Janaki Kalaganaledu Weekly Roundup: కోపంతో జ్ఞానాంబ నిర్ణయాలు.. మల్లిక చేతికి పెత్తనాలు
ఈ మధ్య కాలంలో టెలివిజన్ సీరియల్స్ లలో మంచి క్రేజ్ అందుకుంటున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు టాప్ లిస్ట్ లో ఉంది అని చెప్పవచ్చు. ఈ సీరియల్ రేటింగ్ కూడా రోజురోజుకు మరింత ఎక్కువగా పెరుగుతోంది. మొదట్లో ఈ సీరియల్ కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం
కూడా అంటే జూలై 25 నుంచి జూలై 29 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి చదువు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

జూలై 25వ ఎపిసోడ్
ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని జానకి నిరంతరం కష్టపడుతుంది. కానీ చదువుకున్న కోడలు అంటే అత్త జ్ఞానాంబకు ఇష్టం ఉండదని జానకికి తెలుసు. అయినా కూడా జానకి భర్త సహకారంతో ఇన్స్టిట్యూట్ కు వెళుతుంది. గతంలో చదువుకోను అని అత్తకు మాట ఇచ్చిన జానకి తన దగ్గర ఉన్న డిగ్రీ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చేస్తుంది. కానీ వాటి అవసరం రావడంతో మళ్ళీ జ్ఞానంబకు తెలియకుండా ఆమె రామ, జ్ఞానాంబ గది నుంచి వాటిని దొంగతనంగా తీసుకుంటారు.

జూలై 26వ ఎపిసోడ్
జానకి విషయంలో జ్ఞానాంబ అసలు నిజం తెలుసుకుంటుంది. ఆమె చదువు విషయంలో మరో ఆలోచన లేకుండా లేకుండా ఉండాలని మాట తీసుకున్నా కూడా అదేమీ లెక్క చేయకుండా జానకి మోసం చేయడం జ్ఞానాంబ తట్టుకోలేకపోతుంది. అందుకే ఆమె ఎవరికి తెలియకుండా అలా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో జ్ఞానాంబను వేతకడానికి జానకి రామచంద్ర చాలా ప్రయత్నాలు చేస్తారు.

జూలై 27వ ఎపిసోడ్
జ్ఞానాంబ ఫైనల్ గా ఒక చెరువు దగ్గరకు వెళ్లి ఆగిపోతుంది. ఇక ఆమెను చూసిన రామ వెంటనే బ్రతిమాలి ఇంటికి తీసుకు వస్తారు. ఇక రామ జానకి విషయంలో జ్ఞానాంబ చాలా సీరియస్ గా ఉంటుంది. తనను నమ్మించి మోసం చేసారని నా కొడుకు భవిష్యత్తు కోసం నేను ఆలోచిస్తే తగిన శాస్తి జరిగిందని బాధపడుతుంది. ఇక మరోవైపు మల్లిక గొడవల వలన జానకి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అని హ్యాపీగా ఉంటుంది.

జూలై 28వ ఎపిసోడ్
కొడుకు కోడలు చేసిన మోసం వలన జ్ఞానాంబ ఎవరితో మాట్లాడకుండా ఇంట్లోనే తలుపులు పెట్టుకొని ఒంటరిగా ఉంటుంది. ఇక ఆమెను నిజం చెప్పాలని గతంలోనే జానకి ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితులు అనుకూలించావు. దానికి తోడు రామచంద్ర కూడా రెండేళ్ళ వరకు చదువును కొనసాగిస్తే అంతా సర్దుకుంటాయని జానకిని నిజం చెప్పనివ్వకుండా అడ్డుకుంటు ఉంటాడు.

జూలై 29వ ఎపిసోడ్
జ్ఞానాంబ మరుసటి రోజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉందని చెబుతుంది. అందరూ కూడా ఉదయం ఏర్పాట్లు చేయాలని అంటుంది. అయితే జానకి రామ కూడా పనులు చేస్తుండగా జ్ఞానాంబ వారిని పట్టించుకోదు. వారు ఎదురుగా ఉన్నా కూడా మాట్లాడదు. ఇక ఇంట్లో వ్యవహారాలు అన్ని కూడా చిన్న కోడలు మల్లికకు అప్పగిస్తుంది. అన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని చెబుతుంది. ఇక జ్ఞానాంబ మౌనాన్ని భయంగా చూస్తున్న జానకి మరి అత్తగారికి ఎలా దగ్గరవుతుందో నెక్స్ట్ వారం ఎపిసోడ్స్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











