Janaki Kalaganaledu Weekly Roundup: బయటపడిన జానకి అసలు విషయం.. మరో కొత్త ట్విస్ట్
ఇటీవల కాలంలో టెలివిజన్ సీరియల్స్ లలో మంచి క్రేజ్ అందుకుంటున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు టాప్ లిస్ట్ లో ఉంది అని చెప్పవచ్చు. రోజురోజుకు ఈ సీరియల్ రేటింగ్ కూడా మరింత ఎక్కువగా పెరుగుతుంది. మొదట్లో ఈ సీరియల్ కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం
కూడా అంటే జూలై 18 నుంచి జూలై 22 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి చదువు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

జూలై 18వ ఎపిసోడ్
అత్తగారి కోరిక మేరకు ఇంట్లోకి వారసుడని తొందరగా ఇవ్వాలి అని జానకి తన భర్తతో కలిసేందుకు ఇష్టపడుతుంది. ఒకవైపు చదువును సాగిస్తూనే మరొకవైపు కోడలిగా తన బాధ్యతను నిర్వహించాలి అని జానకి తన భర్తను కూడా సంతోష పెట్టాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం భార్య చదువు గురించి ఆలోచించి ఆమెకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆమె ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

జూలై 19వ ఎపిసోడ్
రామా జానకి ఏకాంతంగా ఉండాలి అని అత్త జ్ఞానాంబ కూడా ఎంతగానో ఆలోచించి వారి కోసం ప్రత్యేకంగా శోభనం గదిని కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక వారి కోరిక గురించి తెలుసుకున్న జానకి ఎలాగైనా వారసుడిని ఇవ్వాలని భర్తను తన వైపుకు తిప్పుకోవాలని అనుకుంటుంది ఈ క్రమంలో జానకి చదువుకో ఆటంకం కలుగుతుంది అని రామచంద్ర ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు. ఆమెకు పదేపదే తన చదువును గుర్తు చేస్తున్నప్పటికీ కూడా జానకి ఇంటికి వారసుడికి ఇవ్వాల్సిన బాధ్యత తనకు ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది.

జూలై 20వ ఎపిసోడ్
ఇక తోడికోడలు కంటే ముందుగా తనే ఈ ఇంట్లోకి వారసుడుని ఇవ్వాలి అని చిన్న కోడలు మల్లిక అనుకుంటుంది. అందుకే వారిద్దరు కూడా ఏమాత్రం కలవకుండా ఉండాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో మల్లికికి జానకికి దెబ్బ తగిలే విధంగా అరటి తొక్కను వేస్తుంది. ఇక తర్వాత కింద పడిపోయిన జానకి చాలా నొప్పిగా ఉంది అంటూ రెస్ట్ తీసుకుంటుంది. కానీ నిజానికి జానకి తొక్కపై కాలు వేయదు. కేవలం రామచంద్రతో ఆరోజు ఏకాంతంగా గడపాలి అని అతనిని స్వీట్ షాప్ కు వెళ్లకుండా చేయాలి అని అలా ప్లాన్ చేస్తుంది.

జూలై 21వ ఎపిసోడ్
ఇక ఇంతలో జానకి ఐపిఎస్ చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు కోచింగ్ సెంటర్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ అంతకుముందే జానకి ఏమాత్రం చదువుకోకూడదు అని అత్తగారు జ్ఞానాంబ కండిషన్ పెడుతుంది. ఆమె సర్టిఫికెట్స్ తీసుకొని తన దగ్గర దాచుకుంటుంది. ఇక ఇప్పుడు సర్టిఫికెట్లు అవసరం కావడంతో ఎలాగైనా అత్తగారి నుంచి వాటిని తీసుకోవాలని కూడా జానకి ఆలోచిస్తుంది.

జూలై 22వ ఎపిసోడ్
ఇక జానకి తన చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు తప్పక అవసరం కావడంతో చదువుకుంటున్న విషయాన్ని ఇంట్లో చెప్పాలని అనుకుంటుంది. ఇక రామచంద్ర తో ఆ విషయం గురించి మాట్లాడుతుండగా అప్పుడే జానకి మామ గారు అయినా గోవిందరాజులు అసలు నిజం తెలుసుకుంటారు. ఈ విషయం మీ అమ్మకు తెలిస్తే పరిస్థితి ఏమిటి అని తన కొడుకును ప్రశ్నిస్తాడు. కానీ తన భార్య చిన్నప్పటి నుంచి ఐపీఎస్ కావాలని కలలు కనింది అంటూ ఆమె కలను నెరవేర్చవలసిన బాధ్యత తనకు ఉంది అని అందుకే నేనే ఆమెను చదివిస్తున్నాను అని చెబుతాడు. దీంతో గోవిందరాజులు కూడా అందుకు ఏమీ అనలేకపోతాడు. ఇక రామచంద్ర తన తండ్రి ద్వారానే తల్లి దగ్గర నుంచి సర్టిఫికెట్స్ తీసుకోవాలని ఆలోచిస్తాడు. మరి జ్ఞానాంబ తన భర్త గోవిందరాజులు మాటల కారణంగా జానకికి సర్టిఫికెట్స్ ఇస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











