలు విషయం తెలుసుకుని మల్లికను నిలదీసే ప్రయత్నం చేస్తుంది. ఇక మల్లిక గర్భవతి కాదు అని తెలుసుకున్న అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక భర్త విష్ణు అయితే మల్లికను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని హెచ్చరిస్తాడు. వెంటనే మీ ఇంటికి వెళ్లి మీ అమ్మ నాన్నలతో మాట్లాడి మళ్ళీ ఇక్కడికి రా అని విష్ణు చెప్పడంతో మల్లిక ఏడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా మొదట నేను గర్భవతి అని అనిపించింది కానీ ఆ తర్వాత మళ్ళీ కాదు అని తెలిసింది.. అని మల్లిక మరో మాట మాట్లాడుతుంది.

నవంబర్ 1వ ఎపిసోడ్

నవంబర్ 1వ ఎపిసోడ్

మరొకవైపు అఖిల్ మాదకద్రవ్యాలు సప్లై చేసే డ్యూటీలోకి ఎక్కుతూ ఉండగానే మరోవైపు జానకి తన ఐపీఎస్ కు సంబంధించిన ప్రమాణాలలో బిజీగా ఉంటుంది. నా కర్తవ్యం లో కుటుంబం లోని వారు తప్పు చేసినా కూడా ఏమాత్రం వదిలిపెట్టను అని జానకి ప్రమాణం చేస్తూ ఉంటుంది. మరి అఖిల్ డ్రగ్స్ సప్లయర్ గా మారడంతో అతనికి జానకి ఎలాంటి అడ్డుకట్ట వేస్తుంది? ఆ తర్వాత జానకి ఇంట్లో పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొంటుంది? అనేది ఆసక్తిగా మారింది.

 నవంబర్ 2వ ఎపిసోడ్

నవంబర్ 2వ ఎపిసోడ్

రామచంద్ర చిన్న తమ్ముడు అఖిల్ మాదకద్రవ్యాలు తన కాలేజీలోనే అమ్ముతూ ఒక అమ్మాయికి దొరికిపోతాడు. నువ్వు ఏదో తప్పు చేస్తున్నావ్ అంటూ ఆమె నిలదీసే ప్రయత్నం చేస్తుంది. ఇక పోలీసులకు చెప్పే ప్రయత్నంలో అఖిల్ ఆమెను అడ్డుకుంటాడు. ఒక కర్ర తీసుకొని కొట్టడంతో ఆమె రక్తంతో కింద పడిపోతుంది. ఇక జానకి ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తుంది. మరి జానకి తన మరిది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

నవంబర్ 3 వ ఎపిసోడ్

నవంబర్ 3 వ ఎపిసోడ్


అఖిల్ ఇంటికి రాగానే తల్లి జ్ఞానాంబ, తండ్రి గోవిందరాజులు ఎదురుపడతారు. టెన్షన్ గా ఉంటే వాళ్ళు అనుమానిస్తారు అని ఏమీ తెలియనట్టుగా అఖిల్ తాను చాలా మారిపోయాను అని చదువుకోడానికి కాలేజీకి వెళ్లి వస్తున్నాను అని అంటాడు. ఇక జ్ఞానాంబ కూడా అఖిల్ చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నాడు అని అనుకుంటారు. ఇక మరొకవైపు జానకి మాధురి రక్తపు మడుగులో మునిగి ఉండడంతో వెంటనే హాస్పిటల్ లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. ఇక అందరూ ఇంట్లో మాట్లాడుకుంటున్న తరుణంలో అఖిల్ కూడా వస్తాడు. జానకి ఒక విషయం మాట్లాడాలి అని అత్తగారికి చెబుతుంది. మరి అఖిల్ చేసిన తప్పు గురించి ఇంట్లో జానకి ఏ విధంగా చెబుతుంది ఇక అతన్ని డ్రగ్స్ బారి నుంచి ఎలా తప్పిస్తుంది? అనే ట్విస్ట్ మొదలైంది.

నవంబర్ 4వ ఎపిసోడ్

నవంబర్ 4వ ఎపిసోడ్

తర్వాత జానకి అఖిల్ తో మాట్లాడాలి అని అనుకుంటుంది. అఖిల్ మాధురిని కొట్టిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలి అని జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇక తాను మారిపోయాను అని పుస్తకాలు పట్టుకొని చదువుకుంటున్నట్లు అఖిల్ బిల్డప్ ఇస్తాడు. ఇక జానకి అతన్ని మరింత అనుమానిస్తుంది. నీకోసం బయట ఎవరో వచ్చారు అని మాధురి గురించి అడిగారు అని చెప్పడంతో అతను ఒక్కసారిగా టెన్షన్ పడతాడు. ఇక అఖిల్ బయటకు వెళ్లి చూస్తే ఎవరూ ఉండరు. కానీ జానకి అప్పుడే ఎవరు రాలేదు అని అంటుంది. మరి వీరి మధ్య సంభాషణ ఇలాంటి పరిస్థితులకు దారితీస్తుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X